చిన్న పిల్లల్ని ,చిల్లర (చిన్న/ వెధవ బుధ్ధులున్న) మనుషుల్ని ఎక్కువగా కదిలించకూడదని మా తమ్ముడు చెప్తుంటాడు. చిన్న పిల్లలకి వాళ్ళేం చేస్తున్నారో తెలియక ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. చిల్లర మనుషులు మేమేం చేస్తే ఏంటి, మమ్మల్ని ఎవరేం చేయగలరు అనే అహంకారంతో చేస్తుంటారు.మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అని పెద్దలు చెప్పినట్లు మర్యాదస్తులకి ఎవరితోనైనా చిన్న మాట పడాల్సి వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది కానీ అదే వెధవలకి ఎన్ని మాటలనిపించుకున్నా దున్నపోతు మీద వడగళ్ళవాన లాగా ఏమీ చలనం ఉండదు.అలాంటి వాళ్ళని ఏదో అనాలనుకోవటం కూడా అనవసరం అనే సందర్భంలో ఈమాట వర్తిస్తుందన్నమాట.
Inspiring Quotes Collection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Inspiring Quotes Collection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7, సెప్టెంబర్ 2016, బుధవారం
చిల్లర బుధ్ధులు / మనుషులు
చిన్న పిల్లల్ని ,చిల్లర (చిన్న/ వెధవ బుధ్ధులున్న) మనుషుల్ని ఎక్కువగా కదిలించకూడదని మా తమ్ముడు చెప్తుంటాడు. చిన్న పిల్లలకి వాళ్ళేం చేస్తున్నారో తెలియక ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. చిల్లర మనుషులు మేమేం చేస్తే ఏంటి, మమ్మల్ని ఎవరేం చేయగలరు అనే అహంకారంతో చేస్తుంటారు.మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అని పెద్దలు చెప్పినట్లు మర్యాదస్తులకి ఎవరితోనైనా చిన్న మాట పడాల్సి వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది కానీ అదే వెధవలకి ఎన్ని మాటలనిపించుకున్నా దున్నపోతు మీద వడగళ్ళవాన లాగా ఏమీ చలనం ఉండదు.అలాంటి వాళ్ళని ఏదో అనాలనుకోవటం కూడా అనవసరం అనే సందర్భంలో ఈమాట వర్తిస్తుందన్నమాట.
లేబుళ్లు:
Inspiring Quotes Collection
3, జులై 2014, గురువారం
Life Is A ClassRoom ..!
జీవితంలో మనిషికి ఎదురయ్యే అనుభవాలకి మించిన గురువు మరొకరు ఉండరు.. లోకంలోని వివిధ రకాల మనుషులు,సంఘటనలు ఎవరికి వారే చెప్పుకోవాల్సిన , నేర్చుకుని, గుర్తుంచుకోవాల్సిన జీవిత పాఠాలు ..
ఈ పాట నాకు నచ్చిన కొటేషన్స్ తో నేను అప్ లోడ్ చేశాను ,,
ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
సినిమా - బడ్జెట్ పద్మనాభం
లిరిక్స్ - చంద్ర బోస్
లేబుళ్లు:
Inspiring Quotes Collection
20, మే 2014, మంగళవారం
హాయ్ "నా చిన్నిప్రపంచం"
"నా చిన్నిప్రపంచం" మిత్రులందరికీ హాయ్ మరియు నమస్తే అందరూ బాగున్నారా ??చాలా రోజులయింది బ్లాగ్ రాసి, రాయకుండా ఉండేంత
గొప్ప కారణాలు ఏమీ లేకపోయినా రాయటానికి అంత గొప్ప విషయాలు ఏమున్నాయిలే అని రాయటం మానేశాను..
దాదాపు సంవత్సరం నుండి బ్లాగ్ రాయలేదు.. నా బ్లాగ్ ఈ నెట్ ప్రపంచం లో ఎక్కడో ఒక మూలన పడిపోయుంటుంది లే అనుకున్నాను కానీ ఏమీ రాయకపోయినా నా బ్లాగ్ రోజూ చూసే వాళ్ళు, అప్పుడప్పుడు కామెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా వుండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ..
