పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, మే 2012, సోమవారం

స్త్రీ భ్రూణ హత్యలు .. Female Foeticide -- మరో కోణం...!నిన్న అమీర్ ఖాన్ సత్యమేవ జయతే ప్రోగ్రాం లో చర్చించిన విషయం స్త్రీ భ్రూణ హత్యలు..పుట్టబోయే శిశువు ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవటానికి ఉపయోగించే స్కానింగ్ ద్వారా పుట్టబోయే శిశువు ఆడా,మగా అన్న విషయం ముందుగానే తెలుసుకుని,చాలా మంది భర్తలు,భర్త తరపు బంధువులు తమను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశారని,ఒప్పుకోకపోతే వేధించి,తమ పిల్లల్ని చంపటానికి కూడా ప్రయత్నించారని కొందరు మహిళలు ఈ కార్యక్రమంలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.. కేవలం పేద,గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండాఉన్నత విద్యా వంతులైన నగర వాసుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే వుంది..

భ్రూణ హత్యలతో ‘ఆడ’ సంతతిని తగ్గిస్తే మానవజాతి ఉంటుందా! మనుగడ ఎలా కొనసాగుతుంది? పురుషులు జన్మించేది ‘స్ర్తి’ గర్భంనుంచే కదా! ఆడశిశువు పుట్టుకకు నిర్ణాయక పాత్ర వహించేది పురుషుడి ‘ఎక్స్, వై’ క్రోమోజోమ్‌లే అన్న విషయాన్ని మరచిపోతున్నారు. స్ర్తీ భ్రూణహత్యలవల్ల స్ర్తీ, పురుషుల సంఖ్య నిష్పత్తి ప్రకారం ఉండడంలేదు. స్త్రీలు లేకుండా మగజాతి ఉంటుందా! అసలు మానవజాతి మనుగడ ఉంటుందా!?ఇవీ నిన్నటి కార్యక్రమం లో వ్యక్తమైన భావనలు..

ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్లే ప్రతి సమస్యకి మరో కోణం వుంటుంది...స్త్రీ భ్రూణ హత్య జరిగిందని తల్లి బాధ పడుతున్నప్పుడు ఆ తండ్రికి ఎందుకు బాధ వుండదు??అంటే ఈ భూమి మీద తల్లి మాత్రమే దేవత,తండ్రి రాక్షసుడా??అలాంటప్పుడు ఒక శిశువుకు జన్మనిచ్చే విషయంలో,బిడ్డల్ని పెంచి పోషించే విషయంలో తల్లికి ఎంత బాధ్యత,బాధ వుంటుందో అవన్నీ తండ్రికి ఉండవా ?? భ్రూణ హత్యలన్నీ అత్తింటివాళ్ళు,భర్త బలవంతం మూలంగానే జరుగుతున్నాయా అని కూడా ఆలోచించాలి.

ఈ సమస్యకే సంబంధించిన  ఒక  కేస్ వివరాల్లోకి వెళ్తే అతనికి 2010 లో పెళ్లి జరిగింది . వాళ్లకి ఒక పాప.ఆ పాప పుట్టినప్పుడు అతను కానీ అతని బంధువులు కానీ ఆడపిల్ల పుట్టిందని ఫీల్ అవ్వలేదు, పాపను ఎంతో ముద్దుగా పెంచుకున్నారు.అయితే పాప కి ఒక సంవత్సరం నిండగానే భార్య మళ్ళీ 1 మంత్ 5 డేస్ ప్రెగ్నెంట్ అని తెలిసింది.వెంటనే తెల్లారి నాకు బ్లీడింగ్ అవుతుంది. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని అత్తని భర్తని అడిగింది.వాళ్ళు వెంటనే దగ్గర్లోనే మంచి  పేరున్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్ బ్లీడింగ్ అయితే పుట్టబోయే బిడ్డ అవయవ లోపాలతో పుడతారు కాబట్టి  అబార్షన్ చేయమంటారా అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయి హాస్పిటల్ లో అందరూ   వినేలా  మా అత్తా,మొగుడి  మాట విని నాకు అబార్షన్ చెయ్యాలని చూస్తున్నావా? బ్లీడింగ్ ఆగటానికి ఇంజక్షన్ ఇవ్వు, మా అమ్మ నర్స్ మా అమ్మ మాఊర్లో అలాగే చేసుద్ది.అసలు అనవసరంగా ఇక్కడికి వచ్చాను, మా అమ్మైతె నాకు బాగా చూపించేది అంటూ గొడవ చేసింది.ఈ అమ్మాయి గొడవకి ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయి ఎందుకలా గొడవ చేస్తావు?బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అలా చెప్పాను. నీకు కావాలంటే ఇప్పుడే ఇంజక్షన్ చేస్తాను అంటూ బ్లీడింగ్ ఆగటానికి సుమారు వెయ్యి రూపాయలయ్యే ఇంజక్షన్ ఎదో  చేసింది.

