పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
శ్రీశైలం విశేషాలు 12-11-11 - 13-11-11 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీశైలం విశేషాలు 12-11-11 - 13-11-11 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, నవంబర్ 2011, బుధవారం

చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం - శ్రీశైలం

శ్రీశైలం లో ఎంటర్ అవ్వగానే ముందుగా కనిపించే పెద్ద శివలింగం ఆకారంలో వుండే
చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఒక వింత ప్రపంచం అనిపిస్తుంది..
గోండ్లు ,సవర,కోయ,చెంచు ఇలా వివిధ ఆటవిక జాతులకి చెందిన అప్పటి ప్రజల జీవిత విశేషాలను,
వారి జీవనాధారాలు,వాళ్ళు నిత్య జీవితంలో ఉపయోగించే పనిముట్లు,వినోద సాధనాలను
అన్నిటినీ కళ్ళకు కట్టినట్లు...చూడగానే నిజమైన మనుషులేమో అనిపించేలా వుండే
ఆటవికుల బొమ్మలు ఇక్కడి ప్రత్యేకత..

ఇక్కడ గిరిజన్ ప్రొడక్ట్స్ కూడా వుంటాయి..ముఖ్యంగా రీతు సోప్స్ చాలా బాగుంటాయి.
ఈ సోప్స్ ఇక్కడే కాకపోయినా బయట మార్కెట్లో అయినా దొరుకుతాయి..కానీ ఎలాగూ వచ్చాము
కదా అని ఇక్కడే తీసుకున్నాము.
ఇక్కడ ఫొటోస్ తీయకూడదు...కానీ తీశాము.
ఇక్కడ వుండే సెక్యూరిటీ అమ్మాయి చాలా సీరియస్ గా ఏవో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుంది.
నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది.
అలా చదువులో నిమగ్నమైపోయిన ఆ అమ్మాయి మా వెనక రాకపోవటంతో
మాకు ఫొటోస్ తీయటం కుదిరిందన్నమాట.
అక్కడి బొమ్మలన్నీ నాకు చాలా నచ్చాయి.ముఖ్యంగా బంజారా మహిళలు నృత్యం చేస్తున్న
బొమ్మలు అచ్చం మనుషులే నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది..

15, నవంబర్ 2011, మంగళవారం

ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం - శ్రీశైలం

1677 సంవత్సరంలో శ్రీశైలంలో ఇప్పటి శివాజీ ద్యానమందిరం ఉన్న ప్రదేశంలో
హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ చే నిర్మాణము చేయబడిన ధ్యాన మందిరం వుండేది.
ఇక్కడ నివసిస్తూ తపస్సు చేసి అమ్మవారిని ధ్యానించగా విదేశీ ముస్లింల దురాక్రమణను ఎదుర్కొని హిందువులను,హిందువుల ఆలయాలను,గ్రంధాలను,హిందూ ఆచారాలను రక్షించమని ఆదేశిస్తూ
శ్రీ భ్రమరాంబికా అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ మహారాజ్ ని ఆశీర్వదించి దివ్య ఖడ్గాన్ని బహుకరించినది.
శివాజీ మహారాజ్ ప్రార్ధన చేసిన ధ్యాన మందిరం శిధిలమై పోయినందున అదే స్థలములో
శివాజీ
స్ఫూర్తి కేంద్రం పేరుతో 1983 సంవత్సరములో భూమి పూజ జరిగి 1994 లో
ఈ
నూతన భవనం ప్రారంభమైనది..
15,000 చదరపు అడుగుల నిర్మాణం,27 అడుగుల ఎత్తు, 10,000 చదరపు అడుగుల్లో
54 స్తంభాలు గల దర్బార్ హాల్,
12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం ఇక్కడ ప్రత్యేకత..
శివాజీ స్ఫూర్తి కేంద్రం

12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం
శివాజీ జీవిత చరిత్రను తెలియచేసే చిత్ర ప్రదర్శనలోని కొన్ని చిత్రాలు:
సంతానార్ధియైన జిజియాబాయి
శివాజీ మహారాజ్ జననం
కస్పాగణపతి మందిరంలో శివాజీకి విద్యాభ్యాసము
తల్లి దీవెనలతో,నీతి బోధలతో ఎదిగిన ఛత్రపతి..
భవిష్యత్తులో ఛత్రపతిగా వికసించటానికి బాల్యంలోనే శిక్షణ
ఛత్రపతి స్వరాజ్య స్థాపన
శివాజీ మహారాజ్ కి భవానీమాత ఖడ్గం ప్రసాదించుట
శివాజీ ఖడ్గం - వాస్తవం
శివాజీ స్ఫూర్తికేంద్రం ప్రధానద్వారం

14, నవంబర్ 2011, సోమవారం

శ్రీశైలం వ్యూ పాయింట్ - కొన్ని మంచిమాటలు..

