పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, మార్చి 2012, శుక్రవారం

ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు...!


ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..
ముద్దు గారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
అంత
నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
పంతమాడే
కంసునీ పాలీ వజ్రమూ...


కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ పూసా
చెంతలా
మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
చెంతలా
మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ
మహిమలా దేవకీసుతుడూ


కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
కాళింగుని
తలలపై కప్పినా పుష్యారాగమూ
యేలేటీ
శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
యేలేటీ
శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ


పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
బాలునీవలే
దిరిగే పద్మనాభుడూ
బాలునీవలే
దిరిగే పద్మనాభుడూ


ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ
మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే
యశోదా ముంగిట ముత్యమూ వీడూ


ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు27, మార్చి 2012, మంగళవారం

వివాహ చట్టాల సవరణ బిల్లు,2010 - వివాదాలు ...!


THE MARRIAGE LAWS (AMENDMENT) BILL, 2010
A BILL further to amend the Hindu Marriage Act,
1955 and the Special Marriage Act, 1954.

గత కొంత కాలంగా టీవీల్లో, పేపర్లలో,అలాగే మన బ్లాగుల్లో కూడా తీవ్రమైన చర్చ
జరుగుతూన్న అంశం ఈ వివాహ చట్టానికి జరిగిన సవరణలు.
ఈ సవరణల ద్వారా ఇకనుండి విడాకులు పొందటం సులభం అవుతుంది.

సవరణలోని ముఖ్యాంశాలు:

1.భర్త తో వైవాహిక సంబంధాలు సరిదిద్దలేనంతగా పాడయ్యాయి
"on the ground that the marriage has broken down irretrievably.
"
అనే కారణంతో భార్య విడాకుల కోసం కోర్టును కోరవచ్చు..
కానీ ఇదే కారణంతో భర్త విడాకులు కోరలేడు.
అంతే కాకుండా వేచి ఉండే కాలం పేరుతో విడాకుల కోసం ఏళ్లతరబడి
కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కానీ ఈ వేచి ఉండే కాలం ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

2.విడిపోయాక భర్త నుండి కేవలం భరణం తో సరిపెట్టుకుంటున్న స్త్రీలు ఇక నుండి
"వివాహానంతరం" భర్త సంపాదించిన ఆస్తిలో వాటా కోరవచ్చు..
కానీ ఆ వాటా ఎంత అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

3.దంపతులు విడిపోతే వాళ్ళ దత్త సంతానానికి కూడా కన్న బిడ్డలతో
సమానంగా
అన్ని హక్కులూ లభిస్తాయి.

ఇవీ వివాహ చట్టానికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఆమోదించిన సవరణలు.

ఇంక చట్టం అమలులోకి వచ్చి అది ఎలా మన వివాహవ్యవస్థ మీద ప్రభావం చూపుతుందో
తెలియక ముందే దీని మీద చాలా చర్చలు వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ చట్టాన్ని పురుషులు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఎక్కడ భార్యలకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని చాలా బాధపడుతున్నారు.

కొంతమంది మగవారు పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా మానుకుంటారట కూడా..
ఎందుకంటే ఇక ఇప్పటి నుండి ఆడవాళ్ళుభర్త ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటారు,
విడాకుల తర్వాత రాబోయే ఆస్తి కోసం అని.

కొంతమంది భర్తలు,భర్త తరపు వారు ఆడపిల్లల్ని అనే మాట మా ఆస్తికి ఆశపడి
నువ్వు మా వాడిని పెళ్లి చేసుకున్నావు అని..
మరి అలాంటప్పుడు అబ్బాయిలు కూడా సంబంధాలు చూసేటప్పుడు మామగారు
ఇచ్చేకట్నంతో పాటూ,అమ్మాయి ఎంత చదువుకుంది,ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తుంది??
ఇలాంటివన్నీ చూసే కదా పెళ్లి చేసుకుంటారు.
అంటే అప్పుడు మగవారు భార్య నుండి వచ్చే డబ్బుకి ఆశపడినట్లు కాదా??

ఆడపిల్ల కట్నం తేవాలి,మనకి అనుగుణంగా,అనుకూలంగా ఉండాలి అని మగవారు
కోరుకున్నట్లే ... అల్లుడు మంచి ఆస్తిపరులై ఉండాలి,భర్త మంచి హోదాలో ఉండాలి
అని అమ్మాయిలూ కోరుకుంటారు.అందుకే అడిగినంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు.

ఈ రోజుల్లో డబ్బుకి,ఆస్తులకి ఆశ పడని మనుషులే లేరు.. ఒక భార్యే కాదు..
తల్లిదండ్రులు,అక్క చెల్లెళ్ళు,అన్నాదమ్ములు,కొడుకులు,కూతుర్లు కూడా
ఆస్తుల్లో వాటా కోసం కోర్టుని ఆశ్రయిస్తూనే ఉన్నారు.
మన రక్తం పంచుకుని పుట్టి,మనతో కలిసి పెరిగిన తోబుట్టువులు,తల్లి దండ్రులే ఆస్తుల కోసం
కోర్టుకి వెళ్లి, బెదిరించి, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుతున్నప్పుడు భర్త నిరాదరణకు గురైన భార్య
విడాకులు తీసుకునే సమయం లోఆ హక్కును కోరుకుంటే తప్పేంటి ??
కాబట్టి విడాకులు తీసుకునే సమయం లో భార్య భర్త ఆస్తిలో వాటా అడగవచ్చు
అంతమాత్రాన అది డబ్బుకి ఆశ పడినట్లు కాదు.

