పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
నాకు నచ్చిన కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు నచ్చిన కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మన జీవితం...!


రోజులు,గంటలు,నిమిషాలు,క్షణాలంటూ
కాలం కొలతల్లో బంధించిన మన జీవితం
ఆగకుండా కదిలే కాలచక్రంతో పోటీ పెట్టుకున్న
ఉరుకులు పరుగుల పరుగుపందెం...

పరుగుపందెంలో అలసి,ఆగిపోతున్న
అనుభూతులు, అనుబంధాలు,ఆప్యాయతలు
ఎంతగా అలసిపోయినా సేదతీరేందుకు సమయం లేదు!

ప్రతి మనిషికి ముందు చూపే
తన చుట్టుపక్కల ప్రపంచం ఏమైపోతుందో
తెలుసుకోవాల్సిన అవసరం, అవకాశం లేదు!

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలకు
సమాధానాలు వెతకటమే తప్ప
ఈ ప్రయాణం సరైనదేనా అని సమీక్షంచుకునే
సందర్భం కూడా రాదు!

జీవితపు బరిలో బంధువులు,స్నేహితులే మన ప్రత్యర్ధులు
అందరూ అయినవారే ... అయినా ఎవరికి వారే పోటీ
ఒకరికంటే నేను బాగుండాలనే ఈ తాపత్రయంలో
గెలుపు,ఓటములు ... లాభ నష్టాల కూడికలు తీసివేతలే ఈ జీవితం!

ఉన్నది లేదనుకుని ... లేనిది కావాలనుకుని
ఏదో సాధించాలనుకుని ... ఎక్కడికో చేరాలనుకునే
ఈ ఆశలు,ఆశయాల పరుగు
ఎక్కడికో ?? ఎందాకనో ???




20, మే 2012, ఆదివారం

నా ప్రియనేస్తం...


మానవ సంబంధాలు స్వార్ధపూరితమే అయినా కొన్ని బంధాలు జీవితాంతం తోడూ,నీడగా జీవితాన్ని నందనవనం చేస్తాయి జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం.మనసును బాధించే కష్టమైనా, ఆహ్లాదపరిచే సంతోషమైనా పంచుకునే ఆత్మీయ నేస్తం ఒకరు తమకంటూ ఉండాలని ప్రతి మనిషీ కోరుకుంటారు ...అలాంటి ఆత్మీయనేస్తమే 
ఈ "నా ప్రియనేస్తం"
 నా ప్రియ నేస్తం....
ప్రపంచం అంతా దూరం అయినా...,
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే  
నిజమైన స్నేహం...
 
ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను” 
ఒకరికొకరం...,
మన స్నేహమే మన ప్రపంచం

“నువ్వు” అనే ఈ రెండక్షరాలే 
నా చేయి పట్టి నడిపిస్తుంటే
"
నువ్వు" అనే ఈ రెండక్షరాలే 
నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే
 
" నువ్వు"అనే ఈ రెండక్షరాలే 
నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే

ఇంతకు ముందెపుడూ నేనెరుగని 

మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....

నా ప్రతి అడుగులో 

నువ్వు తోడు వున్నావనే భావన 
ఎంతో ఊరటనిస్తుంటే 

సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని 
నాకు చవిచూపిస్తుంటే

నిన్నటిదాకా కదలనని మొరాయించిన కాలం 
నీ ఆగమనంతో వేగంగా
యుగాలు కూడా క్షణాల్లా కరిగి పోతుంటే ...
 

నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా 
నా గుండెల్లో దాచుకొని....,

ఏవేవో అంతులేని ఆలోచనలతో 

సతమతమవుతున్న నా మనసుకి చెప్తున్నా... 
ఇదిగో "నీ ప్రియ నేస్తం" అని


నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో




సినిమా - అంతం
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - సిరివెన్నెల
సింగర్ - S.P.బాలు


10, మే 2012, గురువారం

మా పావురాల ప్రేమ ఊసులు ...


మా ఇంటి దగ్గర పావురాలు మాకు అతిధులు..మేము పిలవకపోయినా వచ్చి ఇంటి చుట్టూ సందడి చేస్తుంటాయి.ఈ ఎండకి మా బాల్కనీ,స్లాబ్ గట్లు ,విండో లు వాటికి స్థావరాలు.. ఆ పావురాల్ని చూడటం, ఫోటోలు తీసుకోవటం నాకు సరదా ఐతే... ఇల్లు చుట్టు పక్కలంతా శుభ్రం చేయటానికి మా భారతమ్మకు మహా కష్టం..
ఏంటమ్మా వాటిని కొట్టనివ్వవు ఇల్లంతా పాడు చేస్తుంటే అని తెగ బాధ పడిపోతుంది..

