పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, ఏప్రిల్ 2020, గురువారం

స్కందాశ్రమం - విరూపాక్ష గుహ - తిరువణ్ణామలై

భగవాన్ శ్రీ రమణ మహర్షి 1899 నుండి 1916 వరకు విరూపాక్ష గుహలోనూ,1916 నుండి 1922 వరకు స్కందాశ్రమంలోనూ నివసించారు.ఆయన తల్లిగారైన అళగమ్మాల్ తో కలిసి జీవించిన స్కందాశ్రమానికి చేరే దారి ఇప్పటి రమణాశ్రమం వెనకవైపు నుండి ఉంటుంది. 1.4 kms కొండపైకి వెళ్తే ఈ ఆశ్రమ చూడొచ్చు.ఆశ్రమానికి వెళ్ళడానికి నడిచే దారంతా చాలా నిశ్శబ్ధంగా పక్షుల శబ్ధాలు,పచ్చని అడవి, అందమైన నెమళ్ళ నడకలతో  ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

తిరువణ్ణామలైగా పిలిచే అరుణాచలంలో శ్రీరమణ  మహర్షి  గుడిలో, గిరి గుహలలో పలుచోట్ల నివాసముంటూ చివరగా  అరుణగిరి దక్షిణపాదంలో స్థిరపడగా అదే ఇప్పుడు  శ్రీరమణాశ్రమంగా రూపుదిద్దుకొంది.1896 సెప్టెంబర్‌ 1న అరుణాచల ఆగమనం నాటినుంచి ఏప్రిల్‌ 14, 1950 వరకు – సుమారు 54 సం.లపాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు.

స్కందాశ్రమానికి వెళ్ళే దారిలో చెక్కుతున్న బొమ్మలు

ఆశ్రమానికి వెళ్ళే దారిలో అందంగా,స్వేచ్ఛగా 
తిరుగుతున్న నెమళ్ళు

శ్రీ రమణులు అన్ని చోట్లకంటే ఎక్కువగా విరూపాక్షగుహలో  17 సంవత్సరాలు ఉన్నారు. తొలినాళ్ళలో స్వామి చాలావరకు మౌనంగా ఉండేవారు. అప్పటికే వారిచుట్టూ జిజ్ఞాసువుల, సేవక భక్తుల బృందం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు కడకు జంతువులతో సహా హృదయ మధురమైన దృశ్యం ఏమంటే, ఊళ్ళోని చిన్నవాళ్ళు సైతం శ్రమకోర్చి కొండెక్కి విరూపాక్షగుహవద్ద వున్న స్వామిని చేరి, కొంత తడవు వారివద్ద కూచొని, సరదాగా ఆడుకొని, తాయిలాలను ఆనందాన్ని పంచుకొని, తిరిగి వెళ్ళేవారు. వారికి స్వామి తమలో ఒకరు. ఉడుతలు, కోతులు వచ్చి వారి చేతినుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాటి అద్భుత దృశ్యాలెన్నో..1916లో తిరువణ్ణామలై వచ్చిన రమణుల తల్లి  "అళగమ్మ"
రమణుల దగ్గరే ఉండటానికి నిర్ణయించుకున్నారు.ఆశ్రమంలో ఉన్న కొందరికి ఆమె ఆహారం వండిపెట్టేవారు.త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టాడు.వీరందరూ రావటంతో  రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష గుహ నుంచి స్కందాశ్రమానికి మార్చారు.కందస్వామి అనే రమణుల శిష్యునిచే ఈ ఆశ్రమం స్థాపించబడినది ఆశ్రమ భవనము యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కుడా ఆయనే చొరవ చూపించారు. ఈ ఆశ్రమంలో రమణమహర్షి 1922  వరకు నివసించారు

విరూపాక్ష Cave / స్కందాశ్రమం Travel Vlog 
10 - August - 2019

Related Posts Plugin for WordPress, Blogger...