పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, ఏప్రిల్ 2016, గురువారం

మన బ్లాగ్ లోకి రాకుండానే మన బ్లాగ్ చదువుతారట "Inoreader" లో ..



ఒకప్పటి రోజుల్లో .. ఒకప్పుడేముంది ఇప్పటికి  కూడా మనం ఎవరితోనైనా మాట్లాడం,వాళ్ళంటే మనకి పడదు కానీ వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి ఎలా? అంటే వాళ్ళింటి విషయాలు మనకి మోసుకొచ్చే వేగులను నియమించుకునేవాళ్ళు. ఇప్పుడచ్చం అలాగే మన బ్లాగులోకి రాకుండానే,మనకి విజిటర్స్ కౌంట్ పెరగకుండా మన బ్లాగ్ లింక్  "Inoreader" లో Add చేస్తే చాలట. అక్కడ వాళ్ళ website లోనే మన బ్లాగ్ లో ఏ  రోజు పోస్ట్ ఆరోజు అప్ డేట్ అయిపోతుంది.

మరి అంతగా నా బ్లాగులోకి రాకూడదు,కానీ నా బ్లాగు రోజూ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరో కానీ నా "ఆపాత మధురాలు" బ్లాగ్ ని "Inoreader" లో Add చేశారు.నిన్న అక్కడ  నా బ్లాగ్ చూశాక  అనిపించింది. మనది కాని దాన్ని ఇలా ఎక్కడబడితే అక్కడ share చేసే వాళ్ళు మనుషులా లేక పశువులా అని. ఇలా ఇంకా ఎక్కడెక్కడ మన బ్లాగ్ లింక్స్ పెట్టేస్తారో ఎన్నని తెలుసుకుంటాం?? తెలియని వాళ్ళు మనమే ప్రచారం కోసం అలా ఎక్కడెక్కడో మన బ్లాగ్ లింక్ పెట్టాము అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా.

ఇది ఖచ్చితంగా బ్లాగుల్లో , ఇంకా చాలా చోట్ల మంచి సాంకేతిక జ్ఞానం ఉన్న పరిజ్ఞానులే చేశారని నాకు అనిపిస్తుంది. నా బ్లాగుల్లో కాపీ, పేస్ట్ డిజేబుల్ చేయటంతో పాపం పాటలు కాపీ చేయటం కష్టం అనిపించిన బ్లాగర్స్ ఎవరో ఈ పని చేసి ఉంటారు. అయినా "Inoreader" ఎవరిదైనా  బ్లాగ్ కానీ website కానీ add చేసే ముందు వాళ్ళ permission తీసుకునే అవసరం లేదా?? "RSS Feed" ఉంది కాబట్టి మీ బ్లాగ్ ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు అని ఈ website వాళ్ళ అభిప్రాయమట. బ్లాగులకి విజిటర్స్ కౌంట్ పెరగకుండా చేయటానికి, ఎవరు మన బ్లాగులో ఏమి చదివారో తెలియకుండా ఉండటానికి,మన బ్లాగ్ లో కాపీ చేయటం కుదరకుండా సెట్టింగ్స్ పెట్టుకుంటే అక్కడ కాపీ చేసుకోవటానికి ఈ inoreader బాగా ఉపయోగపడుతుంది. చాలా టెక్నాలజీల్లాగానే ఇది కూడా మంచికంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడేలా అనిపిస్తుంది.

ఇప్పుడు నేనేం చేయాలి ? సరేలే అని వదిలేయాలి లేదా బ్లాగు ఎవరికీ కనపడకుండా Hide చేయాలి...
బ్లాగు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయన్నమాట.


13 కామెంట్‌లు:

Dileep.M చెప్పారు...

You can always control the Content of the RSS Feed.
Use short or none option.
Check this link
https://support.google.com/blogger/answer/97933?hl=en

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank you so much for the link "Dileep.M" garu..
I've changed my settings..
Thank You :)

Smart Trader చెప్పారు...