కొన్ని కామెంట్స్ అయితే నా బ్లాగ్ ని ఇంతగా ఫాలో అయ్యి,అభిమానించే వాళ్ళు కూడా వున్నారా ??అని నాకే అనుమానం కలిగించేలా కూడా చేశాయి ... :)
నా చిన్నిప్రపంచం ద్వారా నాకు పరిచయం అయిన ఫ్రెండ్స్ ... నేను ఈ సంవత్సరం రోజులుగా కనపడలేదని నా గురించి తెలుసుకోవాలని మెసేజ్ ఇచ్చి,నా క్షేమసమాచారాలు తెలుసుకున్న "మనస్వి జయ" గారు,
నేను ఫేస్ బుక్ లో కనపడగానే ఎప్పుడో విడిపోయిన ఆత్మీయుల్ని
పలకరించినట్లుగా పలకరించిన "సాహితి మాలాకుమార్ " గారు ...
నన్ను ఎప్పడూ ఆత్మీయంగా పలకరించే "వనజవనమాలి" గారు,
"శ్రీ" గారు , ఇంకా చాలా మంది బ్లాగర్స్ నా ఫేస్ బుక్ లో కూడా ఫ్రెండ్స్ ..
ఇంతమంది మంచి స్నేహితుల్ని,నెట్ ప్రపంచం లో నాకంటూ ఒక గుర్తింపుని,స్థానాన్ని ఇచ్చిన "నా చిన్ని ప్రపంచాన్ని" ఇలా వదిలెయ్యటం నాకు నచ్చలేదు .. అందుకే మళ్ళీ వచ్చేశాను "నా చిన్నిప్రపంచం" లోకి...
"నేను కవయిత్రిని కానన్న వాళ్ళని ఏదో చేస్తా " రేంజ్ లో కాకపోయినా ఏదో నాకు నచ్చిన కబుర్లు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం .. :)
మన మాటలు,చేతలు ఎదుటివాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకపోతే చాలు .. మంచి మనస్సుతో సాటి మనుషుల్ని అభిమానించి,ప్రోత్సహించే మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదములు
లేబుళ్లు:
నేను...,
Inspiring Quotes Collection
8, జనవరి 2013, మంగళవారం
స్ఫూర్తి ప్రదాత ... స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పరిచయము చేసి, హిందూ మతప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన ఆధ్యాత్మిక నాయకుడు,ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు.
" మన దేశానికిఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం
కలిగిన యువకులు కావాలి ’’
‘‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దాని కోసమే కృషి చెయ్యాలి"
అంటూ యువతరాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చనిపోయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు.. ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.. తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత..
వివేకానందుని భోధనలేవీ వర్తమానానికి చెందనివి కాదు.ఆయన ఆధునాతన భావాల్ని ప్రజలకు అందించారు.వారి దూరదృష్టికి కేవలం తక్షణ భవిష్యత్తే ముఖ్యం కాదు.చాలా ముందు తరాల వారిపై కూడా దృష్టి సారించి అప్పటి ఘటనలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క మతమే కాక శాస్త్రవిజ్ఞానం, కళ, సారస్వతం, చరిత్ర, రాజకీయాలు, స్త్రీలు ఇలా మానవులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆయన భావనలు సమగ్రమైనవి ..