 ఇంటికి వస్తూనే వాళ్ళ అమ్మకి మెసేజ్ ఇచ్చి పిలిపించి, డాక్టర్ బ్లీడింగ్ అయితే అవయవలోపంతో పిల్లలు పుడతారని చెప్పింది అనే మాట దాచి పెట్టి, మా అత్తా,మొగుడు,ఆడపడుచు అందరూ నన్ను మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ చేపించుకోమంటున్నారు నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకుపో అంటూ అమ్మతో కలిసి పెద్ద గొడవ చేసి,నా బిడ్డని చంపమంటారా ?? నేను ఒప్పుకోను నేను ఏమి చేసినా నా పిల్లల్ని పోషించుకుంటాను అని భర్త తో గొడవపడిం వెంటనే భర్తకు గానీ అత్తా,మామలకు గానీ చెప్పకుండా తల్లితో కలిసి వీళ్ళందరినీ ఇష్టమొచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా చేసేదేమీ లేక ఊర్కున్నారు..తర్వాత కొంతకాలానికి ఆ భార్య నా భర్త,అత్తా,ఆడపడుచులు నాకు పిల్లలు పుట్టటం ఇష్టం లేక,ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ చేయించుకోమని నన్ను బలవంతం చేశారు, నన్ను నా బిడ్డని చంపబోయారు అందుకే నేను మా అమ్మా వాళ్ళింటికి వెళ్లాను.. అంటూ 498a లు,ఇంకా ఏవో అభియోగాలు భర్త మీద మోఫై పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పింది.

ఇప్పుడు భర్త ( తండ్రి) వాదన :
ఒక్క నెలకే నాకు ఆడపిల్ల అని ఎలా తెలుస్తుంది?? భార్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే,డాక్టర్ బ్లీడింగ్ అయితే అవయవలోపంతో  పిల్లలు పుడతారని చెప్పింది కాబట్టి ఆ మాట వచ్చింది కానీ లేకపోతె అబార్షన్ అన్న ఆలోచనే మాకు లేదు.చట్టాన్ని అడ్డు పెట్టుకుని మా కుటుంబాన్ని  హింసిస్తుంది.ఆమె మాటల్లో నిజం లేదు.నా భార్యకి ప్రెగ్నెన్సీ రావటం నాకు ఇష్టం లేకపోతె బ్లీడింగ్ అవుతుందని చేప్పిన  వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్ళేవాడిని? డాక్టర్ చెప్పిన ఇంజక్షన్ కూడా చేయించాను కదా? ఆ ఇంజెక్షన్ చేయించకపోతే అదే ఎదో అవుతుందిలే అని ఊరుకునే వాడిని కదా? ప్రెగ్నెన్సీ వచ్చాక బ్లీడింగ్ అయితే పిల్లలు  అవయవలోపంతో పుడతారన్న డాక్టర్ మాట నిజం కాదా? ఆ కారణంతో ఇప్పటివరకు ఏ మహిళా అబార్షన్ చేయించుకోలేదా?డాక్టర్ చెప్పిన మాటని మేమేదో ఆమెతో చెప్పించామని నింద  వేసి,ఆడపిల్ల అని వద్దన్నారని కధలు సృష్టించి,అందరినీ బజారుకీడ్చి గొడవ చెయ్యటం న్యాయమా ? చట్టంలోని లొసుగుల కారణంగా చట్టం ఇలాంటి మోసగాళ్లకు అండగా ఉంటె ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి?


