పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, జులై 2011, శనివారం

మా ముద్దు రాధమ్మ ...


జూన్ 6 నుండి 30 దాక క్షణం కూడా తీరిక లేకుండా మా చెల్లి పెళ్లి పనుల్లో మునిగిపోయాము.
మేము అపురూపంగా పెంచుకున్న మా బంగారు బొమ్మ మా చెల్లి పెళ్లి మేమంతా కోరుకున్నట్లే
సంతోషంగా సందడిగా జరిగింది..
పెళ్లి బట్టలు,షాపింగ్ తో మొదలైన మా చెల్లి పెళ్లిసందడి కొత్త పెళ్లి కూతురి సారె పెట్టి ,
అత్తింటికి పంపించటంతో పెళ్లిఘట్టం పూర్తి అయ్యి కొత్తకాపురం మొదలయ్యింది.
శ్రీకారం చుట్టుకున్న వాళ్ళ పెళ్ళిపుస్తకం
కొత్త జీవితంగా ఆకారం దాల్చింది..
అడుగడుగున తొలి పలుకులను గుర్తు చేసుకుంటూ
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకుంటూ
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోవాలని,వాళ్ళ  కొత్తకాపురం నవ్వుల నదిలో పువ్వులపడవలాగా నిత్యనూతనంగా  సాగిపోవాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్ధిస్తున్నాను..

All The Best Ramya Bhadra

మా ముద్దు రాధమ్మ రాగాలే


Related Posts Plugin for WordPress, Blogger...