పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, మార్చి 2012, బుధవారం

♥ Colours Of Life ♥


మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన


ఎరుపు రంగు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రంగు..
పెళ్ళిలో పెళ్లి కూతురికి పండే ఎర్రని గోరింటాకు తో మొదలై పెళ్లి పట్టు చీర,గాజులు,
పాపిటలో ఎర్రని కుంకుమతో పెళ్లి కూతురు వివాహిత స్త్రీగా మారే దాకా ఎరుపుదే ప్రాధాన్యత.
 • ఎరుపు రంగు వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక,ఇది ఉత్తేజకరమైన రంగు.
 • ఎరుపురంగు ఇష్టపడే వ్యక్తి సాహసోపేతమైన వ్యక్తిత్వం కలిగి వుంటారు.
 • ఇతరులను అధిగమించాలని చూస్తుంటారు.
 • అలాగే ప్రమాద సూచికగా కూడా ఎరుపునే సూచిస్తారు.
చిన్నప్పుడు నా ఎర్రటి హీరో హన్సా సైకిల్ నాకు చాలా ఇష్టం.

పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు.


ఆకుపచ్చ రంగు ప్రకృతికి ప్రతీక.పచ్చని ప్రకృతి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
శుభ సందర్భాల్లో ఆకుపచ్చకు ప్రాధాన్యత ఉంది.శుభకార్యాలు,పండుగలు
పచ్చని మామిడాకు తోరణాలతోనే మొదలవుతాయి.
 • ఆకుపచ్చ రంగు ఇష్టపడే వాళ్ళు తోటివారికి సాయపడేందుకు ప్రయత్నిస్తారు.
 • ఎవరైనా బాధల్లో వున్నట్లు కనిపిస్తే, వారిని ఓదార్చేందుకు చూస్తారు.
 • సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు,కొన్ని సార్లు నిర్దయగా కూడా ఉంటారు.
 • ఆకుపచ్చ రంగు హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు..ఈ రంగు కళ్ళకు మంచిది.
 • ఇది నూతనోత్సాహాన్ని, శాంతిని ఇచ్చే రంగు
నాకు పచ్చటి గార్డెన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతానికి పెద్ద గార్డెన్ లేకపోయినా ..
మా ఇంట్లో పూలకుండీల మధ్యలో కాసేపు కూర్చోవటం,మొక్కలకి నీళ్ళు పోస్తూ
వాటిని పలకరించం
నాకు చాలా ఇష్టం..

ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరేనే కన్నె గగనం

ఊదా రంగు చాలా అరుదైన రంగు,రాయల్ కలర్ కూడా ..దీన్ని వంగపువ్వు రంగు అంటారు.
U.S మిలటరీ లో ధైర్య సాహసాలకు గుర్తింపుగా "పర్పుల్ హార్ట్" అవార్డ్ ఇస్తారు.
రంగు సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక.
 • పర్పుల్ కలర్ ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలనుకుంటుంటారు.
 • నమ్మిన వారికోసం ఏదైనా చేయగల ఔన్నత్యం రంగు ఇష్టపడే వారి సొంతం.
 • లేనిపోని లౌక్యాలను ప్రదర్శించరు,వినయంగా అమాయకంగా ఉంటారు.
 • ఈ రంగును వాడితే డిప్రెషన్‌, అభ్రదతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలను అణచిపెట్టుకోవడం జరుగుతాయి.
పర్పుల్ కలర్ నాకు చాలా ఇష్టమైన రంగు.నా చీరలు,డ్రెస్ లు చాలా వరకు షేడ్స్ లోనే
వుంటాయి.పర్పుల్ గులాబీలు నాకు చాలా ఇష్టమైన పూలు.

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే


అనంతమైన ఆకాశం,అంతులేని సముద్రం,అందరూ ఇష్టపడే కన్నయ్య రంగునీలం.
ప్రశాంతమైన రంగు.
రంగును ఎక్కువగా ఉపయోగించటం వలన స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ,
సుఖనిద్ర, సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు.
 • స్వచ్చత,శాంతం,అనర్గళంగా మాట్లాడటం,ఆత్మవిశ్వాసం,
 • మనసులో ఒకటి పైకి ఒకటి లాగా ఉండని మనస్తత్వం ఈ రంగును ఇష్టపడే వాళ్ళ ప్రత్యేకతలు.

♥ నాకు ఇష్టమైన సముద్రం,ఆకాశం,కృష్ణయ్య అన్నీ నీలమే..ఆక్వా బ్లూ నాకు చాలా ఇష్టం.

గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలి లే
ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా

పింక్ కలర్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే రంగు.
పింక్ రిబ్బన్ బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనకు,దానికి వ్యతిరకంగా పోరాడే హోప్ ను
కలిగించే సింబల్ గా ఉపయోగిస్తున్నారు.
జైపూర్ లో పింక్ రంగులో ఉండే కట్టడాలతో పింక్ సిటీ ప్రసిద్ధి చెందింది.
 • పింక్ కలర్ఇష్టపడేవారుఅందంగా,చిలిపిగాఉంటారట.
 • పింక్ కలర్ సంతోషాన్ని,ఉత్సాహాన్నీ కలిగిస్తుంది.
పింక్ కలర్ గులాబీలు,టెడ్డీలు ,కాటన్ చీరలు నాకు ఇష్టం.

