పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

17, అక్టోబర్ 2010, ఆదివారం

శ్రీ రాజరాజేశ్వరీదేవి - విజయదశమి .


శ్రీ రాజరాజేశ్వరీదేవి - విజయదశమి.17-10-10






16, అక్టోబర్ 2010, శనివారం

శ్రీ మహిషాసురమర్దనీ- దేవిమహర్నవమి


శ్రీ మహిషాసురమర్దనీ దేవి-మహర్నవమి.16-10-10







15, అక్టోబర్ 2010, శుక్రవారం

శ్రీ దుర్గా దేవి-దుర్గాష్టమి.


శ్రీ దుర్గా దేవి-దుర్గాష్టమి.15-10-10






14, అక్టోబర్ 2010, గురువారం

శ్రీ మహాలక్ష్మీ దేవి.


శ్రీ మహాలక్ష్మీ దేవి. 14-10-10







13, అక్టోబర్ 2010, బుధవారం

శ్రీ సరస్వతీదేవి


శ్రీ
సరస్వతీదేవి
.13-10-10








12, అక్టోబర్ 2010, మంగళవారం

శ్రీ లలితా త్రిపురసుందరీదేవి


శ్రీ లలితా త్రిపురసుందరీదేవి .12-10-10





11, అక్టోబర్ 2010, సోమవారం

శ్రీ అన్నపూర్ణాదేవి


శ్రీ అన్నపూర్ణాదేవి.11-10-10







10, అక్టోబర్ 2010, ఆదివారం

శ్రీ గాయత్రీదేవి.


శ్రీ గాయత్రీదేవి.10-10-10





గుప్పెడంత మనసు....


గుప్పెడంత గుప్పెడంత మనసు...
దాని సవ్వడేంటో ఎవ్వరికి తెలుసు?
మనసుకు ఎన్నెన్నో కధలుంటాయి..
ఏవేవో
వ్యధలుంటాయి...
ఏనాడూ
చెయ్యబోకు అలుసు!

ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం...
"ఒక వ్యక్తి మానసికంగా..శారీరకంగా...ఉల్లాసంగా ఉన్నప్పుడే
ఆరోగ్యంగా ఉన్నట్లుగా భావించాలి"
ఇది WHO ఆరోగ్యానికి ఇచ్చిన నిర్వచనం.

అన్ని మానసిక సమస్యలకు కారణం మన మనసులోని భావాలను పంచుకునే వ్యక్తి తోడు లేకపోవటం,
ప్రేమ,అనుబంధాలు,ద్వేషాలు లాంటి భావోద్వేగాలను మనసులో దాచుకోవడం,
మన మనసుల్లోని బాధ చెప్పుకుంటే మన గురించి ఎవరేమనుకుంటారో అని భయపడటం,
చులకనగా చూస్తారని ఫీల్ అవ్వటం
ఇవన్నీ మానసిక సమస్యలను మరింత పెంచుతాయి.
అందుకే ప్రతి మనిషికీ తమ కష్ట సమయంలో ధైర్యానిచ్చి,ఓదార్చే నేస్తం కావాలి.

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము...

ఆసలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో..
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...

చేలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిల అయిపోగా...
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచే..
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...

నాకు చాలా ఇష్టమైన,మనసుకి నిర్వచనం చెప్పే ఆత్రేయ గారి పాట

మౌనమే నీ భాష మూగ మనసా...



ప్రతి మనిషికీ సమస్యలు వస్తుంటాయి కానీ చిన్న చిన్న సమస్యలకే
మనసొక మధుకలశం పగిలేవరకే అది నిత్య సుందరం
అని మనం భయపడి, బాధపడి
మన చుట్టూ వున్న వాళ్ళని కూడా బాధించకుండా...
మనసే అందాల బృందావనం ....
అనుకుంటూ జీవితంలో విలువయిన ప్రతి నిమిషాన్ని
సంతోషం సగం బలం అంటూ హాయిగా నవ్వుతూ బ్రతికితే
ఈ జీవితమే సఫలము...రాగసుధా మధురమూ...

9, అక్టోబర్ 2010, శనివారం

బాలాత్రిపురసుందరీదేవి.


శ్రీ
బాలాత్రిపురసుందరీదేవి.09-10-10






8, అక్టోబర్ 2010, శుక్రవారం

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి.


స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి.08-10-10





దేవీ నవరాత్రులు...


అమ్మలగన్నయమ్మ;ముగురమ్మల మూలపుటమ్మ;
చాల పెద్దమ్మ;సురారులమ్మ కడుపారని బుచ్చినయమ్మ;
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడియమ్మ;
దుర్గ; మాయమ్మ;కృపాబ్ధి;యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్!

