పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, నవంబర్ 2011, మంగళవారం

మీనా... మీనా జలతారు మీనా ...

నా చిన్నిప్రపంచంలో కొత్తగా వచ్చిన సభ్యులు ఈ మీనాలు..
మా అమ్మకి ఎప్పటి నుండో కోరిక ఈ అక్వేరియం కొనాలని..
ఎప్పటికప్పుడు కుదరకపోవటం,దాని మీద మేమెవరం ఇంటరెస్ట్ చూపించకపోవటం
ఇలాంటి కారణాలన్నింటి వలన మా అమ్మ అక్వేరియం కోరిక అలాగే మిగిలిపోయింది..
ఐతే ఇప్పటికి ఆ కోరిక తీరటం మా అమ్మకి చాలా సంతోషం పైగా ఆ కోరిక తన
చిన్నల్లుడి ద్వారా తీరటం మరీ మరీ సంతోషం..

మా చెల్లి వాళ్ళింటికి లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మ ఎప్పటిలాగే
మా తమ్ముడిని అక్వేరియం గురించి అడగటం విన్న మా మరిది గారు మా చెల్లి ద్వారా
మా అమ్మకి వున్న ఇష్టం తెలుసుకుని తను,మా చెల్లి ఇద్దరు వెళ్లి తీసుకువచ్చిన అక్వేరియం ఇది..
ఏ వస్తువైనా మనం కొనుక్కోవటం కంటే మన ఇష్టాన్ని తెలుసుకున్న ఆత్మీయులు
మనకి దాన్ని గిఫ్ట్ గా ఇవ్వటం చాలా సంతోషాన్ని కలిగించే విషయమే కదా...

ఆ అక్వేరియంలో ఆనందంగా ఆడుకుంటున్న చేపల్ని చూస్తుంటే చాలా బాగుంది.
పైగా అక్వేరియం ఇంట్లో వుండటం వాస్తుప్రకారం కూడా మంచిదట..
మా జలతారు మీనాల ముచ్చటైన విన్యాసాలు
మీరు కూడా చూడండి..








ఈ అక్వేరియంలో ఆడుతూపాడుతూ, అల్లరిగా హాయిగా తిరుగుతున్న ఈ చేపల్ని చూస్తుంటే నాకు
సాహసవీరుడు సాగరకన్యలో మీనా మీనా జలతారు వీణా పాట గుర్తుకు వచ్చింది.
అందుకే అక్వేరియం వీడియో తీసి దానికి ఆడియో జత చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను..

మీనా మీనా జలతారు వీణా
with నా చిన్నిప్రపంచం చేపలు..
By:రాజి




6 కామెంట్‌లు:

సుభ/subha చెప్పారు...

బాగుందండీ.. మీ అక్వేరియం. నిజమే మనం అనుకున్నది అనుకోకుండా వస్తే అంతకన్నా ఆనందమే లేదండీ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ subha గారు..
మా అక్వేరియం నచ్చినందుకు
మా ఆనందాన్ని పంచుకున్నదుకు...

రసజ్ఞ చెప్పారు...

ఈ టైటిల్ చూసి సాహసవీరుడు సాగరకన్యలో పాట పెట్టారనుకున్నా! మీ ఇంట్లోని చేపల తొట్టి (aquarium ) విశేషాలా? బాగున్నాయి చూడ ముచ్చటగా ఉంది!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ రసజ్ఞ గారు..
సాహసవీరుడు సాగర కన్యలో పాట కూడా పెట్టానండీ..
మా అక్వేరియం వీడియోతో ఆ పాట ఆడియో కలిపి వీడియో మిక్సింగ్ చేశాను
మీరు చూడలేదనుకుంటాను...

రసజ్ఞ చెప్పారు...

అయ్యో చూసానండీ! నేను అన్నది మీరు ఆ పాట మీద వ్యాఖ్యానమో, విస్లేశానో, సాహిత్యమో వ్రాసి ఉంటారు అనుకున్నా అని!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ రసజ్ఞ గారు ఐతే పాట చూశారన్నమాట..
నాకు విశ్లేషణ చేయటం అంత బాగా రాదండీ..
అందుకే పాటల సాహిత్యం మాత్రం
నా సరిగమలు...గలగలలు బ్లాగ్ లో పొస్ట్ చేస్తాను..
http://raaji-telugusongslyrics.blogspot.com/

Related Posts Plugin for WordPress, Blogger...