మా రమ్య పెళ్ళి ముచ్చట్లు... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, నవంబర్ 2018, గురువారం
24, నవంబర్ 2012, శనివారం
మా చిన్నిప్రపంచానికి యువరాజు ...
అక్టోబర్ -22- 2012 దుర్గాష్టమి... అందరూ దుర్గాష్టమి పూజల సందడిలో ఉంటే మాకు మాత్రం విపరీతమైన టెన్షన్.మా చెల్లికి డెలివరీ టైం ఉదయం నుండి మొదలైన మా టెన్షన్ సాయంత్రం 5.24 కు మా చేతిలోకి చిన్నారి బాబును అందుకుని,ఆ తర్వాత మా చెల్లి క్షేమంగా మాట్లాడటం చూసేదాకా కంటిన్యూ అయ్యింది..కొన్ని పరిస్థితుల్లో ఎంత తప్పదు అని తెలిసినా భయపడటం,బాధపడటం మానవ సహజం అనుకుంటాను.
బాబును చూడగానే అప్పటిదాకా మేము పడిన బాధ,భయం అన్నీ మాయం అయినట్లయింది ..బాబు నాన్నగారికి,బంధువులకి అందరికీ విషయం చెప్పేసి,అందరి అభినందనలు అందుకుని, అప్పటి నుండి ఇప్పటిదాకా చెల్లిని,బాబుని కేర్ తీసుకునే విషయంలో నెలరోజులు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు.నా చిన్ని ప్రపంచానికి యువరాజు,
మా చెల్లి,మరిది గారి ప్రేమకు ప్రతిరూపం, మా బుజ్జి బుజ్జాయి,చిన్నారి చందమామ రాకతో మా బొమ్మరిల్లు ఆనందాల హరివిల్లుగా మారిపోయింది...
మా చెల్లి,మరిది గారి ప్రేమకు ప్రతిరూపం, మా బుజ్జి బుజ్జాయి,చిన్నారి చందమామ రాకతో మా బొమ్మరిల్లు ఆనందాల హరివిల్లుగా మారిపోయింది...
వింత వింత హావభావాలతో, తన చిన్ని చిన్ని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మా చిన్నారి పేరు "జయాదిత్య". జన్మనక్షత్రం ప్రకారం ఆ పేరు పెట్టాము.శివుడికి ఇష్టమైన సోమవారం,అమ్మవారి దుర్గాష్టమి రోజున శివపార్వతుల కానుకగా వచ్చిన మా బుజ్జాయికి నేను పెట్టుకున్న ముద్దు పేరు కుమార స్వామి.. ఇంకా ఎన్నెన్నో ముద్దు పేర్లు.. ఎవరికి ఎప్పుడు ఎలా నచ్చితే అలా పిలవటం :) ఇవండీ ప్రస్తుతానికి మా బుజ్జి కుమారస్వామి కబుర్లు.. ఇంకా మరెన్నో కబుర్లున్నాయి..
మా చిన్నారి జయాదిత్యను భగవంతుడు తన చల్లని ఆశీస్సులతో కాపాడి,ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో దీవించాలని ప్రార్ధిస్తూ.. అమ్మా,నాన్నలయిన మా చెల్లి,మరిది గారు భద్ర,రమ్య లకు
నా చిన్నిప్రపంచం తరపున హృదయపూర్వక అభినందనలు...
మా చిన్నారి "జయాదిత్య" కు "నా చిన్నిప్రపంచం" ఫ్రెండ్స్ కూడా
మీ దీవెనలను అందించమని కోరుకుంటున్నాను.
Dear Ramya, Bhadra
Congratulations on one of your best moments in life.
Congratulations on one of your best moments in life.
May this little parcel of joy bring
prosperity, joy and luck to you.
May your new little one grow strong,
wealthy and wise.
Congratulations for the new baby!
చిన్ని తండ్రీ నిను చూడగా
వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళూ చూస్తుండగా
నీకు దిష్టెంత దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా..