ఇంతకీ భార్య విడాకులు కోరగానే విడాకులు ఇవ్వటం,ఆస్తిలో వాటా కోరగానే ఇవ్వటం
ఇవన్నీ ప్రస్తుతానికి కాగితం మీద రాతలు మాత్రమే!
నిజంగా ఇలాంటి రిలీఫ్ కోరి ఎవరైనా స్త్రీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఉంటుంది అసలు కధ
"విడాకుల కోసం వేచి ఉండే సమయం", అలాగే భర్త ఆస్తిలో వాటా ఎంత ఇవ్వాలి అనేది జడ్జ్
యొక్క "Court's discretionary powers" "విచక్షణా అధికారానికే" ప్రస్తుతం వదిలేశారు.
కాబట్టి మన లాయర్లు కొందరికి ఈ అవకాశం చాలు జడ్జ్ ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి
అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.,

అలాగే భర్తలు కూడా భార్య అడగ్గానే వాటా ఇచ్చేంత అమాయకులేమీ కాదు ..
సంపాదించిన ఆస్తిని ఎవరో ఒకరి పేరున బినామీగా అయినా పెడతారు కానీ భార్యాపిల్లలకు
ఇవ్వటానికి ఇష్టపడరు కొందరు..

ఇంకా తెలివి మీరిన లాయర్లు ఉంటే నాకు పిచ్చి,నేనేమీ పని చేయను అని చెప్పెయ్యండి..
మీ వాళ్ళు అప్పుడు మీకోసం ఒక మెంటల్ సర్టిఫికేట్ తెస్తారు..
ఇంక మీరు,మీ వాళ్ళు సేఫ్ అప్పుడు..మిమ్మల్నేమీ చేయలేక మీ భార్య నోరు మూసుకుని
వెళ్ళిపోతుంది అని ఇలాంటి చావు తెలివితేటలు ఉపయోగించి సలహాలు కూడా ఇస్తున్నారు.

కాబట్టి మగవాళ్ళూ ... మీరేమీ భయపడకండి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్లాగా
మీరేమీ నష్టపోకుండా బయటపడే సూచనలు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు.

ఇంక కొందరి బాధ విడాకులు తీసుకోవటం వలన మన భారత దేశ సంస్కృతికి మాయని మచ్చ
పడుతుంది అని.
మన భారత సంస్కృతిలో ఇంతకుముందు లేని విపరీతాలు ఎన్నో ఇప్పుడు జరుగుతున్నాయి.
ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ హోమ్స్! ఒకప్పుడు తల్లిదండ్రులను దైవంలాగా పూజించే వాళ్ళు ..
వాళ్ళు చనిపోయే దాకా కొడుకుల దగ్గరే ఉండటం ఒకప్పటి మన సాంప్రదాయం..
మరి ఇప్పడు వీధి వీధికి ఒక ఓల్డ్ ఏజ్ హూమ్ ఎందుకు వస్తున్నాయి.ఇది కూడా భార్య కారణంగానే
అనే వాళ్ళు లేకపోలేదు..కానీ ఎంత మంది కొడుకులు పెళ్ళికి ముందే తల్లిదండ్రులను ఒంటరిగా
వదిలేసి
ఇతర దేశాలకి వెళ్ళటం లేదు??

కాబట్టి విడాకులు ఒక్కటే మన సంస్కృతికి మాయని మచ్చ కాదు..దీన్ని మించిన ఘోరాలు
ఎన్నో ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఎన్నో చట్టాలు మన దేశంలో దుర్వినియోగం అవుతుండగా దీన్ని గురించే ఇంత చర్చ ఎందుకంటే
ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్య కాబట్టి.సొంత ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి.

అలాగని విడాకులు ప్రోత్సహించమని నా ఉద్దేశ్యం కాదు ..
ఏ ఆడవాళ్ళైనా విడాకులు తీసుకోవాలని,పెళ్ళికి ముందే విడాకులు తర్వాత రాబోయే
భర్త ఆస్తి కోసం ఆశపడి,ప్లాన్స్ వేసుకుని పెళ్లి చేసుకునే స్థాయికి దిగజారతారని నేను అనుకోను.

అలాగే చిన్న చిన్న కారణాలకే విడాకులకి వెళ్ళే ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఉండరు
అని నా అభిప్రాయం.. విడాకులు కోరగానే ఇచ్చేస్తున్నారు కదా అని ఆడవాళ్ళందరూ
వాటి కోసం పరిగెత్తి వెళ్లి తెచ్చుకోవటానికి అవేమీ డిస్కౌంట్ లో ఇచ్చే చీరలు కాదు కదా!
చట్టాలని దుర్వినియోగం చేసే వాళ్ళు లేరని కాదు..అలాగని అందరూ చట్టాన్ని
దుర్వినియోగం చేస్తున్నారని అపోహ పడటం తప్పు.