If you disable feed of your blog, You will definitely lose viewers because your blog posts will not be visible in aggregators like Maalika and Sodhini.
I don't think your intention of restricting the reading of your posts from feedly, inoreader is good. Your ultimate goal must be whether your content reached audience or not.
But its ok if you write your blog only for yourself.
Otherwise enabling feed is Best idea.
చాలా బ్లాగుల్లో మా బ్లాగు తాజా పోస్టులు మీ మెయిల్ కి రావాలంటే సబ్ స్క్రయిబ్ చేసుకోండి అని ఊరికే ఇస్తున్నారనుకున్తున్నారా?
Any how all the best

Smart Trader చెప్పారు...

మీకు ఓ విషయం ! దిలీప్ గారు మీకు ఐడియా ఇచ్చారు గానీ ఆయన బ్లాగుల్లో అది అనుసరించట్లేదు.. ఇకపై మీది ప్రయివేట్ బ్లాగే

Dileep.M చెప్పారు...

"దిలీప్ గారు మీకు ఐడియా ఇచ్చారు గానీ ఆయన బ్లాగుల్లో అది అనుసరించట్లేదు "

రాజ్యలక్ష్మి గారికి ఒక సమస్య వచ్చింది దానికి నేను తోచిన solution చెప్పాను. నేను బ్లాగులు రాయడం మానేసి చాలారోజులు అయ్యింది. అదీకాక నా Recommended option is Short

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thannk You so much for ur comment "bhavya builders" గారు ..

"Your ultimate goal must be whether your content reached audience or not."


Yes it is sure that as a blogger My ultimate goal is to reach my blog posts to audience . but is it good that someone wants to follow my blog without visiting my blog? నా బ్లాగ్ లో నేను పోస్ట్ చేసిన విషయాలని ఎక్కడో చూడాల్సిన అవసరం ఎందుకు? నా బ్లాగ్ లోనే చూడొచ్చు కదా.

మాలిక,శోధిని,బ్లాగు లోకం,బ్లాగు వేదిక ఇలాంటివన్నీ మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు add చేసుకుంటారు That too they are redirecting the link to our blog. but "inoreader" is not like that. inoreader లో ఒక్కసారి feed add చేసిన తర్వాత ఇంక మన బ్లాగ్ లోకి రావాల్సిన పనిలేదు. అక్కడే ఎప్పటికప్పుడు బ్లాగ్ పోస్ట్స్ Update అవుతున్నాయి, అక్కడ మన content ఈజీగా copy కూడా చేసుకోవచ్చు. అది నాకు నచ్చలేదు.


"దిలీప్ గారు చెప్పిన లింక్ లో సెట్టింగ్స్ మార్చినా aggregators లో ఇప్పటిదాకా ఐతే .. నా బ్లాగ్ కనిపిస్తూనే ఉంది."

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Dileep.M. గారు నేను సెట్టింగ్స్ లో none అని Change చేశాను.. ఈ settings change చేయటం వలన blog పూర్తిగా visitors కి కనిపించకుండా పోదు అని నా అభిప్రాయం..

Smart Trader చెప్పారు...

దిలీప్ గారూ నొచ్చుకోకండి. మీరు ఇచ్చింది సరైన సలహానే.
అయితే ఇప్పటికే మాలికలో మీ పోస్టు కనబడ్డా ఇకపై కొత్తవి కనిపించవు .ఎందుకంటే ఇప్పుడేగా డిసేబుల్ చేసింది .కామెంట్లు రావట్లేదుగా. You can enable short feed for them otherwise your posts not visible.. I am sure!

Smart Trader చెప్పారు...

Rajyalakshmi garu, meeru feed disable chesaaru. ante kaanee blog ni private blog cheyalEdu kadaa ?

Smart Trader చెప్పారు...

For you information.. Maalika adds your blog feed not blog

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

bhavya builders గారు .. నేను blog readers settings change చేయలేదు . feed సెట్టింగ్స్ మాత్రమే change చేశాను నా blog feed delete చేయమని "inoreader" కి mail చేశాను. వాళ్ళు చేస్తామన్నారు.

Smart Trader చెప్పారు...

:))

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank You so much For Your Concern and comments Dileep.M garu,
bhavya builders garu.. :)

Related Posts Plugin for WordPress, Blogger...