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా..
లేబుళ్లు:
నేను... నా కుటుంబం,
మా ఇల్లు,
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
28, నవంబర్ 2011, సోమవారం
Art By : రమ్యాభద్ర...

మా చెల్లి రమ్య చిన్నప్పటి నుండి చాలా టాలెంటెడ్ .
మంచి బొమ్మలు గీస్తుంది,పైటింగ్స్ వేస్తుంది..స్కూల్ డేస్ లో కూడా
ఎక్కడ పైంటింగ్,డ్రాయింగ్ పోటీలు జరిగినా తనే విన్ అయ్యేది.
ఇంట్లో వాళ్ళందరం తన టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్లము..
నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా తన పైటింగ్స్ కి కావలసినవన్నీ తెచ్చివ్వాల్సిందే..
పెళ్ళైన తర్వాత కూడా తన హాబీస్ ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని మేమందరం అనుకునే వాళ్లము.
దానికి తగినట్లే తన హజ్బండ్ మా చెల్లి ఆర్ట్ ని ,టాలెంట్స్ ని మాకంటే ఎక్కువగా ఇష్టపడతారు..
మేము ఎలాగైతే తనకి అవసరమైనవన్నీ తెచ్చి ప్రోత్సహిస్తామో మా మరిదిగారు భద్ర కూడా అలాగే చేస్తారు..
తన అభిరుచుల్ని గుర్తించి,గౌరవించి,ప్రోత్సహించే భర్త దొరకటాన్ని
మించిన అదృష్టం ఏ అమ్మాయికైనా ఏముంటుంది..
మా చెల్లికి బాపు బొమ్మలు ఇష్టమని "బాపు బొమ్మల హరివిల్లు" బుక్ గిఫ్ట్ గా ఇచ్చారు ..
అందులో ఈ వినాయకుడి బొమ్మ మా చెల్లి ఆయిల్ పైంట్స్ తో వేసింది..
మా రమ్య చార్ట్ మీద వేసిన బొమ్మను ఎంతో అపురూపంగా ఫ్రేం చేయించారు తన హజ్బండ్ ఫ్రేం చేయించటమే కాదు ఇంటికి ఎవరు వచ్చినా ఇది మా రమ్య చేసింది అని ఎంతో గొప్పగా చెప్తారు..
వూల్ తో చార్ట్ మీద చేసే మాటీ వర్క్.మా అమ్మ మా చిన్నప్పుడు మాటీ వర్క్ చాలా బాగా చేసేది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను.ఇప్పుడు చెల్లి సొంతగా బుక్ చూసి నేర్చుకుని తయారు చేసింది.
దాన్ని కూడా ఫ్రేం చేయించి హాల్ లో డెకరేట్ చేశారు
తనని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న తన బెటర్ హాఫ్ కి మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ ఈ టీషర్ట్.వైట్ టీ షర్ట్ మీద ఈ బాపు బొమ్మలు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దింది.
ఈ షర్ట్ చూసి అందరు మెచ్చుకుంటే తననే మెచ్చుకున్నంత ఆనంద పడతారు మా మరిదిగారు.



లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
2, జులై 2011, శనివారం
మా ముద్దు రాధమ్మ ...
జూన్ 6 నుండి 30 దాక క్షణం కూడా తీరిక లేకుండా మా చెల్లి పెళ్లి పనుల్లో మునిగిపోయాము.
మేము అపురూపంగా పెంచుకున్న మా బంగారు బొమ్మ మా చెల్లి పెళ్లి మేమంతా కోరుకున్నట్లే
సంతోషంగా సందడిగా జరిగింది..
పెళ్లి బట్టలు,షాపింగ్ తో మొదలైన మా చెల్లి పెళ్లిసందడి కొత్త పెళ్లి కూతురి సారె పెట్టి ,
అత్తింటికి పంపించటంతో పెళ్లిఘట్టం పూర్తి అయ్యి కొత్తకాపురం మొదలయ్యింది.