ప్రతి ఒక్క మనిషికీ తెలుసు సమాజం నిర్ణయించిన కొన్ని హద్దుల్ని దాటితే ఎలాంటి పరిస్థితులను
ఎదుర్కోవాల్సి వస్తుందో అని! కాబట్టి .. ఏ మనిషీ కూడా చూస్తూ చూస్తూ బాగున్న పరిస్థితులను
చెడ గొట్టుకోలేరు. అలాగే విరిగిన మనసులు ఎప్పటికీ కలవవు... సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు
కాదు ఒక్కసారి విభేదాలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఎంత ప్రయత్నించినా,
ఎన్నాళ్ళు వేచి ఉన్నా ఫలితం ఉండకపోవచ్చు.

ఏది ఏమైనా ఎవరి అభిప్రాయాలు వారివి...అలాగే ఎవరి నిర్ణయాలు వారివి..
నా మనసుకు అనిపించింది నేను చెప్పాను.ఎవరినో ఒక్కరినే నేను సపోర్ట్ చేయటం లేదు.
తప్పు అందరిలోనూ ఉంటుంది. కాకపొతే దాన్ని సరిదిద్దుకునే విధానమే మనిషి మనిషికీ మారుతుంది.


25, మార్చి 2012, ఆదివారం

తప్పిపోయినప్పుడు పాడుకునే పాటలు..


నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే..చిన్నప్పుడు అంటే నాకు సినిమా చూసే జ్ఞానం వచ్చినప్పటి నుండి అన్నమాట.అలా నేను చూసిన సినిమాలు రెండు విభాగాలు.కొన్ని సినిమాలు మా ఫ్యామిలీ అందరం అంటే అమ్మ,నాన్న,తమ్ముడూ,చెల్లి అందరం కలిసి చూసినవి..కొన్ని సినిమాలు మా అమ్మ,అమ్మ స్నేహితులు, పిన్ని, అత్తయ్యలు,మా చిన్నపిన్ని స్నేహితులు నన్నుతోడుగా తీసుకెళ్ళిన సినిమాలు.(ఏంటో  ఆ రోజుల్లో కాలేజ్ కి వెళ్ళే ఆడపిల్లలకి మాలాంటి చిన్న పిల్లలే తోడు సినిమాలకి వెళ్ళాలంటే.)

ఇంక అప్పట్లో కొన్ని ఆడవాళ్ళు మాత్రమే చూసే సినిమాలు ఉండేవి వాటికి మగవాళ్ళు అంతగా వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకి ఘర్షణ,సింధూరపువ్వు,నీరాజనం,స్వాతి చినుకులు,జీవనజ్యోతి , ఇంకా కొన్ని రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు ఇలాంటివన్నీ ఆడవాళ్లకే ప్రత్యేకమైన మ్యాట్నీ సినిమాలు...

ఇంక రెండో విభాగం లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు ఉండేవి.మా చిన్నప్పుడు మా వూరిలో పోకిరి మగపిల్లలు ( మా పెద్దల దృష్టి లో )ఇలాంటి సినిమాలకి వచ్చేవాళ్ళు..అందుకని ఇలాంటి సినిమాలకి వెళ్ళాలంటే నాన్న తప్పనిసరి మాతో పాటూ ... ఇదీ మా సినిమాల విభజన.

ఇంకో సినిమా విభాగం నా ఫ్రెండ్ రాజేశ్వరితో చూసిన సినిమాలు.. వాళ్లకి ఒక సొంత సినిమా హాల్ ఉండేది.ప్రతి ఆదివారం వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్ళకుండా వూర్కునేది కాదు.ఒక్కో సినిమా నెలరోజులు,ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆడే ఆరోజుల్లో కొన్ని సినిమాలు కనీసం ఐదారుసార్లన్నా చూసి ఉంటాను దాని గొడవ వల్ల.అలా ఐదారుసార్లన్నాచూసిన వాటిలో చెట్టుకింద ప్లీడర్ ఒకటి..అందుకే ఆ సినిమా నిద్రలో లేపి అడిగినా స్టోరీ అంతా గుర్తుంటుంది.ఎంతైనా అప్పటి సినిమాలు బాగుండేవి.ఇప్పటికీ టీవీలో వస్తున్నా వాటిని చూడాలి అనిపిస్తుంది.

అప్పటి సినిమాల్లో కొన్ని కామన్ విషయాలు చాలా ఉండేవి. అలాంటి వాటిల్లో తప్పిపోయి,కలుసుకునే పాటలు ఒకటి.ఉదాహరణకు ఒక కుటుంబం ఆనందంగా పుట్టినరోజో,పండుగో చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉంటారు. సడన్గా రౌడీ వచ్చి అక్కడ విధ్వంసం చేస్తాడు.పాపం కుటుంబం అంతా చెల్లా చెదురై పోతారు.కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దయ్యి వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చిన్నప్పుడు పాడుకునే పాట పాడుతూ ఉంటారు..ఇంతలో పక్కనుండి ఇంకెవరో వచ్చి అదే పాట పాడగానే అన్నయ్యా,తమ్ముడూ,అమ్మా,నాన్నా అంటూ అంటూ హ్యాపీగా కలుసుకుంటారు.ఇప్పుడంటే ఎదో కామెడీగా అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూస్తుంటే  మళ్ళీ  వీళ్లెలా కలుస్తారబ్బా అని ఆలోచిస్తూ చాలా బాధగా ఉండేది :)