నిజమే కదా ఎవరు ఏ దృష్టి తో చూస్తే ఆ దృష్టి తోనే లోకం కనిపిస్తుందంటారు ... ఈ ప్రపంచం లో నిజంగానే భార్యలను ఇబ్బంది పెట్టే వాళ్ళు, 8 సార్లు,10 సార్లు అబార్షన్స్ చేయించే వాళ్ళు ఉండొచ్చు... కానీ వీటినే సాకుగా చూపించి, ఏ తప్పు చేయని భర్తల్ని అత్తింటి వాళ్ళని నా ఇష్టం నాది,ఆ ఇష్టానికి అడ్డు తగిలితే ... నీ మీద కేస్ లు పెట్టి ఇరికిస్తాను అనే భార్యలను ఏమి చేయాలి ??? ఇలాంటి చట్టాలు ఇలాంటి చట్టాలు ఎవరు బాధితులో , ఎవరు నేరస్తులో  సరిగ్గా కనిపెట్టటం ఎలా?అన్నది ఇప్పుడు కొందరు బాధిత భర్తల ప్రశ్న...ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ?? మీరైతే ఈ సమస్యని ఏ కోణం నుండి ఆలోచిస్తారు ??? ఎలా పరిష్కరిస్తారు,ఎవరిది తప్పు అంటారు?? మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ చేస్తారని ఆశిస్తాను...


15 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

అమ్మో ఇలా కూడా వేదిస్తారా భర్తలను భార్యలు? ఎంత అన్యాయమో!ఇలా తప్పుగా కేసు పెడితే పాపం అతనేమి చెయ్యగలడు? సానుభూతి అంతా భార్య మీదే ఉంటుంది, నిజ నిజాలు తేటతెల్లం కాకపోతే. In my view good bye, TaaTa చెప్పేస్తే పోలా ఆ భార్య కి? అర్ధం చేసుకోని ఆమెతో ఇంకా ముందు ముందు ఎన్ని తిప్పలో.

వనజవనమాలి చెప్పారు...

అతని ఆలోచనలు అన్నీ సహేతుకమైనవే ! ఎందుకంటే..పురుషుడిగానే కాదు..స్త్రీలకి కూడా.. అలాటి ఆలోచనలు కలుగుతాయి. తల్లికి మాత్రమే కాదు. తండ్రికి బిడ్డపై ప్రేమ,భాద్యత,హక్కు ఉంటాయి.
ప్రతి విషయానికి చట్టం సహాయం లభిస్తుంది కదా అని .. స్వార్ధ కారణాలతో..కొందరు స్త్రీలు చట్టాన్ని మిస్ యూజ్ చేయడం గమనిస్తున్నాం.
అడ-మగ అన్న విభజన తప్ప..ఆ తండ్రి ఆలోచనలలో.. న్యాయం ఉంది.
అలోచించ దగిన పోస్ట్.

రాజి చెప్పారు...

జలతారువెన్నెల గారూ ...
ఇప్పటి వరకు వరకట్న వేధింపు చట్టాలే కనిపించేవి ఇప్పుడు ఇవి కూడా వస్తున్నాయి.. పరిస్థితిని తమంతట తామే అర్ధం చెసుకుని సమస్యను పరిష్కరించుకునే భార్యలు ఎందరు లేరంటారు..