సకల దేవత స్వరూపిణి అయిన అమ్మను భక్తిశ్రద్ధలతో పూజించే దేవీ నవరాత్రులు
రోజు నుండీ ప్రారంభం.
పది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు..
అమ్మ కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ ప్రసాదించాలని,
కోరిన
కోరికలు తీర్చి కాపాడమని,
అమ్మని
వేడుకుంటూ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.


4, అక్టోబర్ 2010, సోమవారం

బంగారు పాపాయి...


మా ఇంట్లో మొదటి అమ్మాయిని.
నేను పుట్టినందుకు ప్రక్రుతి ఆనందంతో నాట్యం చేసిందో..
నదులూ,సముద్రాలూ ఉత్సాహంగా ఉరకలు వేసాయో తెలియదు కానీ..
మా అమ్మా,నాన్న మాత్రం మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అని పండగ చేసుకున్నారంట.
నన్ను లోకానికి ఆనందంగా ,ప్రేమతో ఆహ్వానించారట.
అందరు తల్లిదండ్రుల్లాగానే నేను లైఫ్ లో సక్సెస్స్ అవ్వాలని,గొప్పదాన్ని అవ్వాలని
నన్ను గురించి ఎన్నో కలలు కన్నారట ...

బాలసరస్వతి గారి "బంగారుపాపాయి" పాటలో లాగా మా అమ్మ కూడా నా గురించి ఎన్నో కలలు కనేది.

బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
పాపాయి చదవాలి మా మంచి చదువు..
పాపాయి చదవాలి మా మంచి చదువు..

"
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
ఘన కీర్తి తేవాలి...ఘన కీర్తి తేవాలి ...

దేశ మేజాతి ఎవరింటిదీ పాప...
ఎవ్వరీ పాపయని అందరడగాలి..
తెనుగుదేశము నాది , తెనుగు పాపను నేను,
అని పాప జగమంత ఖ్యాతి వెలిగించాలి ...

బంగారు పాపాయి బహుమతులు పొందాలి.
పాపాయి చదవాలి మా మంచి చదువు ...
పాపాయి చదవాలి మా మంచి చదువు ...


అమ్మ కోరిక తీర్చగలిగేలా ఎదగాలని కోరుకుంటూ..
There's a reason behind every thing in this world.
But am I born for a reason too...

And if so, what might it be?
That is the greatest mystery behind every life.


"Every failure should become a stepping stone to success..
Learn from your mistakes..."




2, అక్టోబర్ 2010, శనివారం

వందేమాతరం ...గాంధీ ఓంకారం


ఈరోజు గాంధీ మహాత్ముని జయంతి.
అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి హృదయపూర్వక అభివందనాలతో...

అహింసే ఆయుధంగా సత్యమే జీవన పధంగా స్వజాతిని,స్వదేశాన్ని సత్యాగ్రహం ద్వారా ప్రభావితం
చేసిన మహాత్ముడు మనకందరికీ ఆదర్శం.
మంచితనం,నీతి,నిజాయితీ,పరమత సహనం,శాంతి,సమత,మమత గాంధీ సూత్రాలు.


చెడు
చూడకు
చెడు మాట్లాడకు
చెడు వినకు
ఈ మూడు గాంధీ మహాత్ముని సిద్ధాంతాలు.

కానీ బాపూ ఈ చెడు అనే దాని గురించి నాకు చాలా సందేహాలు వస్తున్నాయి ఈ మధ్య....నువ్వు తీర్చగలవా?
మా వారి సిద్ధాంతం ప్రకారం మంచి చెడు నువ్వు చూసే దృష్టిలోనే వుంటాయి ఎక్కడో కాదు అంటారు.
కానీ జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకెందుకో చెడుగా అనిపిస్తున్నాయి బాపూ...
అది నా తప్పేనంటావా?

ప్రస్తుత కాలంలో మంచి, చెడులకి ఒక్కక్కరి నిర్వచనం ఒక్కోలా వుంటుంది.
"ఒకరికి చెడు అనిపించింది ఇంకొకరికి మంచి అనిపిస్తుంది"
"ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపిస్తుంది"
మరి మంచి చెడులను నిర్ధారించగలిగే వారెవరు?

ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని నువ్వన్నావు.
కానీ బాపూ ఇప్పుడు పట్టపగలు కూడా ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే రోజులు వచ్చాయి.
బయటే కాదు బాపూ ఇంట్లో వున్నా రక్షణ లేని రోజులు.