నాకొక సందేహం నిజంగా అంత చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలకి ఆ పాట ఎలా గుర్తుంటుంది??
వీళ్ళు పాడుతున్నప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు విని వాళ్ళు కూడా వచ్చి పాడే ప్రమాదం లేదా??
ఏది ఏమైనా ఆ పాటలు పాడుకున్న వాళ్ళందరూ కలిసి, కధలు సుఖాంతం అయ్యాయి కాబట్టి
ఇప్పుడు ఈ సందేహాలతో నా బుర్ర పాడు చేసుకుని, పక్కన వాళ్ళ బుర్ర కూడా పాడు చేయటం ఎందుకు.

ఇలాంటి తప్పిపోయినప్పుడు పాడుకునే పాటల్లో నాకు గుర్తున్న కొన్ని పాటలు
ఆనాటి హృదయాల ఆనందగీతం - అన్నదమ్ముల అనుబంధం
సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం - ముగ్గురు కొడుకులు
అమ్మంటే మెరిసే మేఘం .. కురిసే వానా - ముగ్గురు మొనగాళ్ళు


ఇంకెవరికైనా ఏవైనా కుటుంబ గీతాలు గుర్తుంటే గుర్తు చేయగలరు :)

23, మార్చి 2012, శుక్రవారం

ఆనంద "నందన" ఉగాది శుభాకాంక్షలు...!కనులకింపుగా ... కలలు పండగా
వసంత శోభతో ... షడ్రుచుల రుచులు విందుతో
విచ్చేసింది ఆనందాల "నందన" ఉగాది.
సుఖ సంతోషాలను తెచ్చింది .. మన తెలుగు సంవత్సరాది.


తీపి ,చేదు,ఉప్పు,కారం,పులుపు,వగరు
కలగలసిన అద్భుతం ఉగాది పచ్చడి..
సంతోషం ,బాధ,ఇష్టం,కష్టం,గెలుపు,ఓటమి
కలగలసిన
అద్భుతం జీవితం..

కొత్త ఆశలతో,ప్రణాళికలతో మనందరం ఆనందంగా ఆహ్వానిస్తున్న
"నందన" నామ సంవత్సరం లో అందరూ సుఖసంతోషాలతో,
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని
కోరుకుంటూ ...


శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు...నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు తన నిద్రమానుకుని నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది..
కలల ఊయలలో నన్ను మెల్ల మెల్లగా ఊపింది..

ఎలాంటి
పరిస్థితిలోనైనా నీకు నేనున్నానని స్నేహపూరితంగా
నాకు ధైర్యం చెప్పింది..

బాధని తట్టుకునే ధైర్యంలేని నా మనసు కన్నీరుగా మారినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని
నా కన్నీటిని తన చీర చెంగుతో తుడిచింది..

తనని విసిగించే పనులు చేసి మనశ్శాంతి లేకుండా చేసినా భరిస్తుంది.
అర్ధంలేకుండా నేను కోప్పడినా అర్ధం చేసుకుంటుంది..

మొత్తం ప్రపంచం మీద అలిగి నేను కోపంగా నిద్రపోయినప్పుడు నెమ్మదిగా
దుప్పటి కప్పి,తన కొంగులో నన్ను దాచుకుంటుంది..

మొదటి గురువుగా జీవిత పాఠాల్ని నేర్పుతుంది
పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ కీ తను తీసిపోను అంటుంది.

రెక్కలొచ్చి మనం ఎగిరిపోయినప్పుడు మన ఉన్నతికి గర్విస్తుంది
తన గూటిలోనే తను ఉండిపోతుంది..

అమ్మంటే సృష్టి, అమ్మంటే సహనం, అమ్మంటే త్యాగం, అమ్మంటే ప్రేమ
"అమ్మ వంటిది ... అంత మంచిది అమ్మ ఒక్కటే"


ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మను భగవంతుడు
ఆయురారోగ్యాలతో
దీవించి, కాపాడాలని,
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
అమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


"నా
చిన్నిప్రపంచం
"


18, మార్చి 2012, ఆదివారం

Be Yourself... Nobody is better Qualified...!


భావ వ్యక్తీకరణ గొప్ప గొప్ప మాటల్లోనే చేయాల్సిన అవసరం లేదు.
మనసును తెలిపే ఒక చిన్ని చిరునవ్వు.. ఒక చిన్నమాట , ఒక మంచి పాట
చివరికి మౌనం కూడా భావ వ్యక్తీకరణలో భాగమే..

నాకు పెద్ద పెద్ద కవిత్వాలు రాయటం రాదు,కధలు చెప్పటం రాదు,కానీ నామనసుకు
నచ్చిన విషయాలని నా చిన్నిప్రపంచంలో ఎప్పటికీ గుర్తుండేలా దాచుకోవటం నాకు ఇష్టం.
అందుకే
నా ఈ ప్రయత్నం...