అలా కాకుండా అతని బలహీనతని ఆమె బలంగా మార్చుకుని ఇలాంటి వేధింపులకి పాల్పడితే మీరన్నట్లు టాటా ఐనా చెప్పేయాలి లేదా అతనే రాజీ పడి ఐనా బతకాలి.

మీ అలోచన,అభిప్రాయం తెలిపి,స్పందించినందుకు థాంక్సండీ...

రాజి చెప్పారు...

"ఆ తండ్రి ఆలోచనలలో.. న్యాయం ఉంది."
వనజవనమాలి గారూ..
నాకు కూడా ఇలాగే అనిపించిందండీ..
ప్రతి సమస్యని అన్ని కొణాల్నుండి పరిశీలిస్తే ఇన్ని ఆలోచనలు,వేదనలు వుంటాయని..

మీ అలోచన,అభిప్రాయం తెలిపి,స్పందించినందుకు థాంక్సండీ...

జలతారువెన్నెల చెప్పారు...

"ఎందుకంటే ఒక శిశువుకు జన్మనిచ్చే విషయంలో 'తల్లికి మాత్రమె పూర్తీ హక్కు ఉంటుంది , ఉండాలి'. Why?

lalithag చెప్పారు...

రాజి గారూ,
Thanks.
జలతారి వెన్నెల గారి అభిప్రాయం చూశాను. నేను నా వ్యాఖ్యలో "ఆ కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు" అన్నాక "అప్పుడు ఆమెదే తప్పని కూడా తెలియవచ్చు" అని వ్రాశి తీసేశాను. ఎందుకంటే ఇక్కద ఆమెదే తప్పు అన్న అభిప్రాయానికి చాలా ఎక్కువ weightage ఇప్పటికె ఉంది కనక. నా మనస్తత్వమఏ కాకుండా నా స్వంత అనుభవాలు కూడా నా స్పందనలో తీవ్రతకీ, ఇంకో వైపు చూసి తీరాలని పట్టునట్టడానికి బలం ఇస్తుండవచ్చు. నేను ఇలా బ్లాగుల్లో, వార్తల్లో నేను చదివిన వఆటికి నా విశ్లేషణలు వ్రాసుకుంటుంటే ఒకరిద్దరు రక రకాల పేర్లతో (భార్యాబాధితుడు ఆ పేర్లలో ఒకటి) మగ వారి బాధలు చెప్పుకుంటూ వ్రాశారు. అప్పుడూ నా stand అప్పటి వారికి తెలుసు ఏమిటొ. నేను తీర్పులు చెప్పలేదు. మనకి సమస్య చెప్పుకున్న వారి కోణం ఒక్కటే కాదు ఆ సమస్యకి ఉండేది అన్నది ఒకటి. best interest of the worst affected ని దృష్టిలో ఉంచుకుని తప్పు ఒప్పుల ప్రాతిపదకన కాక సంసయలకి సమాధానాలు వెతకాలని. exterme సమస్యలు కొన్ని ఉంటాయి. వాటి పరిష్కారాలూ అలానే ఉంటాయి. ఇంతా చేస్తే ఆ అభిప్రాయాలు నా బ్లాగులో వ్రాసినవారూ, నన్ను అసహ్యంగా చిత్రీకరించిన వారు ఎవరో నకు తర్వాత తెలిసింది. అలా తెలిసినప్పుదూ రుజుబ్వులు ఉండవు కనుక అనుమానం వ్యక్తం చేసినందుకే నేను ఎన్నో [పరాభవాలని ఎదుర్కోవలసి వచ్చింది. మళ్ళీ వనజ గారి బ్లాగులో ఒకరు victimised మగ వారి కథ వ్రాసుకొచ్చారు. అక్కడ స్పందించలేదు గత అనుభవం దృష్ట్యా. వారే అని కాదు. ఆ కోవకి చెందిన ట్రిక్కే అయ్యుండవచ్చన్న అనుమానం కొంత ఉండడంతో. మళ్ళీ స్ఫురిత గారి బ్లాగులో అలాగే ఒక బాధితుడి కేసు తీసుకొచ్చారు. అదీ ఇంకొక బ్లాగులో ఇంకొకరెవరో కొన్ని నెలల క్రితమేమో వ్రాసినదే. దానికి నేను అప్పట్లో ఏదో జవాబు ఇచ్చాను. స్ఫురిత గారి బ్లాగులో ఇక స్పందించలేదు. ఇప్పుడు మీరే offend ఐనట్టనిపిస్తే మనస్ఫూరిత్గానే క్షమాపణ అడిగాను, మాటకున్న పరిమితులు తెలుసు కనక. మళ్ళీ ఇంకెప్పుడైనా వ్రాస్తాను. ఇప్పటికి ఇంతే.

