పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, అక్టోబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 6
ఆ రోజు ఆదివారం రఫీ,సంపత్ ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతున్నారు . నేను కూడా లేచి టిఫిన్ చేస్తున్నాను. ఇంతలో హేమంత్  పిలిచి మాధవ్ మా పిన్ని వాళ్ళింటికి వెళ్తున్నాం నువ్వు వస్తావా అన్నాడు.అంటే కావ్య ఇంటికి కావ్య వాళ్ళ మమ్మీ అప్పుడప్పుడు మా రూమ్ కి వచ్చి హేమంత్  కోసం (మాక్కూడా) ఏవైనా తీసుకు వస్తుంటారు.  ఎప్పుడన్నా ఏదన్నా తినాలనిపిస్తే రూమ్ లోనే చేసి పెట్టేవాళ్ళు . మా అందరితో కలిసిపోయి సొంతపిల్లల్లాగా  సరదాగా మాట్లాడుతూ,చదువులు,పిల్లలు,ఉద్యోగాలు,బయటి జనాలు,రాజకీయాలు ఇలా దాదాపు అన్ని విషయాల్లో ఆమెకి నాలెడ్జ్ ఉండేది.

కావ్య  ఇంటికి వెళ్ళాలంటే నాకు ఇంటరెస్ట్ గానే అనిపించింది . వెంటనే వస్తాను అని రెడీ అయ్యాను .. ఎందుకో ఈ మధ్య నా డ్రెస్సింగ్, మేకప్ లో శ్రద్ద  పెరిగినట్లు అనిపిస్తుంది . ఇప్పటిదాకా అన్నయ్య షాపింగ్ కి తీసుకెళ్ళి ఇప్పించే పొడుగు షర్ట్ లు , లూజ్ ప్యాంట్లు , ఇంకా అన్నయ్యకి నచ్చనివి ఏమన్నా ఉంటే పర్లేదులే నరేష్ నేను వేసుకుంటాలే అని తీసుకుని వేసుకునే బట్టలు ఇప్పుడు నచ్చట్లేదు ..  ( నరేష్ మా అన్నయ్య, నా కంటే పదేళ్ళు పెద్దైనా నేను  అన్నయ్యా అని పిలిస్తే ఇష్టపడడు  నన్ను పేరు పెట్టె పిలువ్ మాధవ్ అంటాడు )  ఈ సారి నాన వస్తే డబ్బులిప్పించుకుని ఫ్రెండ్స్ తో వెళ్లి మంచి డ్రెస్ లు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను ..

రఫీ,సోహిల్,హేమంత్,నేను నలుగురం కావ్య ఇంటికి వెళ్ళాము .. వాకిట్లోనే గయ్యిన అరుస్తూ తెల్లని పప్పీ మాకు స్వాగతం చెప్పింది .. అమ్మ బాబోయ్ ఇంకా నయం తలుపు తీయలేదు .. స్నూపీ అంటూ కావ్యలాగే వున్న తన చెల్లెలు లత వచ్చి దాన్ని ముద్దుగా ఎత్తుకుని లోపలికి పట్టుకెళ్ళింది .. ఈ లోపు కావ్య వాళ్ళ మమ్మీ బయటికి వచ్చి రండి రండి అంటూ లోపలి పిలిచారు...ఇంటి ముందు చిన్న మొక్కలు,కుండీలలో గులాబీలు, ఎక్కువా తక్కువా కాకుండా అవసరమైన వరకే ఫర్నిచర్ తో పొందిగ్గా, చక్కగా సర్ది నీట్  గా ప్రశాంతంగా ఉంది.. ఇల్లు చూస్తున్న నాతో ఆంటీ అన్నారు నాకు ఇల్లు ఎప్పుడు ఇలా శుభ్రంగా ఉంచటం ఇష్టమయ్యా ఈ విషయంలో కావ్య నాకు హెల్ప్ చేస్తుంది .

