పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, నవంబర్ 2011, శుక్రవారం

"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"

"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో
మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి రావు తన
తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా
"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"
అనే ఎంకి పాట పాడించారు..
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం.
గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండ రామాయణం లోని ఒక భాగం,
ఎమ్మెస్.రామారావు సుందరకాండ
గా సుప్రసిద్ధం.
తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి,ఆకాశవాణిలో పాడారు..
ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.(wiki)

నీరాజనం సినిమాలో ఈయన పాడిన
"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"
"పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో"
అంటూ తాజ్ మహల్ అందాన్ని వర్ణించిన ఈ పాట ఎందుకో నాకు చాలా నచ్చుతుంది.
సినిమాలో ఇది విషాదగీతం అయినా అందమైన ప్రేమకు
ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోయిన తాజ్ మహల్ లా ఈ పాట కూడా గుర్తుండిపోయింది..

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో


ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో
పండు వేన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా4 వ్యాఖ్యలు:

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ మీకు శత కోటి కృతజ్ఞతలు..నీరాజనంలో అన్ని మంచి పాటలున్నా ఈ పాటంటే ఎందుకో తెలియదు కాని ప్రాణం నాకు.మనసును మళ్ళీ తట్టి లేపారండీ ఈ పాటని టపా చేసి.ఏదో తెలియని అనుభూతి ఈ పాట వింటూ ఉంటే.ఇంకొక విషయం కొత్తగా తెలుసుకున్నాను, నిజంగా ఈ పాట పాడింది పి.బి.శ్రీనివాస్ గారు అనుకున్నా.ఇప్పటి వరకు రామారావు గారు పాడిందని తెలియదు నాకు.ఇంకోసారి చాలా చాలా థాంకులు మీకు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

సుభా గారు మీకు అంత ఇష్టమైన పాటను పోస్ట్ చేసి మీ సంతోషానికి కారణం కావటం నిజంగా నాకు చాలా ఆనందంగా వుందండీ..
నీరాజనం సినిమాలో పాటలు నాకు చాలా ఇష్టం..
అందులో ఈ పాట కూడా ఒకటి.

ఎమ్మెస్ రామారావ్ గారు ఈ పాట పాడారని నేను కూడా యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాను..
అందుకే పోస్ట్ లో ఆ విషయం కూడా ప్రస్తావించాను..
మొత్తానికి నా పోస్ట్ మీకు నచ్చినందుకు,
మీ సంతోషాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదములు

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

Its a very Good post

300 years life unna Taj

gurinchi monna ee madhyana media lo chusthunnappudu ee song kuda vinnanu

naku baga nacchindi

happy to seeing this again...!!

?!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఆ ప్రోగ్రాం నేను చూడలేదండీ మిస్ అయ్యాను ఐతే..
మీ స్పందనకు ధన్యవాదములు

Related Posts Plugin for WordPress, Blogger...