శ్రీకారం చుట్టుకున్న వాళ్ళ పెళ్ళిపుస్తకం
కొత్త జీవితంగా ఆకారం దాల్చింది..
అడుగడుగున తొలి పలుకులను గుర్తు చేసుకుంటూ
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకుంటూ
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోవాలని,వాళ్ళ కొత్తకాపురం నవ్వుల నదిలో పువ్వులపడవలాగా నిత్యనూతనంగా సాగిపోవాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్ధిస్తున్నాను..
All The Best Ramya Bhadra
మా ముద్దు రాధమ్మ రాగాలే
లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
22, జూన్ 2011, బుధవారం
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
మాచెల్లి నిశ్చితార్ధం రోజుకి తనది యు కట్ హెయిర్ స్టైల్.
అప్పటికి అలాగే ఉంచేసి పెళ్లప్పటికి కొంచెం జుట్టు పెంచి దానికి మళ్ళీ సవరం యాడ్ చేసి మల్లెపూల జడ వేశాము..
అలా మా చెల్లికి మల్లెపూల జడ వేయించాలన్న మా అమ్మ కోరిక ,కోడలిని జడతో చూడాలన్నవాళ్ళ
అత్తగారి కోరికా రెండూ తీరాయన్నమాట..
మా రమ్యని పెళ్లికూతురిని చేసిన మొదటి రోజు,రెండో రోజు మల్లెపూలతో నేనే తనకి జడ వేసాను..
తనకి తెచ్చిన రెడీమేడ్ పూలజడకన్నా నేను వేసిన జడే తనకి నచ్చిందట..



మా చెల్లికి పెళ్ళిలో చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ గోరింటాకు దగ్గరనుండి పారాణి దాకా అన్నీనేనే
నాసొంతగా చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది..
తను ఎప్పుడైనా ఈ ఫొటోస్, వీడియో చూసుకున్నప్పుడు ఇవన్నీ మా అక్కే నాకు చేసింది అని గుర్తుకువస్తుంది కదా...
ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద పనులు కాకపోయినా ఒక్కోసారి చిన్నిచిన్ని విషయాలే చాలా గొప్పగా అనిపిస్తాయి
అలాగే నేను చేసిన ఈ చిన్ని పనులు నాకు కూడా ఎంతో సంతోషాన్ని,ఆనందాన్ని కలిగించాయి...

అప్పటికి అలాగే ఉంచేసి పెళ్లప్పటికి కొంచెం జుట్టు పెంచి దానికి మళ్ళీ సవరం యాడ్ చేసి మల్లెపూల జడ వేశాము..
అలా మా చెల్లికి మల్లెపూల జడ వేయించాలన్న మా అమ్మ కోరిక ,కోడలిని జడతో చూడాలన్నవాళ్ళ
అత్తగారి కోరికా రెండూ తీరాయన్నమాట..
మా రమ్యని పెళ్లికూతురిని చేసిన మొదటి రోజు,రెండో రోజు మల్లెపూలతో నేనే తనకి జడ వేసాను..
తనకి తెచ్చిన రెడీమేడ్ పూలజడకన్నా నేను వేసిన జడే తనకి నచ్చిందట..

మా చెల్లికి నేను పెట్టిన పారాణి.

మా చెల్లికి పెళ్ళిలో చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ గోరింటాకు దగ్గరనుండి పారాణి దాకా అన్నీనేనే
నాసొంతగా చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది..
తను ఎప్పుడైనా ఈ ఫొటోస్, వీడియో చూసుకున్నప్పుడు ఇవన్నీ మా అక్కే నాకు చేసింది అని గుర్తుకువస్తుంది కదా...
ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద పనులు కాకపోయినా ఒక్కోసారి చిన్నిచిన్ని విషయాలే చాలా గొప్పగా అనిపిస్తాయి
అలాగే నేను చేసిన ఈ చిన్ని పనులు నాకు కూడా ఎంతో సంతోషాన్ని,ఆనందాన్ని కలిగించాయి...
