పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2011, శనివారం

నా చిన్నిప్రపంచం 2011 - Sweet Memories !


జీవితం సప్తసాగర గీతం ... వెలుగు నీడల వేదం
సాగనీ పయనం ... కలా ఇలా కౌగిలించే చోటా..

నా చిన్నిప్రపంచంలో 2011 ఎంతో సంతోషంగా ,సందడిగా గడిచింది.
అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మనుషుల జీవితాల్లో సహజం కాబట్టి..వాటిని పట్టించుకోకుండా
చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా నా కుటుంబ సభ్యులందరం ఒకరికొకరం అన్నట్లు
నా చిన్నిప్రపంచం ఈ సంవత్సరం ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకుంది.

ఇంక నా విషయంలో పెద్దగా సమస్యలేవీ లేకుండా యధాతధ స్థితి కొనసాగినా
నేను సెలెక్ట్ అవుతాననుకున్న 'జూనియర్ సివిల్ జడ్జ్ ఎక్జాం' క్వాలిఫై అవ్వలేకపోవటం
ఒక
చిన్ని అపజయం.
అలాగే నా చిన్నిప్రపంచం ఎందరో మంచి బ్లాగ్ మిత్రులను పరిచయం చేసింది.

" 2011 "ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు తీసుకోబోతున్న సమయంలో
నా
చిన్నిప్రపంచానికి " 2011 "అందించిన కొన్ని మధురానుభూతులు..















రాబోయే నూతన సంవత్సరం 2012 కూడా నా చిన్ని ప్రపంచంలో, ప్రపంచానికంతటికీ
ఆనందాన్ని,మంచి విజయాలను,మధురానుభూతులను అందించి,
శుభకరంగా సంతోషంగా వుండాలని కోరుకుంటూ ,
నా చిన్నిప్రపంచం తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


2012 కి చామంతిపూల స్వాగతం..

మా ఇంటి తోటలో పూచిన చామంతిపూలు
సంతోషంగా..నూతన
సంవత్సరానికి
స్వాగతం
చెప్తున్నాయి.


30, డిసెంబర్ 2011, శుక్రవారం

A.P. STATE BAR COUNCIL Elections..


అభ్యర్ధుల ప్రచారాస్త్రాలు..



ఈ రోజు స్టేట్ బార్ కౌన్సిల్ Elections జరుగుతున్నాయి. ఐదేళ్లకొక సారి జరిగే ఎన్నికల్లో
ఈసారి 134 మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు.వీరిలో నుండి 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 68,000 పైగా న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు .
గుంటూరు జిల్లానుండి 12 మంది న్యాయవాదులు పోటీలో వున్నారు.
గుంటూరు జిల్లాలో 3,677 మంది న్యాయవాదులకు ఓటుహక్కు వుంది.
అందులో
నా ఓటు కూడా ఒకటి


All The Best Participants..


నా కవిత...!


చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ

కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ

మెదడుకు మేతను తినిపిస్తూ...


హృదయాన్ని తికమక పెట్టేస్తూ

మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ

మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ

నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ...


నాలుగక్షరాలని అటువిటు రాస్తూ

మురిసిపోయాను పైన, క్రింద చదివేస్తూ

నా పిచ్చిరాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ

సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ...


Telugu Quotes community

27, డిసెంబర్ 2011, మంగళవారం

ఏకులమైనా ...ఏ మతమైనా భరతమాతకొకటే లేరా !

ఈ రోజు "raafsun" గారి బ్లాగ్ లో
"వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు...."
అన్న పోస్ట్ చూసిన తర్వాత ,కొంత మంది అలా వున్నా మనమందరం భారతీయులం,
భారతీయులంతా ఒక్కటే అనుకునే వాళ్ళు కూడా వుంటారు అని నేను నమ్ముతాను. అందుకే ఈ పోస్ట్..