నాకు పాటలు వినటం ఇష్టం అందుకే పాటల బ్లాగు రాస్తాను,నాకు ఇష్టమైన పాటలు సేకరిస్తాను.
నా సరిగమలు ... గలగలలు బ్లాగు నాకు సెలెక్టేడ్ సాంగ్స్ వినే నా సంగీత ప్రపంచం
పాటలకి యూ ట్యూబ్ ఉంది కదా నీ బ్లాగ్ అవసరమా అని కొందరు అనొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కదా!

ఇంక పిక్చర్స్ ... నా బ్లాగ్ లో ప్రతి పోస్ట్ కి పిక్చర్స్ యాడ్ చేస్తాను.
ఇన్స్పిరేషన్ కొటేషన్స్ , పిక్చర్స్ సేకరించటం నాకు ఇష్టం..
ఎందుకంటే ఎన్నో మాటల్లో చెప్పలేని భావాలు పిక్చర్స్ చెప్తాయి..
"A picture is worth a thousand words" కదా!


నా
పోస్ట్ కి తగిన పాటగార్కరి బ్లాగ్ జ్యోతిర్మయి గారు చెప్పిన పాట
ThankYou జ్యోతిర్మయి గారు..

'Everyone is Special'15, మార్చి 2012, గురువారం

గురూజీలు అందరూ పూజ్యులేనా ???


ఉదయాన్నే
టీ వీ పెట్టటం ఆలస్యం స్వామీజీలు,బాబాలు దర్శనం ఇస్తూ ఉంటారు.
సదా చిదానంద స్వరూపులై... చిరునవ్వు నవ్వుతూ గురువు అనుగ్రహం కావాలంటే
సేవా పధాన నడవండి, పరోపకారమే పరమ ధర్మమని గ్రహించండి అని ఒక గురూజీ చెప్తాడు.
తోటి వారిని ప్రేమించండి..అందరి పట్లా దయ కలిగి ఉండండి, "To Live Is To Love"
అని మరొక "ఆర్ట్ ఆఫ్ లవింగ్" గురూజీ చెప్తాడు.

నాకు వీళ్ళందరూ చెప్పేవి వింటుంటే వీళ్ళు చెప్పే ఈ నైతిక విలువలన్నీ ముందు వీళ్ళు పాటిస్తారా
అని సందేహం కలుగుతుంది.వట్టి మాటల కన్నా ఆచరణ ముఖ్యం.
ప్రపంచ వ్యాప్తంగా తమ సేవా సంస్థలను స్థాపించి, విమానాల్లో విదేశీ యానాలు చేసి,
శాంతిని,ప్రేమను చాటించి వచ్చే గురూజీలు,వాళ్ళ సహాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా,జిల్లాలలో చిన్న
గురువులుగా చెలామణీ అయ్యే గురువు గారి అసిస్టెంట్లు వీళ్ళందరూ నిజంగా సామాన్య మానవులకి
ఉండే అసూయా,ద్వేషం,ఆవేశం,స్వార్ధం లాంటి లక్షణాలకు,లౌకిక విషయాలకు అతీతులేనా??

ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బాబాలు,గురూజీలు విశ్వవ్యాప్తంగా, గొప్పగొప్ప వాళ్ళ అండదండలతో
ప్రజలకి నైతిక విలువల పట్ల అవగాహనను కల్పించి ప్రజల మనస్సుల్లో శాంతి,ప్రేమను
మొలకెత్తించే పనిలో బిజీ గా ఉంటున్నారు.వీళ్ళని అనుసరించి ఆరాధించే వాళ్ళు కూడా
చాలా మందే వుంటున్నారు. ఎవరి ఇష్టాలు వారివి..

మా అమ్మమ్మ చెప్పిన ఒక కధ :

ఇద్దరు
సన్యాసులు కలిసి ఒక చోటికి వెళ్తున్నారు.వాళ్ళిద్దరూ గురు శిష్యులు ధర్మ ప్రచారం
చేసుకుంటూ పోతున్నారు.ఇంతలో సాయంకాలమైంది.చీకటి పడబోతుండగా వాళ్లకు
ఒక నది అడ్డం వచ్చింది.అక్కడే ఒక పల్లెటూరి పిల్ల కూడా ఉంది.ఈ ఒడ్దు నుండి ఆ ఒడ్డుకు చేర్చే
బల్లకట్టు అక్కడ లేదు దాంతో ఆ పల్లెటూరి పిల్ల "ఈ రాత్రి వేళ నేను ఇక్కడ ఎలా ఉండాలి దేవుడా"
అని ఏడుపు మొదలుపెట్టింది.గురు శిష్యులిద్దరూ ఎంత ఓదార్చినా వినలేదు..ఏడుస్తూనే ఉంది.
చేసేది లేక శిష్యుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని భుజం మీద వేసుకుని,ఒక చేత్తో ఆ అమ్మాయిని
పట్టుకుని,మరో చెయ్యి గురువు గారికి అందించి లోతు తక్కువగా ఉన్న వైపు అడుగులు వేస్తూ
మెల్లగా నది దాటాడు.

