పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, ఏప్రిల్ 2016, గురువారం

మన బ్లాగ్ లోకి రాకుండానే మన బ్లాగ్ చదువుతారట "Inoreader" లో ..ఒకప్పటి రోజుల్లో .. ఒకప్పుడేముంది ఇప్పటికి  కూడా మనం ఎవరితోనైనా మాట్లాడం,వాళ్ళంటే మనకి పడదు కానీ వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి ఎలా? అంటే వాళ్ళింటి విషయాలు మనకి మోసుకొచ్చే వేగులను నియమించుకునేవాళ్ళు. ఇప్పుడచ్చం అలాగే మన బ్లాగులోకి రాకుండానే,మనకి విజిటర్స్ కౌంట్ పెరగకుండా మన బ్లాగ్ లింక్  "Inoreader" లో Add చేస్తే చాలట. అక్కడ వాళ్ళ website లోనే మన బ్లాగ్ లో ఏ  రోజు పోస్ట్ ఆరోజు అప్ డేట్ అయిపోతుంది.

మరి అంతగా నా బ్లాగులోకి రాకూడదు,కానీ నా బ్లాగు రోజూ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరో కానీ నా "ఆపాత మధురాలు" బ్లాగ్ ని "Inoreader" లో Add చేశారు.నిన్న అక్కడ  నా బ్లాగ్ చూశాక  అనిపించింది. మనది కాని దాన్ని ఇలా ఎక్కడబడితే అక్కడ share చేసే వాళ్ళు మనుషులా లేక పశువులా అని. ఇలా ఇంకా ఎక్కడెక్కడ మన బ్లాగ్ లింక్స్ పెట్టేస్తారో ఎన్నని తెలుసుకుంటాం?? తెలియని వాళ్ళు మనమే ప్రచారం కోసం అలా ఎక్కడెక్కడో మన బ్లాగ్ లింక్ పెట్టాము అనుకునే ప్రమాదం కూడా ఉంది కదా.

ఇది ఖచ్చితంగా బ్లాగుల్లో , ఇంకా చాలా చోట్ల మంచి సాంకేతిక జ్ఞానం ఉన్న పరిజ్ఞానులే చేశారని నాకు అనిపిస్తుంది. నా బ్లాగుల్లో కాపీ, పేస్ట్ డిజేబుల్ చేయటంతో పాపం పాటలు కాపీ చేయటం కష్టం అనిపించిన బ్లాగర్స్ ఎవరో ఈ పని చేసి ఉంటారు. అయినా "Inoreader" ఎవరిదైనా  బ్లాగ్ కానీ website కానీ add చేసే ముందు వాళ్ళ permission తీసుకునే అవసరం లేదా?? "RSS Feed" ఉంది కాబట్టి మీ బ్లాగ్ ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు అని ఈ website వాళ్ళ అభిప్రాయమట. బ్లాగులకి విజిటర్స్ కౌంట్ పెరగకుండా చేయటానికి, ఎవరు మన బ్లాగులో ఏమి చదివారో తెలియకుండా ఉండటానికి,మన బ్లాగ్ లో కాపీ చేయటం కుదరకుండా సెట్టింగ్స్ పెట్టుకుంటే అక్కడ కాపీ చేసుకోవటానికి ఈ inoreader బాగా ఉపయోగపడుతుంది. చాలా టెక్నాలజీల్లాగానే ఇది కూడా మంచికంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడేలా అనిపిస్తుంది.

ఇప్పుడు నేనేం చేయాలి ? సరేలే అని వదిలేయాలి లేదా బ్లాగు ఎవరికీ కనపడకుండా Hide చేయాలి...
బ్లాగు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయన్నమాట.


Related Posts Plugin for WordPress, Blogger...