దేశం
మనదే ...తేజం మనదే



దేశం మనదే ...తేజం మనదే
దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతి మనదే ... జాతిమనదే
ప్రజల అండదండా మనదే

అందాల బంధం వుందినేలలో
ఆత్మీయరాగం వుందిగాలిలో .
కులమైన ... మతమైనా
కులమైన ... మతమైనా భరతమాత కొకటేలేరా ...

ఎన్నిబేధాలున్నా ... మాకెన్నితేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతావేళా
వందేమాతరం అందాం అందరం
వందేమాతరం అందాం అందరం

దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతిమనదే ...జాతిమనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం వుందినేలలో
ఆత్మీయరాగం వుందిగాలిలో ..

కులమైనా ...మతమైనా
భరతమాత కొకటేలేరా
రాజులు ఐనా పేదలుఐనా
భరతమాత సుతులేలేరా...

ఎన్నిదేశాలున్నా... మాకెన్నిదోషాలున్నా
దేశమంటే ప్ర్రాణమిస్తాం అంతావేళా
వందేమాతరం అందాంఅందరం


శతవసంతాల మన "జనగణమన"...!

జాతీయ గీతం జనగణమనకు ఈ రోజుతో వందేళ్ళు పూర్తి అయ్యాయి.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జనగణమన' మొట్టమొదటి సారిగా 1911 లో డిసెంబర్ 27 న
కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950,జనవరి 24 న ఈ గీతానికి జాతీయగీతం హోదాదక్కింది.
'జనగణమన' భారతీయ స్ఫూర్తిని,భారతీయుల భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గేయం.
భరతమాత కీర్తి ప్రతిష్టతలను చాటుతూ...భారత దేశ భౌగోళిక స్వరూపాన్నిదాని అంతస్సారంతో వర్ణించే అక్షర చిత్రమిది.

'ప్రజలందరి మనస్సుకు అధినేతవు,భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక,
పంజాబ్,సింధు,గుజరాత్,మహారాష్ట్ర,ద్రావిడ,ఉత్కళ,వంగ దేశాలతోనూ,
వింధ్య,హిమాలయ పర్వతాలతోనూ,యమునా,గంగ ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను
శోభించే భాగ్య విధాత,వాటికి నీ శుభనామం ఉద్భోధనిస్తుంది.
అవి నీ ఆశీస్సులు ఆకాంక్షిస్తాయి.నీ జయ గాధల్ని గానం చేస్తాయి.
సకల జనులకు మంగళ కారకమైన,భారత భాగ్య విధాతవు అయిన నీకు
జయమగు గాక! జయమగు గాక! జయమగు గాక!'

మొత్తం 31 చరణాలతో రవీంద్రుడు జనగణమన రాయగా అందులో ఏడు చరణాలను మనం జాతీయ గీతంగా ఆలపిస్తున్నాం.జాతీయ గీతం రచించిన భాష సంస్కృత మిళిత బెంగాలీ అయినా,
భారతీయులంతా దీన్ని తమమాతృ గీతం గా అనుభూతి చెంది పాడుకునేలా మన జాతీయ గీతం రూపు దిద్దుకుంది.


Janaganamana
(full song of National Anthem of India)





ఎక్కడ  విన్నా వినపడకపోయినా ఉదయాన్నే స్కూల్ అసెంబ్లీ లో ..సాయంత్రం స్కూల్స్ వదిలే టైం లో
విద్యార్ధుల గొంతులో స్వరమై చేరి,భారతీయుడి జీవితంపై చెరగని ముద్ర వేసిన ఈ శుభ గానం
వందేళ్ళైనా,ఇంక ఎన్నేళ్ళైనా... ప్రతి క్షణం భారత దేశ సమున్నతిని చాటుతూనే వుంటుంది.


24, డిసెంబర్ 2011, శనివారం

నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు...

"నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు" అంటారు మహాత్మా గాంధీ..
ఎదుటి వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు అదే పనిగా మనం బాధపడుతున్నామంటే
మన మీద మనకు విశ్వాసం లేనట్లే..

సమాజం తమను గుర్తించాల్సినంతగా గుర్తించటం లేదన్న అసంతృప్తి చాలా మందిలో వుంటుంది.
సమాజం మనల్ని గుర్తించటానికి మనం మరింత ఎదగాలేమో,మనదైన రంగంలో
ఇంకా పరిపూర్ణత సాధించాలేమో అని ఎందుకు అనుకోకూడదు?
ఇతరుల్ని చూసి అసూయ పడుతున్నామంటే,మనలో లేని గొప్ప లక్షణాలేవో వాళ్ళలో ఉన్నట్లే కదా!
అవేమిటో తెలుసుకుంటే విజయం మనకు సొంతమైనట్లే.

ఒకసారి బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడిని వెంట పెట్టుకుని భిక్షాటనకి వెళ్ళాడు.
ఓ ఇంటి ముందు నిలబడి భిక్షాం దేహి అని అర్ధించాడు.ఆ ఇంటి ఇల్లాలు కోపంగా ఉన్నట్లుంది.
'అడుక్కు తినటానికి సిగ్గుగా లేదూ కష్టపడి పని చేసుకోవచ్చుగా'అని తిట్టిపోసింది.
బుద్ధుడు మౌనంగా ముందుకెళ్ళాడు.గురువుగార్ని అంతమాట అన్నందుకు,ఆనందుడు చాలా బాధపడ్డాడు.
ఇద్దరూ ఆరామానికి బయలుదేరారు.తన చేతిలోని భిక్ష పాత్రను శిష్యుడి చేతికి ఇచ్చాడు బుద్ధుడు.
కొంత దూరం వెళ్ళాక 'ఈ పాత్ర ఎవరిది' అనడిగాడు 'మీదే గురువు గారూ' అని చెప్పాడు ఆనందుడు.
'నీకే ఇచ్చేస్తున్నా తీసుకో' అని చెప్పాడు.
బుద్ధుడు ఇంకాస్త దూరం వెళ్ళాక 'ఆ పాత్ర ఎవరిది?' అని మరోసారి అడిగాడు .
నాదే గురువు గారూ అన్నాడు ఆనందుడు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వి 'చూశావా? ఇదే ప్రశ్న మొదటి సారి అడిగినప్పుడు నాదన్నావు.
రెండోసారి అడిగితే నీదన్నావు.ఏదైనా సరే ఇది నాది అని ఆమోదించాకే నీదవుతుంది.
ఆ ఇల్లాలి తిట్టు కూడా అంతే!మనం వాటిని స్వీకరించకపోతే బాధ పడాల్సిన అవసరమే వుండదు'
అని వివరంగా చెప్పాడు బుద్ధుడు.
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనల్లో మనం దేనికి స్పందించాలి,దేనిని మనకు సంబంధం లేనిదిగా వదిలెయ్యాలి అన్న విషయాల్లో స్పష్టత వుంటే మన మానసిక ప్రశాంతతను మన నుండి ఎవరూ దూరం చేయలేరు..
ఎవరి మాటల, చేతల ప్రభావం మన జీవితాన్ని నిర్దేశించలేదు.

22, డిసెంబర్ 2011, గురువారం

మిలే సుర్ మేరా తుమ్హారా....


ఎన్నో భాషలు,ఎన్నో మతాలూ,మరెన్నో సంస్కృతులు.వీటి సమ్మేళనం మన భారతీయం.
ఆ భారతీయతనురెండు లైన్లలో పాడుకోగలిగితే అది.. 
"మిలే సుర్ మేరా తుమ్హారా..తో సుర్ బనే హమారా.."

