పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, డిసెంబర్ 2011, మంగళవారం

ఏకులమైనా ...ఏ మతమైనా భరతమాతకొకటే లేరా !

ఈ రోజు "raafsun" గారి బ్లాగ్ లో
"వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు...."
అన్న పోస్ట్ చూసిన తర్వాత ,కొంత మంది అలా వున్నా మనమందరం భారతీయులం,
భారతీయులంతా ఒక్కటే అనుకునే వాళ్ళు కూడా వుంటారు అని నేను నమ్ముతాను. అందుకే ఈ పోస్ట్..

దేశం
మనదే ...తేజం మనదే



దేశం మనదే ...తేజం మనదే
దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతి మనదే ... జాతిమనదే
ప్రజల అండదండా మనదే

అందాల బంధం వుంది ఈనేలలో
ఆత్మీయరాగం వుంది ఈగాలిలో .
ఏకులమైన ... ఏమతమైనా
ఏకులమైన ... ఏమతమైనా భరతమాత కొకటేలేరా ...

ఎన్నిబేధాలున్నా ... మాకెన్నితేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా
వందేమాతరం అందాం అందరం
వందేమాతరం అందాం అందరం

దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతిమనదే ...జాతిమనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం వుంది ఈనేలలో
ఆత్మీయరాగం వుంది ఈగాలిలో ..

ఏకులమైనా ...ఏమతమైనా
భరతమాత కొకటేలేరా
రాజులు ఐనా పేదలుఐనా
భరతమాత సుతులేలేరా...

ఎన్నిదేశాలున్నా... మాకెన్నిదోషాలున్నా
దేశమంటే ప్ర్రాణమిస్తాం అంతాఈవేళా
వందేమాతరం అందాంఅందరం


శతవసంతాల మన "జనగణమన"...!

జాతీయ గీతం జనగణమనకు ఈ రోజుతో వందేళ్ళు పూర్తి అయ్యాయి.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జనగణమన' మొట్టమొదటి సారిగా 1911 లో డిసెంబర్ 27 న
కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950,జనవరి 24 న ఈ గీతానికి జాతీయగీతం హోదాదక్కింది.
'జనగణమన' భారతీయ స్ఫూర్తిని,భారతీయుల భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గేయం.
భరతమాత కీర్తి ప్రతిష్టతలను చాటుతూ...భారత దేశ భౌగోళిక స్వరూపాన్నిదాని అంతస్సారంతో వర్ణించే అక్షర చిత్రమిది.

'ప్రజలందరి మనస్సుకు అధినేతవు,భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక,
పంజాబ్,సింధు,గుజరాత్,మహారాష్ట్ర,ద్రావిడ,ఉత్కళ,వంగ దేశాలతోనూ,
వింధ్య,హిమాలయ పర్వతాలతోనూ,యమునా,గంగ ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను
శోభించే ఓ భాగ్య విధాత,వాటికి నీ శుభనామం ఉద్భోధనిస్తుంది.
అవి నీ ఆశీస్సులు ఆకాంక్షిస్తాయి.నీ జయ గాధల్ని గానం చేస్తాయి.
సకల జనులకు మంగళ కారకమైన,భారత భాగ్య విధాతవు అయిన నీకు
జయమగు గాక! జయమగు గాక! జయమగు గాక!'

మొత్తం 31 చరణాలతో రవీంద్రుడు జనగణమన రాయగా అందులో ఏడు చరణాలను మనం జాతీయ గీతంగా ఆలపిస్తున్నాం.జాతీయ గీతం రచించిన భాష సంస్కృత మిళిత బెంగాలీ అయినా,
భారతీయులంతా దీన్ని తమమాతృ గీతం గా అనుభూతి చెంది పాడుకునేలా మన జాతీయ గీతం రూపు దిద్దుకుంది.


Janaganamana
(full song of National Anthem of India)





ఎక్కడ  విన్నా వినపడకపోయినా ఉదయాన్నే స్కూల్ అసెంబ్లీ లో ..సాయంత్రం స్కూల్స్ వదిలే టైం లో
విద్యార్ధుల గొంతులో స్వరమై చేరి,భారతీయుడి జీవితంపై చెరగని ముద్ర వేసిన ఈ శుభ గానం
వందేళ్ళైనా,ఇంక ఎన్నేళ్ళైనా... ప్రతి క్షణం భారత దేశ సమున్నతిని చాటుతూనే వుంటుంది.


Related Posts Plugin for WordPress, Blogger...