పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, జులై 2011, ఆదివారం

రాధా మాధవ గాధల రంజిలు బృందావనం...


మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం...

రమణీయ ప్రేమకావ్యపు నాయికా నాయికలు రాధాకృష్ణులు.
హృద్యమైన ప్రేమకు ప్రతిరూపం వీరి జంట..
రాధాకృష్ణుల ఫొటోస్, paintings ఎన్ని చూసినా ఒక దానిని మించి ఒకటి
తనివి తీరని మనోహరమైన సౌందర్యం రాధాకృష్ణుల సొంతం...
చందన వర్ణాల రాధమ్మ ,నల్లని క్రిష్ణయ్యల జంట కన్నులపంట..

గూగుల్ లో వెతికితే ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియనన్ని అందమైన రాధాకృష్ణుల
wallpapers మనసును కట్టిపడేస్తాయి ... ఫలితం నేను సేవ్ చేసే పిక్చర్స్ తో folders నిండి పోతాయి
నాకు బాగా నచ్చిన కొన్ని WallPapers తో నాకు నచ్చిన కవిత....

రాసలీలలలోన మాధవుడుండుటగని
రసరమ్య గీతివలె రాధవచ్చి
రాధ నీదైవుండ రమణులతొ పనిఏమి
రాసలీలలాపలేవ యనుచు
రవ్వంత కినుకతో రుసరుసలాడుచూ
రమాకాంతుని ఎదుటనిలచి అడుగ


కోపముతొ యున్నట్టి రాధమ్మనుగాంచి
కొంటె కృష్ణయ్య నవ్వుకొనుచు
కోపమేలనే బేలాయని యనుచు
కొంగుపట్టి తనవైపు తిప్పుకొనుచు
కోమలాంగీ నే రాధావిధేయుడను
కొంటెపనులను జేయనమ్మమనగ

కన్నయ్య చెప్పునది నిజమోకల్లోయని
కనులతొ కనులను కలిపిచూడ
కల్లకాదిది నిజము నమ్ముమాయనినటుల
కనిపించు కృష్ణయ్య మోముగాంచి
కలతపడిన మనసు కుదుటపడగా కొంత
కమలాక్షుని లీలలనెరుగని రాధమ్మ


మాధవుడు తనవాడు మాత్రమే యని తలచి
మానసము ఆనంద తాండవమాడగా
మానినీ మానసచోరుని మైమరచి చూచుచూ
మాయగాడు వీనినెటుల నమ్మవలెననియెంచి
మాధవుని పట్టి తనమనసున బంధించి
మాధవిగా రాధ తానుమారె.


నవమినాటి
వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమి రేయి..

నాకు ఇష్టమైన రాధాకృష్ణుల WallPapers తో నేను వీడియో మిక్సింగ్ చేసిన పాట..




వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి
ఆనందన మురళి ఇదేనా మురళి మోహన మురళి...





2 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

రాధా కృష్ణుల చిత్రాలు , వాటి కి వ్రాసిన కవితలు బాగున్నాయండి .
" యమునా ఎందుకే నువ్వింత నలుపెక్కావు " , ఈ పాట నేనెప్పుడూ వినలేదండి . బాగుంది . ఏ సినిమా లోది ?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదములు మాలాకుమార్ గారు..
ఈ పాట భానుచందర్ ,అర్చనల నిరీక్షణ సినిమాలోదండీ..

Related Posts Plugin for WordPress, Blogger...