గతంలోకి వెళితే..లోక్ సేవ సంచార్ పరిషత్ వారు ఓ వీడియో రూపొందించమని "ఒగిల్వి మీడియాని"
కోరారు.ఆ వీడియో భారతీయత ఉట్టిపడేలా ఉండాలనేది అప్పటి ప్రభుత్వం ఆలోచన.అంతే కాదు నిడివి
5 నిమిషాలే వుండాలి..14 భాషలు వినిపించాలి..దేశంలోని భిన్నత్వమంతా ఏకత్వంగా కనిపించాలి 
ఇదీ కాన్సెప్ట్.అనుకున్నట్లే వీడియోను రూపొందించింది ఒగ్విలి మీడియా.ఆ పాటే మిలే సుర్ మేరా తుమ్హారా.సురేష్ మాలిక్ ఈ పాట సృష్టికర్త .. ఈ పాటను "పీయూష్ పాండే" రాశారు.. దీనికి సంగీతం  
లూయిస్ బ్యాంక్స్ ..1988,ఆగస్ట్ 15 న ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం దూరదర్శన్ లో ఈ పాట తొలిసారి ప్రసారమైంది.

నేను భారతీయుడినని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా, జాతీయతా భావాన్ని కలిగించేలా
ఎన్నో అందమైన లోకేషన్స్ లో, ఎందరో ప్రముఖులు,అప్పటి హీరోహీరోయిన్లతో పాటు, కోట్లమంది
భారతీయులు సమసృతిలో పాడిన ఈ పాట మరో జాతీయ గీతం అనదగ్గ స్థాయిలో మన గుండెల్లో
నిలిచిపోయింది..

ఈ పాట వినగానే వెంటనే నా మనసు చిన్నప్పుడు DD రోజులకి వెళ్ళిపోతుంది.చిన్నప్పుడు ఈ పాటకి అర్ధం తెలియకపోయినా మన తెలుగు దంపతులు పాడే "నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే.." అనే లైన్స్ చాలా బాగుండేవి .. ఇప్పటికీ, వింటున్నా,చూస్తున్నా మనసుకు ఏదో తెలియని సంతోషాన్నిచ్చే ఈ పాట  ఈ పాట నా చాలా ఇష్టమైన పాట.

मिले सुर मेरा तुम्हारा -1988
(Video On National Integration)





మ్యూజిక్:లూయిస్ బాంక్స్
లిరిక్స్:పీయూష్ పాండే
డైరెక్టర్:సురేష్ మాలిక్
సింగర్:భీంసేన్ జోషి
ప్రొడ్యూసర్ :లోక్ సేవా సంచార్ పరిషత్.



నా స్వరము నీ స్వరము సంగమమై
మన స్వరంగా అవతరించే..

21, డిసెంబర్ 2011, బుధవారం

శ్రీమతికి శ్రీవారి ప్రేమలేఖ....!


చిత్రకారుల కుంచెకు చిక్కని అందమో..
కవుల
ఊహకు అందని భావమో..
తేనే
ఊటవో...మల్లెల తోటవో..
వెన్నెల
వాగులో వొంటరి నక్షత్రానివో..

కొలంబస్ కళ్ళు చూడని సౌందర్య ద్వీపమా
ఖండాలు
దాటిన కోహినూర్ వజ్రమా..
నీ
నవ్వులో నైలునది వొంపులు తిరుగుతుంది
కళ్ళతీరాలు
దాటి చూడలేని నన్ను
కలల
సునామీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు

కళ్ళు చేసుకున్న పుణ్యమో..
కలలు
రాసుకున్న కావ్యమో..
అందం
నీ దగ్గర పాఠాలు వల్లెవేస్తుంది
చూపు
నీ దగ్గర కొత్త సోయగాల్ని అద్దుకుంటుంది

అందాల
తాజ్ మహల్ ముందు మహరాణిలా కూర్చుని..
నువ్వు
చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు
ఎవరందంగా
వున్నారంటే ఏమి చెప్పగలను..?
బహుశా
షాజహాన్ కూడా కొంచెం సందేహిస్తాడేమో..