ఒక పావురం ముందుగానే వచ్చి మరో పావురం కోసం ఎదురు చూస్తూ కూర్చుని, తను ఎదురుచూస్తున్న పావురం రాగానే ముచ్చట్లు,ఆలస్యంగా వచ్చిందని అలకలు..
ఎప్పుడూ ప్రేమికులకు ప్రేమ సందేశాల్ని అందించే పావురాలు తమ మనసులోని ప్రేమ గురించి చెప్పుకుంటున్న ఊసులు ... ఈ ఫొటోలతో పాటూ నాకు"నచ్చిన" ... "వచ్చిన కాదు" :) కవిత కూడా ...

మా పావురం ఎదురుచూపులు - కవిత్వాలు


ఎన్నాళ్ళు ప్రియా ఈ నా ఎదురుచూపులు
మనసూ మనసుకు మధ్య మరచిపోలేని మమతానురాగాలు
మరువగలవా ప్రియా ?? మరపురాని సంఘటనలు
ఎందుకు ప్రియా ఆకాశానివై అందనంటావు??


ఎండమావివై దొరకనంటావు ...
పాద రసమై పట్టుబడనంటావు...
కలువపువ్వువై నన్ను కవ్వించరావా ...
మల్లె తీగవై నన్ను అల్లుకోవా?


కంటిలో కనుపాపలా నాలో కలిసిపోవా
చీకటిలో చిరు వెలుగువై రావా..
చినుకులా నా మీద పడి నా కౌగిలిలో కరిగిపోవా
కల అనుకున్న నా జీవితాన్ని నిజం చేయలేవా !!!


11, జనవరి 2012, బుధవారం

ఓ కాలమా నీ పనే బాగుంది సుమా...!


కాలమా నీ పనే బాగుంది సుమా...!
కాలమా ఎంత అల్ప సంతోషివి నీవు?
నీ "రోజుల" చక్రానికి ఆయువు
ఇరవైనాలుగు గంటలు చాలనుకుంటావు
ధ్యానములోని తాపసిలా
ఎంత ప్రశాంతంగా ఉంటావు..!

కాలమా నీదెంత అదృష్టం..
గడచిన దాన్ని గురించి బాధపడక,
జరగబోయే దానికి చింతించక,
ఎవరి కోసం వేచి చూడక,
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం
మాత్రమే నిజం అంటావు,
ఏ బంధాలకి
బందీ కానంటావు.

వెనుకకి తిరిగి చూడటం తెలియని
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది.
ఒకరి చింత నీకు లేదు
ఎవరి నుంచి భయము లేదు.
ఎవరికీ
ఏమి దాచవు
ఎవరి నుండి
ఏమీ ఆశించవు.
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా!



6, జనవరి 2012, శుక్రవారం

కలల కౌగిలి - The Value Of Time


దోసిళ్లలో ఇసుక రేణువుల్లా జారిపోతున్నావే
ఎంతగా పిడికిలి బిగించినా
ఎంతగా బంధిద్దామని ప్రయత్నించినా
అంత త్వరత్వరగా పారిపోతున్నావే!

కలలకౌగిలి కరిగిపోక ముందే
మదిలో తలపులు తరలిపోకముందే
ఆలోచనలు అంతమవ్వకముందే
వెడలిపోతున్నావు…నీకెందుకంత తొందర?

జీవితం ఆస్వాదిద్దామన్నా
ప్రేయసి(ప్రియుడు) ప్రేమలో తరిద్దామన్నా
స్వప్నాల లోకంలో విహరిద్దామన్నా
దేనికీ సహకరించవే?

నిమ్మళంగా పనులు చక్కపెడదామన్నా
ప్రశాంతంగా కాసేపు కూర్చుందామ
న్నా
బద్దకంగా మరికాసేపు ఒద్దిగిల్లుదామన్నా
తీరికగా కబుర్లు చెప్పుకుందామన్నా
దేనికీ కాసేపు ఆగవే?

గాయం చేసేది నువ్వే ... మానిపేదీ నువ్వే
గుర్తు తెచ్చేదే నువ్వే ... మరిపించేదీ నువ్వే
బాధ పెట్టేదీ నువ్వే ... సంతోషాన్నీ మోసుకొచ్చేదీ నువ్వే
ఇంత శక్తి నీకెవరిచ్చారు?

ఎదురుచుపులో నత్తనడక నీదే
హడావుడిలో గుర్రపు స్వారీ నీదే
మాతోనే ఉన్నట్లు భ్రమ కలిగిస్తావు
సహకరించినట్లే వుంటావు
అందీ అందనట్లు పరుగులు తీస్తావు

నీ పరుగులో...మా అడుగులు జతపరచకపోతే
మిగిలేది శూన్యమే!


From: FaceBook TeluguQuotes

30, డిసెంబర్ 2011, శుక్రవారం

నా కవిత...!


ఓ చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ

కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ

మెదడుకు మేతను తినిపిస్తూ...


హృదయాన్ని తికమక పెట్టేస్తూ

మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ

మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ

నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ...


నాలుగక్షరాలని అటువిటు రాస్తూ

మురిసిపోయాను పైన, క్రింద చదివేస్తూ

నా పిచ్చిరాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ

సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ...