మారిన కాలాన్ని బట్టి ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ చదువుకునే చోట,ఉద్యోగాలు చేసే చోట ఆడవారికి ఎన్నెన్నో వేధింపులు.
ప్రేమ పేరుతో మోసాలు, వేధింపులు నిరాకరిస్తే దాడులు.

సరే ఎంత చదివించినా పెళ్లి చేయాలి కదా ఆడపిల్లని బయటికి పంపిస్తే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని
భయపడి అమ్మాయికి మంచి సంబంధం చూసి ఎంతో కట్నాలు ఇచ్చి పెళ్లి చేసినా
అక్కడా అత్తా,మామల వేధింపులు,భర్త సాధింపులతో విసిగిపోయిన భార్యలు,భర్తల ఇంటిముందు ధర్నాలు,మౌనపోరాటలు ఎన్ని చేసినా చెవిటి వాడి ముందు శంఖంలా వుంది బాపూ... నేటి ఆడవాళ్ళ పరిస్థితి.

పైగా మగవాళ్ళు ఆడవాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళకే ఎందుకు చట్టాలు సహకరించాలి
అంటూబాధపడిపోవటం...
ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మీరు అన్నప్పుడు
అప్పటి మగవాళ్ళు ఎవరూ ఇలా ఆడవాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మీతో వితండవాదం చేసి వుండరుకదా...బాపూ
మరి ఇప్పటి వాళ్ళు ఎందుకు ఇలా వున్నారు ?

బాపూ మీరు లాయర్ కూడా కదా నేను కూడా లా చదివినా నాకెందుకో ప్రాక్టిస్ చేయాలనిపించలేదు.

ఈ మధ్య కోర్టుల్లో జరుగుతున్న ఒక్కో సంఘటనా ఒక్కో చెరగని మచ్చగా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో వున్న నమ్మకాన్ని కోల్పోతుంది.

న్యాయనిర్ణేత అంటే భగవంతుడితో సమానం కానీ ఈ మధ్య ఒక జడ్జి మీద ఒక మహిళా స్టెనో చెప్పు విసిరింది
ఇంత సాహసానికి ఆమె తెగించింది అంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో మరి??
కొందరు జడ్జి లు ఇంక్రిమెంట్ల కోసం LLM చదవాల్సి రావటంతో చదవలేక,ఇంక్రిమెంట్లను వదులుకోలేక
పరీక్షల్లో కాపీ కొడుతూ టీవీ కెమెరాలకు చిక్కారు బాపూ...
పీజీ చదవటానికే ఇన్ని అడ్డదార్లు తొక్కిన వాళ్ళు ఇంక ఈ వుద్యోగం తెచ్చుకోవడానికి ఎన్ని అడ్డదార్లు తొక్కారో అనిపించింది...
ఇంక కోర్ట్ ని దేవాలయంగా భావించాల్సిన న్యాయవాదులు Professional Ethics ని కూడా వదిలేసి కోర్ట్ లో రికార్డులని ధ్వంసం చేసిన సంఘటన ఎంతో దురదృష్టకరమైన సంఘటన.
స్వార్ధం నిలువెల్లా నిండి వున్న ఇలాంటి జడ్జి లు,లాయర్లు ప్రజలకి ఏమి న్యాయం చేస్తారంటారు బాపూ...

ఎందరు దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు ఇది ఒకప్పటి మాట
ఎందరు నిర్దోషులనైనా శిక్షించవచ్చు కానీ ...
డబ్బు,సంఘంలో పలుకుబడి,రాజకీయ నేపధ్యం వున్న ఏ ఒక్క నేరస్తుడికీ శిక్ష పడకూడదు.
ఇది ఇప్పటిమాట...

ఇవన్నీ ఏవో కొన్ని సంఘటనలు మాత్రమే...
అవినీతి,లంచగొండితనం,బంధుప్రీతి,రాజకీయ కుట్రలతో నిండిపోయిన నేటి
సమాజంలో జరుగుతున్న ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో...

ఇదంతా
నాకు చెడుగా అనిపిస్తుంది
ఇది నిజంగా చెడేనా లేక నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా???
నా ద్రుక్పధంలోనే తేడా ఉందా ???
చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
ఇది మీ మాట బాపూ..
మరి ప్రస్తుత సమాజంలో చెడుని నిర్మూలించాలి అంటే ఏమి చేయాలి??ఏమి చేయగలం??
మారాలంటే లోకం మారాలంటా నువ్వే ఇది అందరికీ వర్తించే మాటే కదా...



song videomixing By My sister N.Ramya Naidu.

Related Posts Plugin for WordPress, Blogger...