పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, జులై 2010, బుధవారం

ఆషాడమాసం...

జీవితం ఎప్పుడూ రొటీన్ గా వుంటే ఏమి బాగుంటుంది.
ఎప్పుడూ ఏదో ఒక విశేషం వున్న జీవితం నిత్య నూతనంగా వుంటుంది.
కాడ్బరీస్ చాక్లెట్ యాడ్ లాగా తియ్యని వేడుక చేసుకోవటానికి ఏదో ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూడాలి
అందిన అవకాశాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి ఇది నా అభిప్రాయం.

ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇది ఆషాడమాసం కదా
సంవత్సరంలో కొన్ని నెలల లాగా ఎలాంటి విశేషం లేకుండా ఉండకుండా
కొన్నిచిన్న చిన్న సరదాలు తెచ్చే ఆషాడమాసం అంటే నాకు చాలా ఇష్టం.

ఆషాడమాసం లో కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు కలిసి వుండకూడదు.అత్తా,కోడలు ఒకే గడప దాటి నడవకూడదు ఇది ఆషాడం లో ముఖ్యమైన నియమం.
ఇది మన పెద్దలు ఎందుకు పెట్టారో తెలియదు కానీ తర్వాత కాలంలో దీనికి "సైంటిఫిక్ రీజన్స్" కనిపెట్టేసారు.

గోరింటాకు

ఆషాడం లో ఆరుసార్లు గోరింటాకు పెట్టుకోవాలన్నది నాకు చాలా చాలా నచ్చే సరదా...
గోరింటాకు అంటే గోరింటాకే పెట్టుకోవాలి లేకపోతే మానేయాలి ఇది నా నిర్ణయం.

మా చెల్లి కోన్ తో మంచి డిజైన్లు పెడుతుంది కానీ నాకు అస్సలు ఇష్టముండేది కాదు కోన్ తో మెహంది పెట్టుకోవటం.
అయితే గోరింటాకు ఎప్పుడు దొరకదు కదా అందుకని ఆషాడం లో ఇంటిదగ్గరకి అమ్మడానికి వచ్చే గోరింటాకు కోసం ఎదురు చూసి కొనుక్కుని పెట్టుకుంటే ఆ ఎర్రగా పండిన గోరింటాకు చేతుల అందం,చేతులకి ఆ గోరింటాకు వాసనా ఎంత బాగుంటుందో...

ఈ సంవత్సరం మాత్రం నా గోరింటాకు సరదా తీరిపోయింది.
మేము ఇప్పుడుండేది రూరల్ ఏరియా కావటంతో మా పనిమనిషి పని కట్టుకొని మరీ
నాకు గోరింటాకు తెచ్చి పెడుతుంది. ఒక్క ఈ నెలలోనే కాదు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.

ఆషాడంలో వచ్చే మరో సంబరం బోనాలు.


ఆషాడం లో మహంకాళి భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యమే ఈ బోనాలు.
ఈ పండుగ ఎక్కువగా హైదరాబాద్,తెలంగాణా,ప్రాంతాలో చేస్తుంటారు.
పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు,నగలతో, తలమీద బోనాల కుండతో అమ్మవారి స్వరూపాల్లాగా వుంటారు.

మా చిన్నప్పటినుండి మా అమ్మ అమ్మవారి పూజ చేసేది కాబట్టి
మా వూరికి దగ్గరలో వున్న నిదానంపాడు అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించటం
మాకు ఎప్పటినుండో వస్తున్నఆచారం.
హైదరాబాద్ లో జరిగే బోనాలు లాగానే వుంటుంది ఇక్కడి బోనాల పండగ కూడా.

ఆషాడం డిస్కౌంట్ సేల్...


ఆషాడంలో మా కుటుంబం అందరికీ నచ్చే అతి పెద్ద సరదా ఆషాడం ఆఫర్లలో బట్టల షాపింగ్ చేయడం.
అంటే మిగతా రోజుల్లో బట్టలు కొనము అని కాదు ..
ఎవరు ఏమనుకున్నా కానీ... డిస్కౌంట్ లో షాపింగ్ చెయ్యటం చాలా సరదాగా వుంటుంది.

హైదరాబాద్ చైతన్యపురి సాయిబాబా గుడి దగ్గరినుండి మొదలవుతుంది మా షాపింగ్
ఈ నెలలో సాయంత్రాలు షాపింగ్ కి ఆ ప్రాంతానికి వెళితే చాలు కళ కళలాడుతూ విద్యుత్ దీపాల వెలుగులతో, రకరకాల ఆఫర్లతో సరికొత్త షాపింగ్ ప్రపంచం మనకు స్వాగతం పలుకుతుంటే మనల్ని మనం నిగ్రహించుకోగలమా షాపింగ్ చేయకుండా...

