పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, జనవరి 2015, బుధవారం

సర్కస్ హై భాయి సర్కస్ హై --యే దునియా ఏక్ సర్కస్ హై




''సర్కస్ హై భాయి సర్కస్ హై యే దునియా ఏక్ సర్కస్ హై''

ఈ పాట 1989 లో DD లో ప్రసారమైన సర్కస్ సీరియల్ టైటిల్ సాంగ్ . చిన్నప్పుడు టీవీ కొన్న కొత్తలో హిందీలో  మాత్రమే ప్రోగ్రామ్స్ వచ్చే DD ఛానల్ కి  చాలా రుణపడి ఉన్నామని చెప్పొచ్చు :) ఎందుకంటే  చదివిన దాని కంటే ఎక్కువ ఈ ఛానల్ చూడటం వలన కూడా  హిందీ అర్ధం చేసుకోవటం బాగా వచ్చిందని నా అభిప్రాయం. అప్పట్లో హిందీ అర్ధం అయినా కాకపోయినా ప్రతి ఆదివారం ఉదయం రామాయణం,భారతంతో పాటూ తర్వాత వచ్చే జంగిల్ బుక్, స్టోన్ బాయ్, మాల్గుడి డేస్, టిప్పుసుల్తాన్,  మధ్యానం వచ్చే అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ సినిమాలు, రేణుకా సహానీ- సురభి,ఏక్ చిడియా అనేక్ చిడియా లాంటి పాటలు చూడటం రోజంతా అదేపనిగా ఉండేది.. 

అలాంటి రోజుల్లో వచ్చిన సీరియలే ''సర్కస్''. ఇప్పటి ఎందరో అభిమానుల అభిమాన హీరో షారుక్ ఖాన్ మొదట తెలిసింది ఈ సీరియల్ ద్వారానే అనుకుంటాను.షారుక్ ఖాన్ ''ఫౌజి'' అనే ఇంకో సీరియల్ కూడా బాగుండేది.  సర్కస్ స్టోరీ అంతా గుర్తులేదు..షారుక్ ఖాన్ ఒక సర్కస్ కంపెనీ యజమాని కొడుకు.కొంతకాలం సర్కస్ వాళ్ళతో పాటూ కలిసి ఉంటాడు.ఆ సమయంలో సర్కస్ కళాకారుల జీవితం లోని సుఖ దుఖాలు,సంతోషాలు,బాధలు ఇలా సర్కస్ గురించి మనకి బయటికి తెలియని ఎన్నో సంగతులు ఈ సీరియల్లో చూపించారని గుర్తు. 

ఇప్పుడింతకీ ఈ సీరియల్ ఎందుకు గుర్తొచ్చిందంటే  SAM ఆఫ్రికన్ సర్కస్ మాచిన్నికన్నకి చూపించాలని సంక్రాంతి రోజు వెళ్ళాము. ఆఫ్రికా,  చైనా, మణిపురి,ఇంకా వేరే రాష్ట్రాల కళాకారులు కొంచెం ప్రమాదకరంగానే అనిపించే ఫీట్స్ చేశారు.ఎప్పటిలాగే సైకిల్ విన్యాసాలు, జిమ్నాస్టిక్ రింగ్స్,కత్తులతో విన్యాసాలు,పిచ్చి పనులు చేస్తూ నవ్వించాలనుకునె జోకర్లతో పాటు,ఏనుగు, పులి లాంటి పెద్ద జంతువులు లేవు కానీ సర్కస్ లో ఎప్పుడూ  చూడని మేక,గొర్రెలు,పొటేలు కొంచెం కామెడీగా అనిపించాయి. మణిపురి అబ్బాయి కళ్ళకు గంతలు కట్టుకుని పదునైన కత్తితో పక్కన వాళ్లు చేతిలో పట్టుకున్న,పొట్ట మీద పెట్టిన కీరా కట్ చేయటం చేస్తున్నవాళ్ళకెలా వుందో కానీ చూడటానికే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. 

