పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

12, ఏప్రిల్ 2011, మంగళవారం

సకలగుణాభిరాముడు...



మానవత్వం సచ్చీలత మనిషికి దైవత్వాన్ని ఆపాదిస్తుంది అన్న మాటకి నిదర్శనం శ్రీరామచంద్రుడు.
శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు,
అన్నదమ్ముల ఆత్మీయ బంధానికి ప్రతీక,
భార్యాభర్తల బంధానికి ఇప్పటికీ ఆదర్శం..
ఇవన్నీ అందరు చేస్తారు,తమ రక్తసంబంధీకుల్ని గౌరవిస్తారు,ప్రేమిస్తారు
కానీ తనకి చిన్న సహాయం చేసినా వాళ్ళు తన కన్నా తక్కువస్థాయిలో ఉన్నప్పటికీ
వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్నాడు రాముడు...

రాముడు నేను కేవలం మా నాన్నని మాత్రమే గౌరవిస్తాను,మా సోదరులను మాత్రమే ప్రేమిస్తాను అని మిగతా వాళ్ళని కించపరచలేదు.
భార్యగా సీత కోరికను కాదనకుండా సీత బంగారు లేడి అడగగానే అది నిజమైనది కాదు అని తెలిసినా భార్య కోరిక తీర్చటానికి ప్రయత్నించాడు రాముడు..
శబరి ఎంగిలిని మహాప్రసాదంగా తీసుకుని ఆమెకి ముక్తిని ప్రసాదించాడు..
తనని పడవలో తీసుకెళ్ళిన గుహుడిని,
వారధి కట్టడంలో సహకరించిన వుడుత సహాయానికి,
లంకను గెలవటంలో సహకరించిన ఆంజనేయుడికి
తన హృదయంలో చెరగని స్థానాన్నికల్పించి మానవసంబంధాలకు ఆదర్శంగా నిలిచాడు రాముడు.

మనకి ఎవరు సహాయం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా ఏంటి వాళ్ళు మనకి చేసింది మనతో ఏదో ఒక అవసరం వుండి వుంటుంది అందుకే చేశారు అని, మనకి ఎవరైనా ఏదైనా పని చేస్తే మనం దానికి ఎంతో కొంత ఇచ్చేశాము కదా ఇంకేంటి మనకి వీళ్ళతో పని అనుకునే ప్రతి ఒక్క మనిషి రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి.
కానీ ఇవన్నీ చెప్పటానికి బాగానే వుంటాయి కానీ ఇప్పటి మనుషులు పాటించగలరా ???

అందుకే ఎప్పటికీ రాముడు రాముడే ...
రాముడి వ్యక్తిత్వం,పాలనాధర్మరక్షణ,వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ...
అన్నిటికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు...
దశరధరాముడు,సీతారాముడు,అయోధ్యరాముడు,సకలగుణాభిరాముడు...

నిరతము ధర్మమూ నెరపి నిలిపి
నరులకు
సురలకు తరతరాలకు
ఒరవడియైన
వరయుగ పురుషుడు
జగదభిరాముడు
శ్రీరాముడే

నా చిన్నిప్రపంచాన్ని,అందరినీ సీతారాములు
ఎల్లప్పుడూ
తమ కరుణాకటాక్షవీక్షణాలతో కాపాడాలని ప్రార్ధిస్తూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు...


Related Posts Plugin for WordPress, Blogger...