My Dear Sweet Sister Ramya And Bhadra
Wishing you a Wonderful Life
And A Future Filled With
Joys And Happy Surprises
Wishing you a Wonderful Life
And A Future Filled With
Joys And Happy Surprises
లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
20, జూన్ 2011, సోమవారం
గోరింటతో ముగ్గులు పెట్టి...

మా చెల్లి ఎప్పుడూ నాకు చాలా బాగా మెహేంది పెట్టేది కోన్ తో కానీ ఎప్పుడైనా నాకు గోరింటాకు పెట్టక్కా
అని తను అడిగితే నాకు మాత్రం అలా పెట్టటం రాదు అనేదాన్ని...
కానీ నాకు ఆనందం,ఆశ్చర్యం కలిగించిన విషయం మా చెల్లి నిశ్చితార్ధం రోజు గోరింటాకు పెట్టాలి
ఎలాగా అని ఆలోచిస్తూ సరే నేనే ట్రై చేస్తాను అంటూ మొదలుపెట్టాను..
ఎంత బాగా కుదిరిందంటే గోరింటాకు పెట్టిన తర్వాత పండిన ఆ ముద్దు ముద్దు చేతుల్ని చూసి నేనే
ఆశ్చర్యపోయాను ఇంతబాగా నేను వేసానా అని..
అదే అంటారేమో దేవుడు ఎప్పుడు ఏది అవసరమో అది అప్పటికప్పుడు మనకి అందిస్తాడు అని..
అలాగే పెళ్ళికి కూడా నేనే మా చెల్లికి గోరింటాకు పెట్టాను..మెహేంది పెట్టేవాళ్ళతో పెట్టిద్దాము అనుకున్నా
మా చెల్లి నువ్వే పెట్టక్క అని నాతోనే గోరింటాకు పెట్టించుకుంది...
మా చెల్లి పెళ్ళికి నా సొంతగా నేను గోరింటాకు పెట్టటం నాకు చాలా సంతోషం అనిపించింది..
నేను పెట్టిన గోరింటాకు అందరికీ నచ్చింది..మీరు కూడా చూడండి..

లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
18, జూన్ 2011, శనివారం
Congratulations To A Lovely Couple
Remember Your Yesterdays...
Plan Your Tomorrows...
And Celebrate Your Today!
Your EveryDay Be Blessed
With A Shining Gift Of Love!
Congratulations
To A Lovely Couple
Plan Your Tomorrows...
And Celebrate Your Today!
Your EveryDay Be Blessed
With A Shining Gift Of Love!
Congratulations
To A Lovely Couple
Happy Wedding My Dear Little Sister Ramya And Bhadra I wish both of u A Very Happy Married life
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము
ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు
మనసా మళ్ళీ మళ్ళీ చూశా గిల్లి గిల్లి చూశా ...జరిగింది నమ్మేసా..
జతగా నాతో నిన్నే చూశా నీతో నన్నేచూశా ... నను నీకు వదిలేశా
పైలోకంలో వాడు ఎపుడో ముడి వేసాడు
విడిపోదే ... విడిపోదే
నిన్నేనిన్నే అల్లుకొని,కుసుమించే గంధం నేనవని
నన్నేనీలో కలుపుకొని, కొలువుంచే మంత్రం నేనవనీ
ప్రతిపూట పువ్వై పుడతా,నిన్నేచేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనవుతా,నువ్వే నెలవుతీరేలా
నూరేళ్ళు నన్నునీ నివేదనవని
నిన్నేనిన్నే అల్లుకొని, కుసుమించే గంధంనేనవని
దేవత నీవే నా దేవత నీవే కనుపాపగ కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములె..
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుల కలయిక కద
ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము
ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు
మనసా మళ్ళీ మళ్ళీ చూశా గిల్లి గిల్లి చూశా ...జరిగింది నమ్మేసా..