Telugu Quotes community

21, డిసెంబర్ 2011, బుధవారం

శ్రీమతికి శ్రీవారి ప్రేమలేఖ....!


చిత్రకారుల కుంచెకు చిక్కని అందమో..
కవుల
ఊహకు అందని భావమో..
తేనే
ఊటవో...మల్లెల తోటవో..
వెన్నెల
వాగులో వొంటరి నక్షత్రానివో..

కొలంబస్ కళ్ళు చూడని సౌందర్య ద్వీపమా
ఖండాలు
దాటిన కోహినూర్ వజ్రమా..
నీ
నవ్వులో నైలునది వొంపులు తిరుగుతుంది
కళ్ళతీరాలు
దాటి చూడలేని నన్ను
కలల
సునామీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు

కళ్ళు చేసుకున్న పుణ్యమో..
కలలు
రాసుకున్న కావ్యమో..
అందం
నీ దగ్గర పాఠాలు వల్లెవేస్తుంది
చూపు
నీ దగ్గర కొత్త సోయగాల్ని అద్దుకుంటుంది

అందాల
తాజ్ మహల్ ముందు మహరాణిలా కూర్చుని..
నువ్వు
చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు
ఎవరందంగా
వున్నారంటే ఏమి చెప్పగలను..?
బహుశా
షాజహాన్ కూడా కొంచెం సందేహిస్తాడేమో..

నాలో చెలరేగే భావాల్ని వ్యక్తీకరించడానికి నా భాష చాలటం లేదు..
నిన్ను
వర్ణించడానికి శ్రీనాధుడు,కీట్స్ కలిసి రావాలేమో..
మళ్ళీ
డావెన్సీ కుంచె పట్టాల్సిందే.. తప్పదు..
మైకెలేంజిలో
మూడ్ తెచ్చుకోవాల్సిందే..

వేకువ
వనాలలో వాసంత సమీరమా..
ప్రకృతిని చూసి నీ మనసు రాగమైనప్పుడు..
చినుకులతో
కలిసి నీ పాదాలు తాళం వేసినప్పుడు..
అమాయకత్వం
లో అతిశయం లో చిలిపితనపు అల్లరి వేళల్లో
నీ
రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని నేనెలా మరచిపోగలను?

నా
హృదయపు మైదానాల్లో
నేను
నిశ్శబ్ధంగా తోటమాలిలా పని చేసుకుంటున్నప్పుడు
దారిలో
రోజూ పలకరించే ఎర్రగులాబీ నువ్వు..
నాలోని
అలసిన బాటసారికి ఆఖరి మజిలీ నీ నవ్వు..

తలపుల
తుఫాన్ లో తడిసిపోయి..
కాసింత
వెచ్చదనం కోసం నీ ఊహల వాకిలిలో నిలుచున్నా..
నీ
ఊహల వెచ్చటి దుప్పటి కప్పుకున్నా..

Your's sweetheart




31, అక్టోబర్ 2011, సోమవారం

ఈ ప్రేమలేంటో ఈ ప్రేమించడం ఏంటో....


ప్రేమ...
తల్లి కొకటి.....తండ్రికొకటి
చెల్లి
కొకటి.....అక్కకొకటి
తమ్ముడి
కొకటి.....అన్నకొకటి
మిత్రుని
కొకటి.....ప్రేయసికొకటి
పేదవాని
కొకటి....డబ్బున్న వాడికొకటి

ఎన్ని ప్రేమలు.. ఎన్నెన్ని రకాల ప్రేమలు
ఎక్కడెక్కడి
ప్రేమలు
క్షణానికి
వంద సార్లైనా వీటన్నిటితో అవధానం చేస్తుండాలేమో...

అసలెవరు కనిపెట్టారీ ప్రేమల్ని
అనుక్షణమూ
బంధించే గొలుసుల్ని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ప్రతి
క్షణమూ గుండె ని గుచ్చేసే ముళ్ళని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ఎవరు
కొనిపెట్టారీ ప్రేమల్ని

ఈ ప్రేమలేంటో ఈ ప్రేమించడం ఏంటో
చక్కగా
ఏ రాళ్ళమధ్యలోనో గడిపేసి
ఆ
రాళ్ళ లాగానే ఏ స్పందనా లేకుండా ఉండగలిగితే???
ఇది సాధ్యమేనా???

ఇది నేను రాసింది కాదు..నెట్ లో దొరికింది నాకు నచ్చింది..
నిజమే
కదా అనిపించింది...
రచయిత
కు ధన్యవాదములు..


2, మే 2011, సోమవారం

అపురూపం


చల్లగాలీ,సాయం సంధ్యలూ,
సూర్య చంద్రులూ ,వెన్నెలమ్మలూ ,
సముద్ర తీరాలూ,సంగమ కెరటాలూ....
అనుభూతి చెందే హృదయం ఉండాలి కానీ
ఈ సృష్టిలో అద్భుత అందాలన్నీ
ఆస్వాదనకి అనన్యమే,అపురూపమే....

Related Posts Plugin for WordPress, Blogger...