పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, జనవరి 2013, బుధవారం

మా సంక్రాంతి ముగ్గులు...




 చిన్నప్పటి నుండి పండగలు చేసుకుంటూనే ఉన్నాము అప్పటికి ఇప్పటికి పండగలలో,ఆచారాల్లో ఎన్నో మార్పులు,చేర్పులు...అలాగే సంక్రాంతి పండగలో కూడా కొన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ మారనివి ముగ్గులు, హరిదాసులు,ఎంత కష్టమనిపించినా వండుకునే అరిసెలు, ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ కొంచెం కష్టమే అయినా కూడా ఇష్టంగానే అనిపిస్తాయి... సంక్రాంతి పండగలో నాకు ఎక్కువగా నచ్చేది ముగ్గులు.. జనాలు ముగ్గులు వేయటం మొదలుపెట్టినప్పటి నుండి ముగ్గులు వేయాలన్న సరదా కూడా మొదలవుతుంది... 

చిన్నప్పుడు అమ్మ మట్టినేల మీద మాకు పాలు తెచ్చే అమ్మాయితో పేడ  తెప్పించి, చల్లి శుభ్రం చేసి ముగ్గులు వేసేది...ఇప్పుడు పాలు తెచ్చే అమ్మాయి లేదు,మట్టినేలా లేదు.. అయినా ఇంటి ముందు ఉన్న సిమెంట్ గచ్చు మీదనే నీళ్ళు చల్లి,ముగ్గులు వేయటం అదొక ఆనందంగా,పోనీలే ఈ మాత్రమైనా నేల ఉంది ముగ్గు వేయటానికి అనిపిస్తుంది.. చిన్నప్పుడు ధనుర్మాసం నెలంతా ముగ్గులు వేసేవాళ్ళము ఇప్పుడు మాత్రం జనవరి 1 నుండి సంక్రాంతి వరకు వేస్తున్నాము.మా ఇంటి ముందు ఈ సంక్రాంతికి  నేను వేసిన ముగ్గులు..

సంక్రాంతి మొదలవగానే అమ్మటానికి వచ్చే రంగులు..ఈ రంగులు లేకపోతె ముగ్గుకి కళ రాదు కదా.. అలా అని రోజూ ముగ్గులో రంగులు వేసే ఓపిక,తీరిక లేకపోయినా పండగ రోజు మాత్రం రంగులు వేయాల్సిందే.. 


మా సంక్రాంతి ముగ్గులు... 













10 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

మీ ముగ్గులు బాగున్నాయండి .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మా ముగ్గులు నచ్చినందుకు,మీరు మెచ్చుకున్నందుకు థాంక్యూ "మాలాకుమార్" గారూ :)

Unknown చెప్పారు...

సంక్రాంతి సంబరాలు రాను రానూ తగ్గిపోతున్నా, ఉన్న కాస్త ఇంటి ముంగిలిలో ఇప్పటికీ కనపడేవి, మిగిలినవీ ఈ ముగ్గులే. ఈనెలలో రంగుల్లో కనువిందు చేస్తూ రోజూ పండుగని తలపించే ఈ ముగ్గులే రంగుల ముత్యాలు.
మీ రంగుల ముగ్గులన్నీ ఎంతో బాగున్నాయి. ముగ్గులు వెయ్యటమూ ఓ గొప్ప కళ. ఆ కళని బ్రతికిస్తున్న ప్రతి ఇల్లాలూ అభినందనీయులే!

జయ చెప్పారు...

భలే...చాలా బాగున్నాయి ముగ్గులు...ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు...

lalithag చెప్పారు...

పైనుంచి మొదటి ముగ్గు (మందారాలూ, సీతాకోకచిలుకలూ ఉన్నది) ఎలా వెయ్యాలో చెప్తారా? Thanks.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"చిన్ని ఆశ" గారూ..
నిజమేనండీ ప్రస్తుతం సంక్రాంతి సాంప్రదాయంలో ఎక్కువగా కనిపిస్తుంది ముగ్గులే..
మహిళలకు మీరిచ్చిన చక్కటి కాంప్లిమెంట్ కి,
మా ముగ్గులు మీకు నచ్చాయని మెచ్చుకున్నందుకు చాలా సంతోషమండీ..
ThankYou..!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జయ" గారూ..
ముగ్గులు నచ్చినందుకు,మీరు నన్ను మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా వుందండీ :)
మీకు కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"lalithag" గారూ
మీరు అడిగిన మందారాలూ, సీతాకోకచిలుకలూ ముగ్గు 21 చుక్కలు, 7 వరసలు 7 వచ్చేదాకా సరి చుక్క పెట్టాలి..
ముగ్గులు నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..

sailu చెప్పారు...

mee muggulu bagunnai.vati chukkalu kuda cheaptea inkaanandistanu.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"sailu" గారూ.. మీరెవరో కానీ మీకు ముగ్గులంటే చాలా ఆసక్తి అనుకుంటాను ఇప్పటికిప్పుడు కొత్త ప్రొఫైల్ తో వచ్చి మరీ ముగ్గుల చుక్కలు తెలుసుకోవాలనుకుంటున్నారు..
కానీ చాలా ఆలస్యం చేశారండీ ఇప్పుడు మీ కళ్ళలో ఆనందం చూడటం కోసం నేను మీకు చుక్కలు చెప్పలేను .. ఏమీ అనుకోకండి..

మీ ఆసక్తితో కూడిన వ్యాఖ్యకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...