శ్రీశైలంకి 7 k.m దూరంలో శ్రీశైలం వ్యూ పాయింట్ దగ్గర వున్న కృష్ణనంది ప్రాంగణం చాలా బాగుంది.
ఇందులో తలయెత్తి మనవైపే చూస్తున్నట్లుగా వున్న నవనందులలో ఒకటైన కృష్ణ నందితో పాటు
వరసిద్ధి
వినాయకుడు, కార్తికేయుడి విగ్రహాలు ఎంతో అద్భుతంగా వున్నాయి.
ఈ ప్రాంగణం చుట్టూ స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ రాసి వున్నాయి.
ఈ వ్యూపాయింట్ లో నందితో పాటు ఈ కొటేషన్స్ కూడా నాకు నచ్చాయి..
వాటిలో నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు..







శ్రీశైలం శివమయం...శ్రీశైలం విశేషాలు..

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళటం మా చిన్నప్పటినుండి మాకున్న అలవాటు..
అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న శని, ఆదివారాల్లో శ్రీశైలం వెళ్లి వచ్చాము.
కార్తీక మాసం దానికి తోడు వీకెండ్ కావటంతో శ్రీశైలం భక్తులతో నిండి పోయింది.
శనివారం ఉదయాన్నే మొదలైన మా శ్రీశైలం ట్రిప్ చాలా హాయిగా,సంతోషంగా జరిగింది.
మా వూరి నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎక్కువగా వూర్లు వుండవు.
అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూర్లు,మధ్యలో అంతా కొండ మార్గంలో,పచ్చని పొలాల మధ్య
ముఖ్యంగా ఈ సారి ఎక్కువగా అరటి తోటలు వున్నాయి.
వీటన్నిటిని
చూసుకుంటూ సరదాగా సాగింది మా ప్రయాణం..
ముందుగా సాక్షి గణపతిని దర్శించుకుని రూమ్ కి వెళ్లి,కాసేపు రెస్ట్ తీసుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళాము.
శివాజీ
12 అడుగుల కాంస్య విగ్రహంసజీవమూర్తిలాగా చాలా బాగుంది.
ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే ఫోటోల ప్రదర్శనతో వున్న ధ్యాన మందిరం ప్రశాంతంగా వుంది.

ఆదివారం ఉదయాన్నే స్వామి,అమ్మవార్ల దర్శనం పూజలు అన్నీ
జనం
కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రశాంతంగానే జరిగాయి.
ఇక ఈ సారి శ్రీశైలంలో చెప్పుకోవాల్సిన విషయం సర్వాలంకార భూషితుడైన స్వామివారి దర్శనం...
ఎప్పుడూ అభిషేకజలాలతో,పంచామృతాలతో తడిసి ముద్దవుతూ వుండే మల్లిఖార్జునుడు
ఈ సారి ఎంతో కన్నుల పండుగగా పూర్తి అలంకారంలో దర్శనం ఇచ్చాడు.
బంధించే క్యూ లైన్లు మామూలే.మా చిన్నప్పటి శ్రీశైలంతో పోల్చుకుంటే ఇప్పటి శ్రీశైలం నాకెందుకో
బంధించినట్లుగా అనిపిస్తుంది..కానీ కాలం తో పాటు మార్పులు సహజం కదా..
దర్శనం అవ్వగానే బయటికి వచ్చి అందరం కార్తీక దీపాలు వెలిగించుకుని బయటికి వచ్చి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కి వెళ్లి,అక్కడ ఎవరూ చూడకుండా కొన్ని ఫోటోలు తీసుకుని ఇంటికి బయలుదేరాము.
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అందరినీ
తమ చల్లని చూపులతో కాపాడాలని ప్రార్ధిస్తూ కొన్ని శ్రీశైలం విశేషాలు..

శ్రీ మల్లిఖార్జునస్వామి.
ఆలయంలోపలి స్వామివారి గోపురం
శ్రీశైలం ప్రయాణంలో కొన్ని విశేషాలు:
చెక్ పోస్ట్ దగ్గర కార్ దగ్గరికి వచ్చి అమ్మే చిరుతిండ్లు
అడవి మొదలవ్వగానే వెదురు చెట్ల మధ్యలో నుండి గుంపులుగా వచ్చే కోతులు మనం ఇచ్చే అరటిపళ్ళు,
కొబ్బరి చిప్పలు ఒక దాని మీద ఒకటి పోటీ పడుతూ తీసుకుని మెల్లగా వెనక్కి వెళ్లి పోతాయి.
మేము ఇచ్చిన అరటి పళ్ళు తిని ఫోటోలకు
ఫోజ్ ఇచ్చిన వానరులు
శ్రీశైలం కి 7 K.M దూరంలో వ్యూ పాయింట్
దగ్గర వున్న కృష్ణనంది..
శివాజీ స్ఫూర్తి కేంద్రం లోని శివాజీ కాంస్య విగ్రహం
మేము వున్న రూం బాల్కనీ నుండి కనిపిస్తున్న
అందమైన దృశ్యం
ఆటవికుల జీవన విధానాలని తెలియచేసే
చెంచులక్ష్మిట్రైబల్ మ్యూజియం
వీరభద్ర స్వామి
పార్వతీ పరమేశ్వరులు
దక్షిణామూర్తి
శ్రీశైలం వెళ్లి వచ్చే ప్రతి కార్ కి వేయించే ఆర్ట్

Related Posts Plugin for WordPress, Blogger...