ఈ లోపు కావ్య కూడా వచ్చి హాల్లో కూర్చుంది . ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చామన్నా వినకుండా ఆంటీ మాకు ఇడ్లీ పెట్టారు. అంకుల్ కి కూడా ఆదివారం సెలవు  కావటంతో ఇంట్లోనే వున్నారు . నా ఫ్రెండ్స్ మాటల్లో నాకు అర్ధమయిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు కూడా హేమంత్ తో కలిసి ఇక్కడికి  వచ్చారు.నేను రావటమిదే మొదటి సారి . సాయంత్రం దాకా అక్కడే ఉన్నాము.. ఆంటీ మా కోసం వంట చేస్తూనే మధ్య మధ్య మాతో  కబుర్లు చెప్తూ సరదాగా అందరితో కలుపుగోలుగా తిరుగుతున్నారు .. అంకుల్ కూడా అన్ని విషయాలు  ఆంటీ తో షేర్ చేసుకోవటం, చిన్న విషయాల దగ్గరనుండి ప్రతి ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఆంటీతో కలిసే తీసుకుంటారని వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. 

నవ్వుతూ, సంతోషంగా ఇంట్లో అన్నీ తానే అన్నట్లు ఉన్న ఆంటీని చూస్తే  నాకు మా అమ్మ గుర్తొచ్చింది .. నాకు గుర్తు తెలిసినప్పటినుండి అమ్మ ఎప్పుడు మనస్పూర్తిగా నవ్వినట్లు కూడా నాకు గుర్తులేదు. మా పక్కింట్లో వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన మా నాన్నని చూసిన మా అమ్మమ్మ ఇలాంటి డాక్టర్ ఐతే గీతే నా అల్లుడు కావాలి కానీ మా  పక్కింటి  అల్లుడు కావటమా అని మా నాన్నకి పక్కింటి వాళ్ళు ఇచ్చే కట్నం కంటే ఎక్కువ ఇస్తానని బేరం ఆడి నిశ్చితార్ధం దాకా వచ్చిన పెళ్లిని చెడగొట్టి మరీ మా నాన్నని ఇంటి అల్లుడ్ని చేసుకుంది . మా నాన్న కూడా మా అమ్మమ్మ ఇప్పుడు ఇచే కట్నం మాత్రమే  కాదు .. అమ్మమ్మకి ఇద్దరు ఆడపిల్లలే కావటంతో భవిష్యత్తులో వచ్చే ఆస్తిని కూడా దృష్టిలో ఉంచుకుని మరీ మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు .

 పెళ్ళైన దగ్గర నుండి అమ్మ తినే తిండి దగ్గరి నుండి ప్రతి చిన్న విషయం నాన్న, నానమ్మ అమ్మని హేళన చేయటం,విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు.. దాంతో ఏ  పని చేయాలన్నా ఏమంటారో,ఏమనుకుంటారో అనే సందేహాలతోనే అమ్మ జీవితం సగం అయిపోయుంటుంది.. చివరికి అమ్మకి ఇష్టమైన నాన్ వెజ్ తినాలన్నా అమ్మమ్మ  వాళ్ళు ఊరిలోనే వుంటారు కాబట్టి అక్కడికే వెళ్లి తిని వచ్చేది.తోటి డాక్టర్స్ భార్యల్లాగా వుమెన్ క్లబ్స్ కి , పార్టీలకి వెళ్ళే అలవాటు అమ్మకి లేదు. అలవాటు లేదు అనటం కంటే అవకాశం లేదు అంటే బాగుంటుందేమో ..

మనసు ఎంత బలమైనదో అంత బలహీనమైనది కూడా ..  మనసులో సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తరుగుతుంది  అంటారు...కష్టం,సుఖం పంచుకునే మన మనిషి అనే వాళ్ళు లేని  వాళ్ళే ఈ ప్రపంచంలో అందరికంటే పేదవాళ్ళు అనిపిస్తుంది కొంత మందిని చూస్తే .... అప్పుడు నేను 5 th క్లాస్ అనుకుంటాను. చిన్నక్క,నేను స్కూల్ కి వెళ్లి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చుని హోమ్ వర్క్ చేస్తున్నాము .. మా దగ్గరే కూర్చుని బెడ్ షీట్ మీద మ్యాటీ ( ఊల్ వర్క్) కుడుతున్న అమ్మ ఉన్నట్టుండి వింత వింతగా ఏదో మాట్లాడుతుంది,.. నానమ్మని పిలిచేలోపే  చేతిలోవన్నీ విసిరేసి పైకి లేచింది అమ్మ .. ఏమి జరుగుతుందో మాకు అర్ధం కాలేదు ..Related Posts Plugin for WordPress, Blogger...