జతగా నాతో నిన్నే చూశా నీతో నన్నేచూశా ... నను నీకు వదిలేశా
పైలోకంలో వాడు ఎపుడో ముడి వేసాడు
విడిపోదే ... విడిపోదే
నిన్నేనిన్నే అల్లుకొని,కుసుమించే గంధం నేనవని
నన్నేనీలో కలుపుకొని, కొలువుంచే మంత్రం నేనవనీ
ప్రతిపూట పువ్వై పుడతా,నిన్నేచేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనవుతా,నువ్వే నెలవుతీరేలా
నూరేళ్ళు నన్నునీ నివేదనవని
నిన్నేనిన్నే అల్లుకొని, కుసుమించే గంధంనేనవని
దేవత నీవే నా దేవత నీవే కనుపాపగ కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములె..
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుల కలయిక కద

లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
రమ్య వెడ్స్ భద్ర

మా చిన్నారి చెల్లి రమ్య పెళ్లి కూతురయ్యింది...
జనవరిలో నిశ్చితార్ధం జరిగిన మాచెల్లి రమ్య వివాహం 09-06-2011 న తిరుమలలో
పచ్చనిపందిరిలో వేదమంత్రాల సాక్షిగా దేవుని దీవెనలతో..పెద్దల మరియు బంధుమిత్రుల
ఆశీస్సులు,అభినందనలతో కన్నులపండుగగా,సంతోషంగా జరిగింది..
ఇప్పటిదాకా మా ఇంటి యువరాణి ఇప్పుడు తన ఇంటి మహారాణి అయ్యింది..
భార్యాభర్తలుగా కొత్తజీవితాన్ని ప్రారంభించిన మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర
మీ దాంపత్య జీవితం ఎప్పుడు సంతోషమయం కావాలని, ఒకరికి ఒకరు అన్నివేళలా తోడునీడగా
సాగిపోవాలని కోరుకుంటూ....
మీకు మా హృదయపూర్వక వివాహమహోత్సవ శుభాకాంక్షలు..
శతమానంభవతి శతమానంభవతి
శతమానంభవతి మీకు శతమానంభవతి
ఒక ఒంట్లోనె కాపురమున్న శివుడూ పార్వతీ..
శతమానంభవతి మీకు శతమానంభవతి
తనువులు రెండూ తామొకటైనా సీతారాములకీ
శతమానంభవతి మీకు శతమానంభవతి
నూరేళ్ళ మీ నిత్య కళ్యాణ హేలా..
శతమానంభవతి మీకు శతమానంభవతి
శతమానంభవతి మీకు శతమానంభవతి
ఒక ఒంట్లోనె కాపురమున్న శివుడూ పార్వతీ..
శతమానంభవతి మీకు శతమానంభవతి
తనువులు రెండూ తామొకటైనా సీతారాములకీ
శతమానంభవతి మీకు శతమానంభవతి
నూరేళ్ళ మీ నిత్య కళ్యాణ హేలా..
శతమానంభవతి మీకు శతమానంభవతి
లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...
5, ఫిబ్రవరి 2011, శనివారం
మా చెల్లి నిశ్చితార్ధం ....
ఈ నూతన సంవత్సరంలొ,నా చిన్ని ప్రపంచంలో జరిగిన సంతోషకరమైన సంఘటన నా చిన్నారి చెల్లెలు రమ్య నిశ్చితార్ధం …మా బంధుమిత్రులు,స్నేహితులు ఆహ్వానితుల మధ్య మా రమ్య నిశ్చితార్ధం ఎంతో వైభవంగా, ఆహ్లాదంగా, సంతోషంగా జరిగింది.
నేను,మా తమ్ముడి తర్వాత చాలా గ్యాప్ తర్వాత పుట్టిన మా చిన్ని రమ్య ఇంకా మా కళ్ళకు చిన్నపిల్లలాగానె కనిపిస్తుంది.
