పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, జూన్ 2011, గురువారం

Second Task Completed....


జూన్ 26th న junior Civil Judge exam విజయవాడలో జరిగింది..
నేను law చదివిన Siddhartha group of Institutions కి చెందిన Siddhartha College లోనే exam.
నాకు విజయవాడ వెళ్ళగానే ముందు గుర్తొచ్చేది మా పెద్దమ్మ,పెదనాన్న...
CI of Police గా విజయవాడలో చేసిన పెదనాన్న వాళ్ళింట్లోనే ఉండి నేను Degree,law చదివాను.
అలా విజయవాడ అంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన అభిమానం..
విజయవాడలోకి అడుగు పెట్టగానే రకరకాల ఫీలింగ్స్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...

చిన్నప్పటినుండి సెలవులు వస్తే పెద్దమ్మ దగ్గరికి వచ్చి సంతోషంగా గడిపినరోజులు...
నన్ను law College లో జాయిన్ చేయటానికి కౌన్సిలింగ్ రోజు పెదనాన్నకి వీలుకాకపొతే పెద్దమ్మ కానిస్టేబుల్స్ ని వెంటబెట్టుకుని వచ్చి నన్ను College లో చేర్చిన మొదటిరోజు...
law లో Goldmedal తెచ్చుకుని నావాళ్ళందరి ముందు ఆనందంగా విజయగర్వంతో medal తీసుకున్నరోజులు..
ఇవన్నీ నేను నా జీవితంలో మరిచిపోలేని సంతోషకరమైన రోజులైతే...

నా law complete అవ్వకముందే పెదనాన్న చనిపోవటం,పెద్దమ్మ అన్నయ్యతో పాటు అమెరికా వెళ్ళిపోవటం...
మా పెదనాన్న విజయవాడలో CI మేము అక్కడికి వెళ్తున్నామంటూ గొప్పగా చెప్పుకుని, సంతోషంగా గడిపివెళ్ళిన మాకు ప్రస్తుతం
విజయవాడలో ఎవరు లేకపోవటం అనేది నా మనసుకి చాలా బాధ కలిగించే విషయం..

ఇలా విజయవాడతో నాది విడదీయలేని అనుబంధం...
మొన్న exam కి
విజయవాడ వెళ్ళిన నేను ఇలా రకరకాల ఫీలింగ్స్ తో కొంచెం సంతోషం కొంచెం బాధతో ...
నాకు ఇష్టమైన మా Siddhartha College లోనే exam రాసి వచ్చాను...
మూడు జిల్లాల వాళ్లకి ఒకే చోట exam జరిగింది..
మా రూమంతా లేడీ లాయర్స్.అందరు exam బాగానే రాసాము అని అన్నారు మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

నేను కూడా బాగానే వ్రాసాను.qualify అవుతాను అన్న నమ్మకం వుంది..
నా exam కోసం నాకు సహకరించిన నా చిన్నిప్రపంచానికి...
ముఖ్యంగా నాకు exam అయితే వాడు అలారం పెట్టుకుని 4 గంటలకే నిద్రలేచి నన్ను నిద్రలేపిన మా తమ్ముడికి,
నా బ్లాగ్ లో నాకు Bestwishes చెప్పిన నా బ్లాగ్ మిత్రులు..
జయగారు,వనజవనమాలి గారు,ఇందు
గారుగారు,శిశిర గారు
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు...Thankyou Verymuch.

త్వరలోనే Screening Test qualify అయ్యానన్న Sweet News మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటూ...



8 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ.. మీ పోస్ట్..చూసి బాధ కల్గింది. మా ప్రక్కకే వచ్చి వెళ్లావు. ఈ సారి విజయవాడ..మీ సిదార్ధ కాలేజ్ కి..వస్తే..దగ్గరలోనే ఉన్నాను.అల్లాగే.. ఇక్కడ.. మీకు ఒక ఆత్మీయులు కాగల వనజ ఉన్నారని గుర్తుంచుకోండి. మీ.. సిద్దార్ధ లా కాలేజ్ సాక్షిగా.. విజయోస్తు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారు మీ ఆత్మీయమైన ఆహ్వానానికి,
మీ దీవెనలకి నా హృదయపూర్వక ధన్యవాదములండీ..
నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది..
విజయవాడలో మీలాంటి ఆత్మీయులు దొరికినందుకు..
ఈసారి తప్పకుండా మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని దేవుడు నాకు కలిగించాలని కోరుకుంటున్నాను...

లత చెప్పారు...

ఆల్ ద బెస్ట్ రాజీ
మీరు తప్పకుండా విజయం సాధిస్తారు

మాలా కుమార్ చెప్పారు...

మీ ఎక్ష్జాంస్ ఐపోయాయా ? మీరు తప్పకుండా క్వాలిఫై అవుతారు , బెస్ట్ ఆఫ్ లక్ .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు లత గారూ...
మీ దీవెనలు ఫలించాలని కోరుకుంటున్నాను...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Exam అయిపోయింది మాలాకుమార్ గారూ...
మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు
మీ అందరి దీవెనలు ఫలించాలని కోరుకుంటున్నాను...

శిశిర చెప్పారు...

బాగా రాసారుగా. తప్పకుండా qualify అవుతారు judge గారూ. :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ శిశిర గారు..
మీ మాట నిజమై నేను judge కావాలని కోరుకుంటున్నాను...
మీ అందరి హౄదయపూర్వక దీవెనలు ఫలించి
నా జీవితంలో నేను అనుకున్నది సాధించాలని ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను..

Related Posts Plugin for WordPress, Blogger...