దాంతో గురువు గారు తీవ్రంగా చింతించారు,అతలాకుతలమయ్యారు,సన్యాసులు స్త్రీలను
తాకటమే నిషేధమైతే తన శిష్యుడు ఏకంగా ఒక పిల్లను భుజం మీద ఎక్కించుకుని మోశాడు
అయ్యో ఎంత ఘోరం,పాపం అంటూ పాదయాత్ర పూర్తయ్యి,ఆశ్రమం చేరే వరకు గురువు గారు
చీటికి మాటికీ ఆ పిల్ల ప్రస్తావన తెస్తూ శిష్యుడ్ని సాధిస్తూ,వేధిస్తూ వచ్చారు.

గురువు గారి సూటీ పోటీ మాటలు విసుగు చెందిన శిష్యుడు గురువుగారికి చేతులెత్తి నమస్కరించి,
" అయ్యా ! నేనా పిల్లను నా భుజం మీద నుంచి దించి,బరువు వదిలించుకుని నాలుగు రోజులైనా,
మీరు మాత్రం ఆ పిల్లను ఇంకా మీ ఆలోచనల్లో మోస్తూనే వున్నారు" అన్నాడు తీవ్ర స్వరంతో..
గురువు గారు బిత్తరపోయి మళ్ళీ ఆ పిల్ల మాట ఎత్తలేదు పాపం...

ఇతరులు ఎలా వుండాలి అనుకుంటున్నామో ,మనం అలాగ వుండాలి.ఏది చెబుతున్నామో
అదే చేయాలి.వట్టి మాటల కన్నా ఆచరణ ముఖ్యం...
గురువులంటే తాము ఒకరికి చెప్పే నీతులు,నైతిక విలువలను వారు ముందుగా ఆచరించాలి.
ఆదర్శాలను వారు ముందుగా పాటించాలి..అన్నిటిలో,అందరిలోను భగవంతుని చూస్తూ..
మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.ఇలా తానూ పాటించి ఎదుటి వారికి నీతులు చెప్పేవాడు
"సన్యాసి" అవుతాడు లేకపోతె "సన్నాసి" అవుతాడు.

In reality there is neither guru nor disciple,
neither theory nor practice,
neither ignorance nor realization,

It all depends on what you take yourself to be.
Know your self correctly, There is no substitute to self-knowledge.12, మార్చి 2012, సోమవారం

"ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం "


"
మౌనమే నీ భాష మూగ మనసా" అంటూ..."బాధపడే సమయంలో మనసు భాష మౌనమని"
"
గుప్పెడు మనసు" సినిమాలో,
"కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు" అంటూ..."కళ్ళలో ఉన్న బాధ కళ్ళకే తెలుస్తుందని"
"
అంతులేని కధ" సినిమాలో ...
సగటు మనిషి జీవితంలోని కష్టనష్టాలను, ఆ కష్టానికి మనసు పడే వేదనను అద్భుతంగాఆవిష్కరించగల గొప్ప దర్శకుడు కే.బాలచందర్.హృదయ వేదనని మనసు పాటల్లో పలికించిన బాలచందర్ గారి సినిమాల్లో నాకు నచ్చిన మరొక సినిమా "ఇది కధ కాదు" .

ఈ సినిమాలో పాటలు అన్నీ బాగుంటాయి. ఇందులో ఒక పాట నేను కొత్తగా విన్నాను.
పాటలోని సాహిత్యం జీవితానికి అన్వయించి ఉంటుంది.
"ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం " అంటూ మొదలై
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు" అని
ముగిసే ఈ పాట వింటుంటే
ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ అనిపించింది. నాకు నచ్చిన పాట.


తకధిమితక ధిమితకధిమి
తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
 
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు
ఒక మనసని అనుకుంటే స్వర్గం


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఈ లోకమొక ఆట స్థలము ... ఈ ఆట ఆడేది క్షణమూ
 
లోకమొక ఆట స్థలము ... ఆట ఆడేది క్షణమూ
ఆడించు వాడెవ్వడైనా ... ఆడాలి ఈ కీలుబొమ్మా
 
ఆడించు వాడెవ్వడైనా ... ఆడాలి ఈ కీలుబొమ్మా

ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
 
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు ... చెప్పేసెయ్ తుది వీడుకోలూ

ఉంటారు రుణమున్న వాళ్ళూ ... వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపూ ... తానోడుటే దాని గెలుపూ
 
ఏనాడు గెలిచింది వలపూ ... తానోడుటే దాని గెలుపూ
గాయాన్ని మాన్పేది మరుపు .
.. ప్రాణాల్ని నిలిపేది రేపూ 
గాయాన్ని మాన్పేది మరుపు ... ప్రాణాల్ని నిలిపేది రేపు

ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
 

సినిమా : ఇది కధ కాదు
డైరెక్టర్ : K.బాల చందర్
సంగీతం : M S విశ్వనాథన్
సింగర్ : S.P.బాలు


8, మార్చి 2012, గురువారం

Happy Women's Day ...!శ్రీకారం చుడుతున్నట్లు..కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చుస్తున్నాయే..మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్లు
రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టుదాకుందే బంగరు బొమ్మ

నక్షత్రాలెన్నంటూ..లెక్కెడితే ఏమయినట్లు
నీ మనసుకు రెక్కలు కట్టు.. చుక్కల్లో విహరించేట్లు
ఎక్కడ నా వెలుగంటూ.. ఎప్పుడు
ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ.. నిద్దురనే వెలి వేయొద్దు

