పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, నవంబర్ 2011, మంగళవారం

నా సంగీత ప్రపంచంలో ఇళయరాజా..


మా ఇంట్లో నాకు , మా తమ్ముడికి ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం.
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కార్ లో,మా ఇద్దరి మొబైల్ లో ఇళయరాజా
పాటలు తప్పకుండా ఉండాల్సిందే..
అలా మాకు ఇష్టమైన,నేను కలెక్ట్ చేసిన ఇళయరాజా గారి పాటలు
ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే అభిమానుల కోసం
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో ...



28, నవంబర్ 2011, సోమవారం

Art By : రమ్యాభద్ర...


మా చెల్లి రమ్య చిన్నప్పటి నుండి చాలా టాలెంటెడ్ .
మంచి బొమ్మలు గీస్తుంది,పైటింగ్స్ వేస్తుంది..స్కూల్ డేస్ లో కూడా
ఎక్కడ పైంటింగ్,డ్రాయింగ్ పోటీలు జరిగినా తనే విన్ అయ్యేది.
ఇంట్లో వాళ్ళందరం తన టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్లము..
నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా తన పైటింగ్స్ కి కావలసినవన్నీ తెచ్చివ్వాల్సిందే..
పెళ్ళైన తర్వాత కూడా తన హాబీస్ ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని మేమందరం అనుకునే వాళ్లము.
దానికి తగినట్లే తన హజ్బండ్ మా చెల్లి ఆర్ట్ ని ,టాలెంట్స్ ని మాకంటే ఎక్కువగా ఇష్టపడతారు..
మేము ఎలాగైతే తనకి అవసరమైనవన్నీ తెచ్చి ప్రోత్సహిస్తామో మా మరిదిగారు భద్ర కూడా అలాగే చేస్తారు..
తన అభిరుచుల్ని గుర్తించి,గౌరవించి,ప్రోత్సహించే భర్త దొరకటాన్ని
మించిన అదృష్టం ఏ అమ్మాయికైనా ఏముంటుంది..

మా చెల్లికి బాపు బొమ్మలు ఇష్టమని "బాపు బొమ్మల హరివిల్లు" బుక్ గిఫ్ట్ గా ఇచ్చారు ..
అందులో
వినాయకుడి బొమ్మ మా చెల్లి ఆయిల్ పైంట్స్ తో వేసింది..

మా రమ్య చార్ట్ మీద వేసిన బొమ్మను ఎంతో అపురూపంగా ఫ్రేం చేయించారు తన హజ్బండ్
ఫ్రేం
చేయించటమే కాదు ఇంటికి ఎవరు వచ్చినా ఇది మా రమ్య చేసింది అని ఎంతో గొప్పగా చెప్తారు..
వూల్ తో చార్ట్ మీద చేసే మాటీ వర్క్.మా అమ్మ మా చిన్నప్పుడు మాటీ వర్క్ చాలా బాగా చేసేది.
అమ్మ
దగ్గర నేను నేర్చుకున్నాను.ఇప్పుడు చెల్లి సొంతగా బుక్ చూసి నేర్చుకుని తయారు చేసింది.

దాన్ని కూడా ఫ్రేం చేయించి హాల్ లో డెకరేట్ చేశారు
తనని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న తన బెటర్ హాఫ్ కి మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ టీషర్ట్.
వైట్ టీ షర్ట్ మీద బాపు బొమ్మలు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దింది.
షర్ట్ చూసి అందరు మెచ్చుకుంటే తననే మెచ్చుకున్నంత ఆనంద పడతారు మా మరిదిగారు.


26, నవంబర్ 2011, శనివారం

'న్యాయ దినోత్సవం'

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనకు ఒక పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది.
ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతి మీద 1949 నవంబర్ 26 న
రాజ్యాంగకమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 'భారత రాజ్యాంగం'
1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.
నవంబర్ 26 ను 'జాతీయ న్యాయ దినోత్సవం' గా జరుపుకోవాలని
భారత
అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్ధాల క్రితం నిర్ణయించింది.

రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయటమే కాక,రాజ్యాంగానికి రక్షణగా
న్యాయవ్యవస్థ పని చేస్తుంది కనుక,రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు
సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారకంగా ఆమోదించిన నవంబర్ 26 ని
న్యాయదినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.
చట్టం ముందు అందరు సమానమని ,
ప్రజలందరికి సత్వర న్యాయం అందచేయటమే న్యాయదినోత్సవ ధ్యేయం..

నిజమైన న్యాయాన్ని గెలిపించడానికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ న్యాయదినోత్సవ శుభాకాంక్షలు

25, నవంబర్ 2011, శుక్రవారం

"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"

"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో
మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి రావు తన
తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా
"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"
అనే ఎంకి పాట పాడించారు..
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం.
గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండ రామాయణం లోని ఒక భాగం,
ఎమ్మెస్.రామారావు సుందరకాండ
గా సుప్రసిద్ధం.
తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి,ఆకాశవాణిలో పాడారు..
ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.(wiki)

నీరాజనం సినిమాలో ఈయన పాడిన
"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"
"పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో"
అంటూ తాజ్ మహల్ అందాన్ని వర్ణించిన ఈ పాట ఎందుకో నాకు చాలా నచ్చుతుంది.
సినిమాలో ఇది విషాదగీతం అయినా అందమైన ప్రేమకు
ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోయిన తాజ్ మహల్ లా ఈ పాట కూడా గుర్తుండిపోయింది..

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో


ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో
పండు వేన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా



24, నవంబర్ 2011, గురువారం

A Picture Speaks A Thousand Words. .

మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు,కష్ట నష్టాలు ఎంతో భారంగా మారి బాధపెడతాయి..
కానీ చీకటి వెంటే వెలుగు ఉన్నట్లే.. మనకు జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని,
దేవుడా నేను ఈ బాధ భరించలేను అనిపించే ప్రతి కష్టం ఒక మంచి ఫలితానికే దారి తీస్తుందని
అర్ధంతో
వున్నఈ ఫార్వార్డ్ మెయిల్ నాకు నచ్చింది..
A Picture Speaks A Thousand Words.











23, నవంబర్ 2011, బుధవారం

'Who Serves jiva,Serves God indeed'.

ఎందరో మహనీయులు,జీవితంలో విజయం సాధించి ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచిన,
మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట
ఒక
గొప్ప సూక్తిగా,మార్గదర్శకంగా నిలిచిపోతుంది..
అలాంటి స్ఫూర్తి దాయకంగా వుండే కొటేషన్స్ సేకరించటం నాకు హాబీ..
ఇప్పటి దాకా నా బ్లాగ్ లో అలాంటి కొటేషన్స్ కొన్ని పోస్ట్ చేశానుకూడా.

నా బ్లాగ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళలో మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర కూడా ఒకరు.
చెల్లి తనకేదో పుస్తకం కావాలని షాప్ కి వెళితే అక్కడ వివేకానంద కొటేషన్స్ చూసి,
నేను బ్లాగ్ లో పెట్టే కొటేషన్స్ గుర్తుకు వచ్చి అక్కకి ఇవి ఇస్తే బాగుంటుంది కదా అనుకుని
ఇద్దరు నాకు ఈ వివేకానంద కొటేషన్స్ 'Voice Of Freedom' గిఫ్ట్ గా ఇచ్చారు.
నా అభిరుచిని తెలుసుకుని మా చెల్లి,మరిది గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో అమూల్యమైనది..
ThankYou భద్రరమ్య

Related Posts Plugin for WordPress, Blogger...