సర్కస్ చూస్తున్నంత సేపు ఎంత ట్రైన్ అయినా కానీ వీళ్ళు బ్రతుకుతెరువు కోసం ఎంత నిర్లక్ష్యంగా ప్రమాదం అంచున ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు అనిపించింది.వాళ్లకి సర్కస్ ఒక ప్రమాదకరమైన జీవితమైతే మనకి అదొక వినోదం.సర్కస్ చూస్తున్నప్పుడు ''వికసించే పూలు ముళ్ళు విధి రాతకు ఆనవాళ్ళు,ఒకరి కంట పన్నీరైనా వేరొకరి కంట కన్నీరు'' పాట ఎందుకో గుర్తొచ్చింది .. మొత్తానికి ఈ సర్కస్ ఇలా నా చిన్నతనంలో DD ఛానల్ రోజుల్ని గుర్తు చేసింది.

ఈ ప్రపంచమే ఒక సర్కస్ అందులోమనుషులందరూ  నిత్యం సర్కస్ చేసే ఆర్టిస్ట్ లే .. అనే ఈ సర్కస్ సీరియల్ టైటిల్ సాంగ్ బాగుంటుంది. 

సర్కస్ హై భాయి సర్కస్ హై 



2 కామెంట్‌లు:

Mahesh చెప్పారు...

సర్కస్ సీరియల్ స్టోరీ అంతగా గుర్తులేదు కాని అప్పట్లో రెగ్యులర్ గా చూసిన సీరియల్. ఆ వయసుకి ఆ సీరియల్ బాగా నచ్చేసింది. అందులో చింతామణి అనే క్యారెక్టర్ అనుకుంటాను గడ్డం మీసాలతో బాగా నవ్వించేది. ఈ సిరియల్ నైట్ లో వచ్చేది అనుకుంటా. నుక్కడ్, బునియాద్, రామాయణ్ లాంటి సీరియల్స్ అప్పట్లో వచ్చేవి. ఆ సీరియల్స్ లే కాక వచ్చే ఏ ప్రోగ్రామ్ నైనా అర్థం అయినా కాకపోయినా విడవకుండా చేసేవాణ్ణి (హిందీ ప్రోగ్రామ్స్ బాగుండేవి, దూరదర్శన్ ప్రోగ్రామ్స్ లో కేవలం వవ్యసాయ కార్యక్రమాలు, వార్తలు లేదా ఒకే రూంలో నాటకాలు వచ్చేవి - అయినా అవీ వదలకుండా అన్నీ చూసేవాణ్ణి). ఆదివారం అయితే ప్రొద్దున 7 గంటలకు మొదలయ్యే హిందీ పాటల కార్యక్రమం (చిత్రమాల అని ఏదో పేరు ఉండేది) తో స్టార్ట్ అయితే నైట్ పడుకునే టైం కి వచ్చే సురభి కార్యక్రమంతో ఎండ్ అయ్యేది. సురభిలో వారం వారం వచ్చే క్వశ్చన్ అన్సర్స్ కి ఎదురు చూసేవాణ్ని- ఎంటర్టైన్మెంట్ తో బాటు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసేది. అంత మంచి ప్రోగ్రాం మళ్ళీ నేను ఇంతవరకూ చూడలేదు. అప్పట్లో టీవీ ఒక స్టేటస్ కూడా - టీవీ ఉన్నవారికి బోలెడు ఫ్రెండ్స్ కూడా ఏర్పడేవారు. ఆ రోజులే వేరు, చెప్పుకుంటే పోతే టీవీ విషయాలతో ఒక పుస్తకమే తయారవుతుందేమో - జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు మీకు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Mahesh" గారూ.. మీ చక్కని వ్యాఖ్యకి ధన్యవాదాలండీ.. మీరు చెప్పింది నిజమే మీ వ్యాఖ్య చదివాక టీవీ జ్ఞాపకాలతో ఒక పుస్తకమే రాయొచ్చు అనిపిస్తుంది..

"ఒకే రూంలో నాటకాలు" నిజంగా ఇవి కూడా భలే ఉండేవండీ కధ అంతా ఒకే గదిలో కర్టెన్స్ వేసి అక్కడక్కడే తిరుగుతూ జరిగేది ..

"టీవీ ఉన్నవారికి బోలెడు ఫ్రెండ్స్ కూడా ఏర్పడేవారు" ..:)ఇది మాత్రం ఎవరూ కాదలేని నిజం అనుకుంటాను..

నా పోస్ట్ నచ్చినందుకు మీ జ్ఞాపకాలు కూడా చెప్పినందుకు,థ్యాంక్సండీ

Related Posts Plugin for WordPress, Blogger...