నాలో చెలరేగే భావాల్ని వ్యక్తీకరించడానికి నా భాష చాలటం లేదు..
నిన్ను
వర్ణించడానికి శ్రీనాధుడు,కీట్స్ కలిసి రావాలేమో..
మళ్ళీ
డావెన్సీ కుంచె పట్టాల్సిందే.. తప్పదు..
మైకెలేంజిలో
మూడ్ తెచ్చుకోవాల్సిందే..

వేకువ
వనాలలో వాసంత సమీరమా..
ప్రకృతిని చూసి నీ మనసు రాగమైనప్పుడు..
చినుకులతో
కలిసి నీ పాదాలు తాళం వేసినప్పుడు..
అమాయకత్వం
లో అతిశయం లో చిలిపితనపు అల్లరి వేళల్లో
నీ
రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని నేనెలా మరచిపోగలను?

నా
హృదయపు మైదానాల్లో
నేను
నిశ్శబ్ధంగా తోటమాలిలా పని చేసుకుంటున్నప్పుడు
దారిలో
రోజూ పలకరించే ఎర్రగులాబీ నువ్వు..
నాలోని
అలసిన బాటసారికి ఆఖరి మజిలీ నీ నవ్వు..

తలపుల
తుఫాన్ లో తడిసిపోయి..
కాసింత
వెచ్చదనం కోసం నీ ఊహల వాకిలిలో నిలుచున్నా..
నీ
ఊహల వెచ్చటి దుప్పటి కప్పుకున్నా..

Your's sweetheart




20, డిసెంబర్ 2011, మంగళవారం

ఎంకి - నాయుడుబావ By:Raaji


నండూరి సుబ్బారావు గారు రాసిన ఎంకి పాటలు ప్రణయానికి సంబంధించిన పాటలు.
తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు,
వేదనలు, విరహాలు పాటల్లో చక్కగా వర్ణించారు..
ఎంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక.
ఎంకి,నాయుడు బావలు జానపదజంట..
అందమైన అమ్మాయిని పోల్చటానికి నండూరి వారి ఎంకి అనటం అందరికీ తెలిసిందే..

బాపుబొమ్మల్లో ఎంకి నాయుడు బావ బొమ్మను చూసిన నాకు వీళ్ళిద్దరి గురించి
సుభాష్ చంద్రబోస్ సినిమాలో "జాజిరి జాజిరి మావా" అనే పాటను
రాజస్థానీ జానపద జంట చిత్రాలతో కలిపి పాట చేయాలనిపించింది..

నేను చేసిన ఎంకి నాయుడు బావ పాట...నా మరో వీడియో ప్రయోగం..

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా నాజత మావా!
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా!
By:Raaji





19, డిసెంబర్ 2011, సోమవారం

ఖాళీగా వున్నారా?



మనుషులు ఎప్పుడూ తమదే పైచేయి కావాలని కోరుకుంటారు.భార్య మీద భర్త,భర్త మీద భార్య, పిల్లల మీద తండ్రి,విద్యార్ధుల మీద ఉపాధ్యాయుడు,ఉద్యోగుల మీద ఆఫీసర్ ...ప్రతి ఒక్కరిలో ఈ స్వభావం వుంటుంది.
ఈ ఆధిపత్య ధోరణి అధికారానికి గుర్తు. సాధారణంగా అణకువగా ఉండటాన్ని,ఎదుటివారికి లొంగి పోవడంగా,పిరికితనంగా జమకడతారు.