ఇవీ ప్రతి సంవత్సరం ఆషాడంలో నా చిన్నిప్రపంచంలో మా సరదాలు...
ప్రస్తుతానికి ఆషాడంని ఎంజాయ్ చేస్తూ రాబోయే శ్రావణమాసం శుభప్రదంగా వుండాలని కోరుకుంటూ ....

రాజి

14 కామెంట్‌లు:

Manjusha kotamraju చెప్పారు...

గొరింటాకు అంటె నాకు కుడా భలె ఇష్టం అండి,,,తప్పకుండా పెట్టుకుంటాను ఆషాఢం లొ ప్రతి సారి..మీ గొరింట భలె పండింది,,

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారూ థాంక్స్ అండీ...
ఈ ఆషాడంలో గోరింటాకు పెట్టుకున్నారా మరి...

మాలా కుమార్ చెప్పారు...

నాకూ , కోన్ కంటే మామూలి గోరంటాకే ఇష్టం . ఆ సువాసన చాలా బాగుంటుంది .
మీ ఆషాడం కబుర్లు బాగున్నాయి .
మీ గొరంట బాగా పండింది .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలా కుమార్ గారూ థాంక్స్ అండీ.
మీలాంటి పెద్దవాళ్ళ అభిరుచులతో నా అభిరుచులు కలిసినందుకుకు నాకు చాలా సంతోషంగా వుంది.

Manjusha kotamraju చెప్పారు...

ఆహ నిన్ననె పెట్టెసుకున్నానండి,,చక్కని మందారం లా పండింది,,

జయ చెప్పారు...

మీ ఆషాఢ మాసం చాలా బాగుందండోయ్!!! గోరింటాకు ఆరు సార్లు పెట్టుకోవాలా ? అది నాకు తెలియదే!!! ఒకసారిమాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. బోనాలు కూడా చాలా సరదాగా ఉంటుంది. నేను ప్రతి ఏడాది మా పనిమనిషికి అన్ని వస్తువులూ ఇస్తాను. తనతోపాటు నాకు కూడా బోనాలు చేస్తుంది:) ఆషాఢం సంబరం తీరలేదా, పోన్లెండి..ఒక్కనెల కూడా ఎడబాటు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండండి. సరేనా....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారూ గోరింటాకు మందారంలా పండితే మంచి భర్త వస్తాడంటండీ మా అమ్మ చెపుతుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ ముందుగా మీ మంచి మనసుతో మమ్మల్ని ఎప్పుడూ కలిసి మెలిసి వుండమని మీరు ఇచ్చిన దీవెనలకి చాలా థాంక్స్ అండీ..
ఆషాడంలో ఆరుసార్లు గోరింటాకు పెట్టుకోవాలని మా అమ్మమ్మ,అమ్మ అందరూ చెప్పే మాటండీ మరి..:)
ఈసారి బోనాలు ఎప్పుడు చేయిస్తున్నారు?

Green Coconut చెప్పారు...

అసలు అషడమసం మన పెద్దలు ఎందుకు పెట్టరు. మీరు కారనం తెలియ పరస లెదు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

kishore.guthula గారూ

పూర్వాపరాలు,మూల కారణాలు చెప్పుకుంటూ పోవటానికి నాకు అన్ని విషయాలు సరిగ్గా తెలియకపొవచ్చు,

పోనీ ఎవరినైనా అడిగి తెలుసుకొని,పురాణాలు,పంచాంగాలు చదివి మీ అన్ని సందేహాలు నివ్రుత్తి చేస్తూ పోతే ఈ ఆషాడం అంతా నాకు ఆషాడం గురించి తెలుసుకోవడమె
సరిపోతుందెమో అందుకే
నా చిన్నిప్రపంచం లో నా ఈ చిన్ని ఆషాడం పోస్టింగ్.

అజ్ఞాత చెప్పారు...

గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంత ముద్దొస్తాయో ...ఆ సువాసన కూడా భలే వుంటుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అవునండీ లలిత గారూ.
గోరింటాకు ఎరుపు,ఆ సువాసన ఎంతో బాగుంటుంది.
ఇంతకీ మీ అమ్మాయితో ఈ ఆషాడం గోరింటాకు తంటా తీరిందా లేదా?

swapna@kalalaprapancham చెప్పారు...

naaku kuda gorintaku ante chala ishtam. suvaasana super ga untundi. kaani naku ekkada dorakadam ledu ayyo ayyyo :(

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అయ్యయ్యో స్వప్న గారూ మీకు గోరింటాకు దొరకలేదా?
ఈ ఆషాడంలో ప్రతి చోటా గోరింటాకు అమ్మటానికి వస్తుందండీ
ప్రయత్నించండి,లేకపోతే మెహెందీ కోన్ తో అడ్జస్ట్ అయిపోండి.
All The best...:)

Related Posts Plugin for WordPress, Blogger...