రాజి చెప్పారు...

lalithag గారూ...
ఈ పోస్ట్ నిజంగానే మా ఫ్రెండ్స్ కి మధ్య జరిగిన చర్చ,నిజంగానే మా దగ్గరికి వచ్చిన సమస్య మాత్రమే..
ఇది ఎవ్వరి ప్రమేయంతో నేను పెట్టిన పోస్ట్ కాదు..

ఇంక భార్యా బాధితులు,భర్తా బాధితులు అంటారా వీళ్ళిద్దరితో మాకు పని వుంటుంది కదా లాయర్స్ గా.. అందుకని నేను ఈ రోజు బార్యాబాధితుడి విషయం చర్చించాను..
అది కూడా మన బ్లాగర్లు అన్ని విషయాల్లోనూ వాళ్ళ వాళ్ళ అనుభవాల్తో అభిప్రాయాలను పంచుకుంటారని..
కానీ అలా జరక్కపోగా వ్యక్తిగత విద్వేషాలు కూడా పెరిగిపోయేలా వుంటున్నాయి పరిస్థితులు..

అందుకే ఇప్పటి నుండి నేను కూడా ఇలాంటి విషయాలు చర్చించకూడదని నిర్ణయించుకున్నాను..
నా వలన మీరేమైనా ఫీల్ ఐతే సారీ అండీ..

HARIKRISHNA చెప్పారు...

హాయ్ రాజి గారు,

మీరు ఈ వాదనల వల్ల కోప్పడ్డట్టు వున్నారు .be కూల్ అండి.కొన్ని విషయాలలో ఎవరిది నిజమో ఎవరిది స్వార్తమో మనము తేల్చలేము.చెట్టు ముందా విత్తు ముందా అన్న లేక కోడి ముంచ గుడ్డు ముందా అన్న ఆ వాదన కొనసాగుతూనే వుంటుంది కానీ అంతం ఉండదు.మనకు చాలా సన్నిహితంగా వుండే వాళ్ళ విషయాలలోనే కొన్ని సార్లు ఎవరిది కరెక్ట్ అని మనం చెప్పలేం .అలాంటిది ఎక్కడో జరిగిన సంగతి గురించి వాదనలు కరెక్ట్ కాదు అనుకుంటాను.ఒకటి అండి భార్య బర్తలు స్నేహితుల్ల మెలిగినంత కాలం ఈ ప్రపంచం లో విడాకులు అనే వి వుండవు.చిన్న చిన్న మనఃస్పర్తలే నేడు ఇద్దరు బూతద్దం లో చూసుకొని లేని పోనీ అనుమానాలతో బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా బిడ్డల భావిష్యత్హు ని ప్రస్నార్తకం చేస్తున్నారు.పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి .పెద్దలు అక్కడికక్కదికే సమస్యలు పరిష్కరించి ఇద్దరికి జీవిత విలువలు తెలిపే వారు.కానీ ఇప్పుడు అన్ని వేరు కుటుంబాలే .సో వాళ్ళ వాళ్ళ(భార్య-భర్త లు) కోణం లో వారు అలోచిన్చేసుకొని అపనిందలు వేసుకొంటున్నారు .