వేకువనే
లాక్కొచ్చేట్లు .. వెన్నెలనే దారం కట్టు
ఇదిగో
వచ్చానంటూ.. తక్షణమే హాజరయేట్టు
నళినివో ... హరిణివో ... తరుణీవో... మురిపించే ముద్దుల గుమ్మ..http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html


7, మార్చి 2012, బుధవారం

♥ Colours Of Life ♥


మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన


ఎరుపు రంగు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రంగు..
పెళ్ళిలో పెళ్లి కూతురికి పండే ఎర్రని గోరింటాకు తో మొదలై పెళ్లి పట్టు చీర,గాజులు,
పాపిటలో ఎర్రని కుంకుమతో పెళ్లి కూతురు వివాహిత స్త్రీగా మారే దాకా ఎరుపుదే ప్రాధాన్యత.
 • ఎరుపు రంగు వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక,ఇది ఉత్తేజకరమైన రంగు.
 • ఎరుపురంగు ఇష్టపడే వ్యక్తి సాహసోపేతమైన వ్యక్తిత్వం కలిగి వుంటారు.
 • ఇతరులను అధిగమించాలని చూస్తుంటారు.
 • అలాగే ప్రమాద సూచికగా కూడా ఎరుపునే సూచిస్తారు.
చిన్నప్పుడు నా ఎర్రటి హీరో హన్సా సైకిల్ నాకు చాలా ఇష్టం.

పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు.


ఆకుపచ్చ రంగు ప్రకృతికి ప్రతీక.పచ్చని ప్రకృతి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
శుభ సందర్భాల్లో ఆకుపచ్చకు ప్రాధాన్యత ఉంది.శుభకార్యాలు,పండుగలు
పచ్చని మామిడాకు తోరణాలతోనే మొదలవుతాయి.
 • ఆకుపచ్చ రంగు ఇష్టపడే వాళ్ళు తోటివారికి సాయపడేందుకు ప్రయత్నిస్తారు.
 • ఎవరైనా బాధల్లో వున్నట్లు కనిపిస్తే, వారిని ఓదార్చేందుకు చూస్తారు.
 • సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు,కొన్ని సార్లు నిర్దయగా కూడా ఉంటారు.
 • ఆకుపచ్చ రంగు హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు..ఈ రంగు కళ్ళకు మంచిది.
 • ఇది నూతనోత్సాహాన్ని, శాంతిని ఇచ్చే రంగు
నాకు పచ్చటి గార్డెన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతానికి పెద్ద గార్డెన్ లేకపోయినా ..
మా ఇంట్లో పూలకుండీల మధ్యలో కాసేపు కూర్చోవటం,మొక్కలకి నీళ్ళు పోస్తూ
వాటిని పలకరించం
నాకు చాలా ఇష్టం..

ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరేనే కన్నె గగనం

ఊదా రంగు చాలా అరుదైన రంగు,రాయల్ కలర్ కూడా ..దీన్ని వంగపువ్వు రంగు అంటారు.
U.S మిలటరీ లో ధైర్య సాహసాలకు గుర్తింపుగా "పర్పుల్ హార్ట్" అవార్డ్ ఇస్తారు.
రంగు సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక.
 • పర్పుల్ కలర్ ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలనుకుంటుంటారు.
 • నమ్మిన వారికోసం ఏదైనా చేయగల ఔన్నత్యం రంగు ఇష్టపడే వారి సొంతం.
 • లేనిపోని లౌక్యాలను ప్రదర్శించరు,వినయంగా అమాయకంగా ఉంటారు.
 • ఈ రంగును వాడితే డిప్రెషన్‌, అభ్రదతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలను అణచిపెట్టుకోవడం జరుగుతాయి.
పర్పుల్ కలర్ నాకు చాలా ఇష్టమైన రంగు.నా చీరలు,డ్రెస్ లు చాలా వరకు షేడ్స్ లోనే
వుంటాయి.పర్పుల్ గులాబీలు నాకు చాలా ఇష్టమైన పూలు.

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే


అనంతమైన ఆకాశం,అంతులేని సముద్రం,అందరూ ఇష్టపడే కన్నయ్య రంగునీలం.
ప్రశాంతమైన రంగు.
రంగును ఎక్కువగా ఉపయోగించటం వలన స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ,
సుఖనిద్ర, సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు.
 • స్వచ్చత,శాంతం,అనర్గళంగా మాట్లాడటం,ఆత్మవిశ్వాసం,
 • మనసులో ఒకటి పైకి ఒకటి లాగా ఉండని మనస్తత్వం ఈ రంగును ఇష్టపడే వాళ్ళ ప్రత్యేకతలు.

♥ నాకు ఇష్టమైన సముద్రం,ఆకాశం,కృష్ణయ్య అన్నీ నీలమే..ఆక్వా బ్లూ నాకు చాలా ఇష్టం.

గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలి లే
ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా

పింక్ కలర్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే రంగు.
పింక్ రిబ్బన్ బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనకు,దానికి వ్యతిరకంగా పోరాడే హోప్ ను
కలిగించే సింబల్ గా ఉపయోగిస్తున్నారు.
జైపూర్ లో పింక్ రంగులో ఉండే కట్టడాలతో పింక్ సిటీ ప్రసిద్ధి చెందింది.
 • పింక్ కలర్ఇష్టపడేవారుఅందంగా,చిలిపిగాఉంటారట.
 • పింక్ కలర్ సంతోషాన్ని,ఉత్సాహాన్నీ కలిగిస్తుంది.
పింక్ కలర్ గులాబీలు,టెడ్డీలు ,కాటన్ చీరలు నాకు ఇష్టం.

తియ్యతియ్యని కలలను
కనటమే
తెలుసు కమ్మని ప్రేమలో


బ్రౌన్ కలర్ నిస్తేజానికీ ప్రతీక. భూమి రంగును సూచిస్తుంది.
రంగును ఇష్టపడే వారు నిరాడంబరంగా ఉంటారు,డాంబికాలకు పోరు
చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.

నాకే కాదు అందరికీ చాలా ఇష్టమైన chocolates బ్రౌన్ కలరే ! మరీ ఎక్కువ
chocolates తినటం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా అప్పుడప్పుడు తినటం అవసరం :)
chocolates, ఇంకా కాఫీ కూడా నా ఫేవరేట్.

కాంచనాల జిలుగు పచ్చా
కొండబంతి గోరంత పచ్చ

పసుపు
రంగు శుభకరమైన రంగుల్లో ఒకటి.గడపకి పసుపు రాయటం శుభకార్యాలకి,
పండగలకి
ఆహ్వానం పలకటానికి .పసుపు రాసిన గడపలు లక్ష్మీ కళతో వుంటాయి.
శాస్త్రీయంగా
కూడా పసుపు వాడకం మంచిది.పసుపురంగులో గొప్ప కళ ఉంది.
 • పసుపు రంగు గులాబీలు స్నేహానికి గుర్తు..
 • పసుపు రంగు ఇష్టపడే వారు హుషారుగా ఉత్సాహంగా ఉంటారు.
 • ఆత్మస్థైర్యంతో ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. లాజికల్ గా మాట్లాడతారు.

పసుపు రంగు చామంతులు,పసుపుగా పండిన మామిడిపళ్ళు ,పచ్చని బంగారం నాకు చాలా ఇష్టం.

తెల్లని తెలుపే ఎద తెలిపే
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెలుపు స్వచ్చతకు,నిర్మలత్వానికి ప్రతీక.ఎండాకాలంలో తెల్లటి కాటన్ డ్రెస్ లే ఎక్కువగా వాడతారు.
కళ్ళకు హాయిగా ప్రశాంతంగా అనిపించే రంగు.

 • తెలుపు రంగు ఇష్టపడేవాళ్ళుసహజ సిద్ధమైన వైఖరిని,విషయాల పట్ల స్ఫష్టమైన అవగాహనను కలిగి ఉంటారు.
 • సున్నితమైన మనస్కులు కూడా.
 • అంతే కాదు తెలుపును ఇష్టపడే వాళ్ళు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు .

సమ్మర్ లో తెల్లటి మల్లెపూలు ,తెల్లటి కాటన్ డ్రెస్ లు నా ఫేవరేట్

రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే

నలుపు రంగు ఎక్కువగా ఆశుభానికి,శని కి ప్రతీకగా సూచిస్తారు.
కానీ వర్షాన్నిచ్చే నల్లటి మేఘాలు,మనిషికి విశ్రాంతి నిచ్చే రాత్రి అన్నీ నలుపే..
అలాగే ఆడపిల్ల కాటుక కళ్ళు,నల్లని పొడవైన కురులు ఇష్టపడని వాళ్ళుండరు.

 • నలుపు రంగును ఇష్టపడే వాళ్ళు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
 • వాళ్ళపై వేరొకరు ఆధిపత్యం చెలాయించటం వీళ్ళకి నచ్చదు.
 • చరిత్రను ఇష్టపడే వారు నల్ల రంగు కార్లంటే ఆసక్తి కలిగి ఉంటారట.

నాకు కూడా నల్లని పొడవైన జడ,నల్లపూసల గొలుసు చాలా ఇష్టం.♥

ఈ సంజెలో ... కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో ...
ఏ రాజు ఎదలోతు చవిచూసేనో..
ఈ సంజెలో కెంజాయలో


ఎరుపు,పసుపు రంగుల కలయికతో ఏర్పడేదే నారింజ రంగు.
సంజె కెంజాయ రంగుగా,చెంగావి రంగు గా రంగును వర్ణిస్తారు.
యోగులు, మునీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
 • రంగు ఇష్టపడే వారు మాటకారులు
 • వీళ్ళు ఎప్పుడూ చురుకుగా,సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్నికలిగిఉంటారు.
 • నారింజ రంగు ధరించేవారు అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకుంటారు.

చిన్నప్పుడు జింగ్ థింగ్ గోల్డ్ స్పాట్,ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైనవి.


ప్రకృతి లోని అందమైన రంగుల్లాగే మనజీవితం కూడా సకలవర్ణ శోభితం కావాలని కోరుకుంటూ
అందరూ
సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ శుభాకాంక్షలు
Life is Beautiful and Make it Coluorful


Related Posts Plugin for WordPress, Blogger...