తియ్యతియ్యని కలలను
కనటమే
తెలుసు కమ్మని ప్రేమలో


బ్రౌన్ కలర్ నిస్తేజానికీ ప్రతీక. భూమి రంగును సూచిస్తుంది.
రంగును ఇష్టపడే వారు నిరాడంబరంగా ఉంటారు,డాంబికాలకు పోరు
చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.

నాకే కాదు అందరికీ చాలా ఇష్టమైన chocolates బ్రౌన్ కలరే ! మరీ ఎక్కువ
chocolates తినటం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా అప్పుడప్పుడు తినటం అవసరం :)
chocolates, ఇంకా కాఫీ కూడా నా ఫేవరేట్.

కాంచనాల జిలుగు పచ్చా
కొండబంతి గోరంత పచ్చ

పసుపు
రంగు శుభకరమైన రంగుల్లో ఒకటి.గడపకి పసుపు రాయటం శుభకార్యాలకి,
పండగలకి
ఆహ్వానం పలకటానికి .పసుపు రాసిన గడపలు లక్ష్మీ కళతో వుంటాయి.
శాస్త్రీయంగా
కూడా పసుపు వాడకం మంచిది.పసుపురంగులో గొప్ప కళ ఉంది.
 • పసుపు రంగు గులాబీలు స్నేహానికి గుర్తు..
 • పసుపు రంగు ఇష్టపడే వారు హుషారుగా ఉత్సాహంగా ఉంటారు.
 • ఆత్మస్థైర్యంతో ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. లాజికల్ గా మాట్లాడతారు.

పసుపు రంగు చామంతులు,పసుపుగా పండిన మామిడిపళ్ళు ,పచ్చని బంగారం నాకు చాలా ఇష్టం.

తెల్లని తెలుపే ఎద తెలిపే
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెలుపు స్వచ్చతకు,నిర్మలత్వానికి ప్రతీక.ఎండాకాలంలో తెల్లటి కాటన్ డ్రెస్ లే ఎక్కువగా వాడతారు.
కళ్ళకు హాయిగా ప్రశాంతంగా అనిపించే రంగు.

 • తెలుపు రంగు ఇష్టపడేవాళ్ళుసహజ సిద్ధమైన వైఖరిని,విషయాల పట్ల స్ఫష్టమైన అవగాహనను కలిగి ఉంటారు.
 • సున్నితమైన మనస్కులు కూడా.
 • అంతే కాదు తెలుపును ఇష్టపడే వాళ్ళు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు .

సమ్మర్ లో తెల్లటి మల్లెపూలు ,తెల్లటి కాటన్ డ్రెస్ లు నా ఫేవరేట్

రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే

నలుపు రంగు ఎక్కువగా ఆశుభానికి,శని కి ప్రతీకగా సూచిస్తారు.
కానీ వర్షాన్నిచ్చే నల్లటి మేఘాలు,మనిషికి విశ్రాంతి నిచ్చే రాత్రి అన్నీ నలుపే..
అలాగే ఆడపిల్ల కాటుక కళ్ళు,నల్లని పొడవైన కురులు ఇష్టపడని వాళ్ళుండరు.

 • నలుపు రంగును ఇష్టపడే వాళ్ళు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
 • వాళ్ళపై వేరొకరు ఆధిపత్యం చెలాయించటం వీళ్ళకి నచ్చదు.
 • చరిత్రను ఇష్టపడే వారు నల్ల రంగు కార్లంటే ఆసక్తి కలిగి ఉంటారట.

నాకు కూడా నల్లని పొడవైన జడ,నల్లపూసల గొలుసు చాలా ఇష్టం.♥

ఈ సంజెలో ... కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో ...
ఏ రాజు ఎదలోతు చవిచూసేనో..
ఈ సంజెలో కెంజాయలో


ఎరుపు,పసుపు రంగుల కలయికతో ఏర్పడేదే నారింజ రంగు.
సంజె కెంజాయ రంగుగా,చెంగావి రంగు గా రంగును వర్ణిస్తారు.
యోగులు, మునీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
 • రంగు ఇష్టపడే వారు మాటకారులు
 • వీళ్ళు ఎప్పుడూ చురుకుగా,సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్నికలిగిఉంటారు.
 • నారింజ రంగు ధరించేవారు అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకుంటారు.

చిన్నప్పుడు జింగ్ థింగ్ గోల్డ్ స్పాట్,ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైనవి.


ప్రకృతి లోని అందమైన రంగుల్లాగే మనజీవితం కూడా సకలవర్ణ శోభితం కావాలని కోరుకుంటూ
అందరూ
సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ శుభాకాంక్షలు
Life is Beautiful and Make it Coluorful


Related Posts Plugin for WordPress, Blogger...