సో ఈ అంశాన్ని మనం సహజ సిద్దం గ తీసుకోవడం మంచిది.ఒకరు ఒప్పు మరొకరు తప్పు అని నిర్ణ ఎంచలేం .

Praveen Mandangi చెప్పారు...

మీరు వ్యాయవాది కాబట్టి మీ క్లైంట్‌ని మీరు నమ్మడం, మీ క్లైంట్ యొక్క ప్రతివాదిని మీరు నమ్మకపోవడం మీ ధర్మం. కానీ సమాజం అలా నమ్మాలని నియమం లేదు కదా. అందుకే సందేహం అడిగాను.

రాజి చెప్పారు...

HARIKRISHNA గారూ...
"ఒకరు ఒప్పు మరొకరు తప్పు అని నిర్ణ ఎంచలేం"
మంచిమాట చెప్పారండీ ఎవరి తప్పుకైనా,ఒప్పుకైనా ప్రతిఫలం అనుభవించాల్సింది వారే పెద్దల మాటల్లో ఐతే ఎవరి ఖర్మకు వారే బాధ్యులు..

ఇది మన మధ్య వాదనలు మాత్రమే కాదండీ సమాజంలో మనుషుల్లో వుండే భిన్నాభిప్రాయాలే ఇక్కడ కూడా వ్యక్తీకరించారు అంతే దానికి నాకు కోపం రావాల్సిన అవసరం ఏముంది???
కేస్ గురించి కాకుండా నేనేదో స్వార్ధం కోసం ఈ పోస్ట్ రాసినట్లు నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం నాకు నచ్చదు అంతే..

ఇంకొక విషయం నేను ఈ పోస్ట్ లో ప్రస్తావించిన కేస్ లొ అమ్మాయి భర్త మీద తప్పుడు కేసులు పెట్టి విడాకులు తీసుకుని,పుట్టే బిడ్డను వాళ్ళ బంధువుల్లోనే ఎవరికో ఇచ్చేసి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలో వుంది అని మాకు తెలిసింది...ఇటు తండ్రి కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వుండడు...
మరి అలాంటప్పుడు అంత పోరాడి ఆ బిడ్డను కనటం ఎందుకు???
భర్త మీద పంతంతో,తన స్వార్ధం కోసం పిల్లల్ని అనాధల్ని చెయబోతున్న ఒక తల్లి,ఆమె తరపు బంధువుల మీద మాత్రమే నా వ్యతిరేకత..

Zilebi చెప్పారు...

చ, చ, చాలా చిన్న విషయం. దీనికి ఇంత ఆలోచించాలా ?

అడుసు తొక్క నేలా? కాళ్ళు కడగ నేల ?

కాబట్టి పెళ్లి చేసుకోకుండా వుండటమే బెటరు ! నో ప్రాబ్లం చూడండీ మరి.

జిలేబి.

రాజి చెప్పారు...

Praveen Mandangi గారూ...
నేను న్యాయవాదిని కాబట్టి మా దగ్గరికి క్లైంట్ గా ఎవరు వస్తే వాళ్ళని నమ్మమండీ,అలాగే మీరు కూడా నమ్మాలని నేను అనలేదు.. మేము కూడా కొంచెం ఆలోచిస్తాము ఏది నిజం అని...
అన్నీ తెలుసుకోలేకపోయినా కొన్ని విషయాల్లోనైనా నిజా నిజాలు తప్పకుండా బయటపడతాయి..

చట్టాలను ఆడవాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం..
It has been termed as 'legal terrorism' by Honorable Supreme Court of India.

ఇది నేనేదో మగవాళ్ళని సపోర్ట్ చేసి ఈ బ్లాగుల్లో ఎవరితోనో మంచి అనిపించుకోవాలని చెప్పే మాట కాదు..
ఏ లాయర్ నైనా అడగండి కొదరు ఆడవాళ్ళు పెట్టే తప్పుడు కేసుల వల్ల నిజంగా బాధపడ్డ స్త్రీలను కూడా అనుమానించాల్సి వస్తుంది అని ఒప్పుకుంటారో లేదొ??