"అహింస బలవంతుడి ఆయుధం"అన్నారు గాంధీజీ.ఎదుటివాడిని కొట్టగలిగీ కొట్టకుండా వదిలిపెట్టటం బలవంతుడికే సాధ్యం కదా! కాశీకి వెళ్ళిన ఒకతను తనకు బాగా ఇష్టమైన స్వీట్ వదిలిపెట్టి వస్తాడు..తిరుపతి వెళ్ళిన ఒక మహిళ తను ప్రాణంగా చూసుకునే తలనీలాలను అర్పించుకుని వస్తుంది. కానీ నాకు అత్యంత ఇష్టం ఏమిటి? నేనే, ఆ నేనును ఆ గర్వాన్ని,ఆ అధికారాన్ని అర్పించుకోవాలి..

నీలోని నిన్నే నువ్వు అర్పించుకుంటే నువ్వు ఖాళీ అవుతావు.మనం దేవుడి ముందు మోకరిల్లుతాం.మన అహాన్ని తీసి పక్కన పెట్టేస్తాం.అప్పుడు మనలోకి మనకు తెలియకుండానే ఏదో శక్తి ప్రవహించినట్లు అనిపిస్తుంది.ఎందుకని?? మనం ఖాళీగా వున్నాం కనుక,దాన్ని భగవంతుడు తన శక్తితో పూరించాడు కనుక..

శూన్యంలోకి గాలి త్వరగా ప్రవేశిస్తుంది.శూన్యం దేన్నయినా త్వరగా ఆకర్షిస్తుంది.మనం కొత్తగా ఉండాలంటే,మనని కొత్తగా నింపుకోవాలంటే మనలోని అహంకారాన్ని,అన్నీ మనకు తెలుసనే అజ్ఞానాన్ని వదులుకోవాలి.
మనలో శూన్యం ఏర్పరచుకోవాలి ,కాకపోతే ఆ శూన్యాన్ని అభిమానం,ప్రేమతో నింపుకోవాలి.

ఎవరు చెప్పిందైనా వినగలగాలి అందులో నిజా నిజాలు గ్రహించగలగాలి.ఎవరి గురించైనా ఎవరైనా చెప్పే మాటలు నిజమా కాదా అని ఆలోచించగలగాలి. ఎదుటివారి గురించి మనకి చెడుగా చెప్పే వ్యక్తి  ఆ అలవాటుని మన విషయంలో కూడా ప్రయోగించడని నమ్మకం లేదు కదా అందుకే అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
ఎవరి గురించైనా ఒక నిర్ణయానికి, అభిప్రాయానికి తొందరగా రాకూడదు.

ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించగలగాలి.నేను ఒక విషయం చెప్పాను కాబట్టి ఇదే నిజం,ఇదే జరిగి తీరాలి అనుకుంటే వాదనలు,వివాదాలు తప్ప ఇంకేమీ ఫలితం వుండదు.తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే పంతం, మొండిపట్టుదల  అన్ని విషయాల్లో  అనర్దాలకే దారితీస్తుంది.

నిత్య జీవితంలో మనకు ఎందరో తారసపడుతుంటారు.ఎవరో ఏదో అన్నంత మాత్రాన బాధపడుతూ కూర్చోవాలా?
తలచుకుని తలచుకుని కుంగి పోవాలా? అది నిజంగానే అర్ధంలేని వాగుడైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
సద్విమర్శ అయితే సవినయంగా స్వీకరించగలగాలి, మనలోని లోపాల్ని గుర్తించి సరిదిద్దుకోవాలి..

వేలెత్తి చూపే ప్రతి వ్యక్తీ గురువే అనుకుంటే,
వేధించిన ప్రతి అనుభవము పాఠమే అనుకుంటే...
కోపాల్లేవు, తాపాల్లేవు,కన్నీళ్లు లేవు,అసూయా ద్వేషాలు లేవు.
ఇంక నెగటివ్ భావాలకు చోటెక్కడిది?
అరుదుగా కొన్ని ఏర్పడినా క్షణాల్లో బుర్ర ఖాళీ చేసి వెళ్ళిపోతాయి..

“Our minds should not be empty
because if they are not preoccupied by good,
evil will break in upon them.”


Related Posts Plugin for WordPress, Blogger...