నిజమైన మతం -
."ఒక వితంతువు కన్నీరు తుడవలేని,అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గానీ,మతం పట్లకానీ నాకు విశ్వాసం లేదు"
భారతదేశంలో వర్గరహితమైన,కులరహితమైన సమాజం వర్ధిల్లాలని అభిలషించారు.స్వామీజీ అభిప్రాయం లో ఆదర్శ సమాజం కుల,వర్గ రహితమైనదే కాక,వేదాంత ప్రతిపాదిత పరమార్ధాన్ని,ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించగలదై ఉండాలి.మూర్ఖుని మానవునిగానూ,మానవుని దైవంగానూ మార్చగలిగిన సాధనమే మతం.ప్రపంచంలోని మతాలన్నీ నిజమైనవే,అనుసరణీయమైనవే.సర్వమత సహనంలో మనకు విశ్వాసం ఉండాలి.ఎవరినీ నిరసించవద్దు.తోటివారికి చేయూతనిస్తే మంచిదే అలా చేతకాకపోతే వారి దారిన వారిని పోనీయటం మానవత్వం అనిపించుకుంటుంది
దేశం - సమస్యలు
పేదరికం,నిరక్షరాస్యత,కులతత్వం, మొదలైనవి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు.. స్వామీజీ కాలంలో కూడా ఇవి ఉన్నాయి.ప్రస్తుతమున్న సమస్యలు తొలగినా కొత్త సమస్యలు తలెత్తవచ్చు.సమస్యలు లేని జీవితాన్ని ఊహించలేము. స్వామీజీ దృష్టిలో సమస్యలకు పరిష్కారం ప్రతిదేశం తమదైన ఆలోచనా సరళిని ఉపయోగించి, తమ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించవలసిందే.. ప్రజల నడత,చిత్త శుద్ధి,సరియైన ప్రయత్నం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.."లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లఖయ సాధన పై చూపిస్తే విజయ రహస్యం తెలిసినట్లే.."
స్త్రీలు - సమస్యలు
భారతదేశం లో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత,త్యాగశీలత, సహనము, ఈ గుణవిశేషాలతో విలసిల్లే స్త్రీమూర్తే మాతృమూర్తి.మన స్త్రీలు ఎక్కువ విద్యావంతులు కాకపొయినా పవిత్రతలో వారికి వారే సాటి.మానవుల్లో స్త్రీలు వేరు,పురుషులు వేరు అనే భావనను పెంచిపోషించరాదు. స్త్రీ పురుష భేధాన్ని మర్చిపోయి,అందరు మానవులు సమానమే అనే భావన రానంతవరకు స్త్రీ జనోద్ధరణకు అవకాశం ఉండదు.
ఏ దేశం కాని.జాతి కానీ స్త్రీలకు తగిన గౌరవం, సమున్నత స్థానం ఈయదో అది ఉన్నతస్థాయిని పొందలేదు.శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూడని కారణంగానే భారతజాతి హీన స్థితికి దిగజారింది."ఎక్కడైతే నారీలోకం గౌరవించబడుతుందో అక్కడే దేవతలు హర్షంతో ప్రజలను దీవిస్తారు".మొత్తం మానవ జాతి ఒక్కటే, అందరూ సర్వసమానతాభావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు కోరుకుంటూ పరస్పర సహకారంతో జీవిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.
మనిషి - ఆత్మవిశ్వాసం
వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.తాను బలహీనుడిని అని భావిస్తే బలహీనుడవుతాడు. బలవంతుడిని అని భావిస్తే బలవంతుడౌతాడు .కార్యసాధనా యత్నంలో సంభవించే ఆటంకాలను,పొరబాట్లను లెక్కచేయకూడదు.ఓటములను లక్ష్యపెట్టకూడదు.తిరోగమనాలను కూడా సహించాలి.అనుకున్నదిసాధించటానికి వేల ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా వెనుకాడకూడదు.
బలహీనతను తొలగించుకోవాలంటేదాన్ని గురించే చింతిస్తూ కూర్చోకూడదు. బలాన్ని సమకూర్చుకునేప్రయత్నం చేయాలి..ఎవరేమన్నా పట్టించుకోకు నీ విశ్వాసాన్ని సడలనీయకు... ఎవరో ఒక వ్యక్తిని నమ్ముకోకుండా నీయందు నీవు పూర్తి విశ్వాసముంచుకో..అన్ని శక్తులు నీలోనే వున్నాయి.అది తెలుసుకుని వాటిని వినియోగించు."వ్యక్తికి బలమే జీవనం బలహీనతే మరణం.నిరాశకు తావివ్వకుండా గమ్యాన్ని చేరు"
మానవసేవ - మాధవసేవ
"ప్రతి వ్యక్తిలోనూ పరబ్రహ్మ శక్తి ప్రజ్వరిల్లుతుంటుంది.పేదప్రజలకు సేవ చేయటం ద్వారా ప్రజలు తనకు సేవ చేయాలని పరమాత్మ ఆకాంక్షిస్తాడు".నరకప్రాయమైన ఈ ప్రపంచం లో ఒక వ్యక్తి హృదయానికి కనీసం ఒక్క రోజైనా శాంతిని,సంతోషాన్ని అందించగలిగితే అదే నిజమైన సేవ అవుతుంది.. తన సహచరులకు మంచి చేసే ఆలోచన లేని సన్యాసి ఒక మూర్ఖుడే కానీ సన్యాసు కాబోడు..