రాజి చెప్పారు...

జిలేబీ గారూ..
చాలా రోజుల తర్వాత నా చిన్ని ప్రపంచానికి వచ్చారండీ థాంక్యూ..!
మీరు సూచించిన పరిష్కారం గురించి కూడా ఆలోచించాల్సిందేనండీ :):)
ThankYou..

శ్యామలీయం చెప్పారు...

ఇక్కడి చర్చ ఆసక్తిని కలిగించింది.
సమస్యకి మూలం భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం.
ఒక సమస్య ఉన్నప్పుడు, లేదా ఒక విషయం భార్యాభర్తలలో ఒకరికైనా సమస్యగా అనిపించినపుడు ఇద్దరూ సమగ్రంగా చర్చించి యేమి చేయటం సబబో నిర్ణయింఉకోవాలి. చర్చ అన్నాక అనేక కోణాలలో విషయాన్ని పరామర్శించటం అనేది సహజం. అటువంటప్పుడు ఇద్దరిలో యెవరు ఆవేశపడినా సమస్య జటిలం కావటం, కొత్త సమస్యలకు పునాది పడటం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే మొదట దంపతుల మధ్య సయోధ్య ఉండాలి. మోహపూరితమైన ప్రేమలు, ఆవేశపూరితమైన నిర్ణయాలూ మంచి ఫలితాల నివ్వవు. తమ మధ్య తగిని విశ్వాసపూరిత వాతావరణమూ, పుట్టబోయే పిల్లలకు ఆర్ధికభద్రత చూపగలిగే స్థితీ యేర్పడే వరకు సంతానం కోసం దంపతులు తొందరపడకపోవటమే మంచిది. అపరిపక్వమానసికస్థితి కారణంగా తప్పులు చేయటం సహజం - ఆడా మగా అని తేడా లేదు. వివాహవ్యవస్థను తప్పుపట్టి ప్రయోజనం లేదు, దాని పరిధిలోనూ, వెలుపలా కూడా మానవులు తప్పులు చేస్తున్నారు కదా.

చర్చించ బడిన సంఘటనలో మన దగ్గర ఉన్న సమాచారం అంతా heresay. అతడు తన ఉద్దేశాన్ని అమ్మాయికి చెప్పిన విధానంలో లోపం ఉన్నదా, ఆ ఆమ్మాయి అర్థం చేసుకోవటంలో లోపం ఉందా? ఎవరి ఆలోచనా విధానంలో దోషం ఉంది? ఇదంతా చర్చించే ముందు, ఇద్దరి మధ్యా సరైన అవగాహన లేదన్నది స్పష్టం అవుతున్నది.

రాజి చెప్పారు...

శ్యామలీయం గారూ.. నమస్తే!
నా చిన్నిప్రపంచానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న చర్చలో పాలుపంచుకుని సమస్యను గురించి మీ స్పందన తెలియచేయటం నాకు చాలా సంతోషమండీ...

"ఇద్దరి మధ్యా సరైన అవగాహన లేదన్నది స్పష్టం అవుతున్నది."

మీరు చెప్పింది నిజమేనండీ..ఇద్దరి మధ్యా అవగాహనాలోపం వున్నప్పుడే వాళ్ళు చెప్తే నేను వినాలా?? అన్న ప్రశ్న ఇద్దరి మధ్యా వస్తుంది కానీ, అదే అవగాహన వున్నట్లయితే భార్యకి,భర్తకి మాత్రమే సంబంధించిన ఈ కుటుంబ సమస్య ఇంత బయటికి రావల్సిన అవసరం వుండేది కాదు..
సమస్య వాళ్ళిద్దరి మధ్యనే పరిష్కరించబడేది..

ThankYou..

Related Posts Plugin for WordPress, Blogger...