ఆనందం అంటే??
జీవితంలో కొంతమందికి కొన్ని అవసరం కావచ్చు.కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయన్న దానిమీద మన సంతోషం ఆధారపడదు.సంతోషం అనేది ఒక మానసిక స్థితి. "ఆనందం అనేది మనసులో ఉండేదే" కదా!అభివృద్ది అవసరమే! పురోగతి కావలసినదే!కానీ అవి ఎంతవరకు అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయి? ఈ విషయాలను మనం తప్పక మనస్సులో ఉంచుకోవాలి...
1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం
చేసిన ఫొటో
ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు -
“One infinite pure and holy—
beyond thought beyond qualities I bow down to thee”
beyond thought beyond qualities I bow down to thee”
నేను చదివి,సేకరించే పుస్తకాల్లో, కొటేషన్స్ లో వివేకానంద పుస్తకాలు కూడా ఉంటాయి. ఎప్పుడు పుస్తకాలు కొన్నా వివేకానందుడివి కూడా సేకరించటం అలవాటయ్యింది.మంచి మాటలు ఎవరు చెప్పినా విని ఆచరించటం తప్పు కాదు .. ఇతరులకు సందేశాలను ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపొయినా ఇలాంటి మహనీయుల మాటలను అప్పుడప్పుడన్నా గుర్తుచేసుకుంటే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులకి,మూర్ఖులకు తేడా తెలుసుకుని,మనం కనీసం మంచి మనిషిగా ఐనా ఎలా బ్రతకాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
నాకు చాలా ఇష్టమైన వివేకానందుని మాటల్లో ఒకటి..
"వ్యక్తులు ప్రపంచంలోని మొత్తం ధనసంపద కంటే విలువైనవారు"
నాకు చాలా ఇష్టమైన వివేకానందుని మాటల్లో ఒకటి..
"వ్యక్తులు ప్రపంచంలోని మొత్తం ధనసంపద కంటే విలువైనవారు"
వివేకానందుడి 150 వ జయంతి సందర్భంగా ...
లేబుళ్లు:
ఎందరో మహానుభావులు,
Inspiring Quotes Collection
7, అక్టోబర్ 2012, ఆదివారం
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.......!
జీవితమనే మన ప్రయాణంలో ఎన్నో ...
మజిలీలు,గమ్యాలు
సుఖాలు, దుఖాలు
సంతోషాలు,బాధలు
బంధాలు ,బాధ్యతలు....
సుఖం వచ్చినప్పుడు సంతోషించటం,దుఖం కలిగితే బాధపడటం మనిషికి సహజం..
జీవితమనే ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా మనసున మనసై బ్రతుకున బ్రతుకై మన కష్ట,సుఖాల్లో పాలు పంచుకునే మనిషి వున్నవాళ్ళు అదృష్టవంతులు...ఎప్పుడైనా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కష్టాలు,బాధలు వచ్చే మనిషి దురదృష్టవంతుడు కాదు..ఆ కష్టాల్లో నీకు నేనున్నాను,నీ కష్టం నాది అని కనీసం ఓదార్చే తోడులేని మనిషే నిజమైన దురదృష్టవంతుడు అని..
జీవితంలో కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి..మరికొన్ని మనం ఎంచుకునే స్నేహితుల ద్వారా,జీవిత భాగస్వాముల ద్వారా ఏర్పడతాయి, ఎలా ఏర్పడిన బంధమైనా, ఏ సంబంధమైనా ...
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము.. అదే స్వర్గము
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము.. అదే స్వర్గము
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము ... అదే స్వర్గము..
లేబుళ్లు:
Inspiring Quotes Collection













