I AM A GOOD GIRL అంటూ అందరినీ తన అల్లరితో ముద్దుముద్దుగా విసిగించే మా స్వీటీ పెళ్ళికూతురయ్యింది.
నిశ్చితార్ధం పెళ్లికూతురిగా మా చెల్లిని చూస్తున్న మాకు మేము ఎత్తుకుని మా స్కూల్ కి,మేము ఎక్కడికి వెల్తే అక్కడికి మా వెంట తీసుకుని వెళ్ళి ఆడుకునే రోజులే మాకు గుర్తొస్తున్నాయి…
మా రమ్య కాబోయె శ్రీవారు,మా మరిది గారు,నా చిన్ని ప్రపంచానికి కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త వ్యక్తి…
వీర భద్ర కుమార్ .. .
మా చిన్నారి రమ్య మా అందరికీ ఎంతో గారాబం....తన అలవాట్లు హాబీస్ అన్నీ ఎంతో వెరైటీ..
తన హాబీస్,తన అలవాట్లను ఇష్టపడే వ్యక్తి తనకి భర్తగా రావాలని,మేమందరం ఎలాంటి వ్యక్తి తనకి భర్తగా రావాలి అనుకున్నామో అలాంటి వ్యక్తే తనకి భర్తగా రావటం నిజంగా మా చెల్లి అద్రుష్టం.
మా రమ్య అత్తగారు మా చెల్లి పట్ల చూపించె ప్రేమాభిమానాలు,నా కోడలు అని మా చెల్లిని చూసి సంతోషించడం,వాళ్ళ పెద్దలు మా పెద్దల పట్ల చూపించె గౌరవం ఇవి చాలు మా చెల్లి జీవితం వాళ్ళ కుటుంబంలో సంతోషంగా వుంటుంది అనుకోవడానికి.
అలవాటు లేని చీర కట్టులో మా చెల్లి రమ్య వేదిక ఎక్కడానికి ఇబ్బంది పడుతుందని నేను రెండు సార్లు చేయి పట్టుకుని ఎక్కించాను…మరో సారి కూడా అలాగే నేను తనని పట్టుకోవాలని వెళ్ళేలోపే మా మరిది గారు తన చెయ్యి పట్టుకుని ఒక్క క్షణం లొ వేదిక మీదకి ఎక్కించడం చూసి,ఆ క్షణం లో మాకు చాలా సంతోషంగా అనిపించింది
ఇదంతా వెనకనుండి చూస్తున్న నాకు, నా తమ్ముడికి అనిపించింది ఇక నుండి మా అవసరం మా చెల్లికి లేదు అని.
మా మరిది గారు మా చెల్లిని అపురూపంగా చూసుకుంటారని…
భార్యని అమితంగా ఇష్టపడి,తన ఇష్టాఇష్టాలను గౌరవించే వ్యక్తి భర్త కావటం ఏ ఆడపిల్లకైనా వరమే కదా..
ఎంతో ఆనందంగా మంచి శుభకార్యం మొదలైన ఈ కొత్త సంవత్సరం నా చిన్నిప్రపంచానికి సకల సుభాలను కలిగించాలని త్వరలోనే మా చెల్లి పెళ్ళి కబుర్లు కూడా చెప్పుకోవాలని కోరుకుంటూ…
ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన రమ్య,భద్ర మీరిద్దరూ ఎప్పటికీ
సుఖసంతోషాలతో ప్రతి అడుగులో ఒకరికి ఒకరు తోడుగా,మీ జీవితమనే పూలతోటలో ఆనందాల పంట పండించుకోవాలని మనసారా దీవిస్త్తూ…
మీ మన నా చిన్ని ప్రపంచం…
సుఖసంతోషాలతో ప్రతి అడుగులో ఒకరికి ఒకరు తోడుగా,మీ జీవితమనే పూలతోటలో ఆనందాల పంట పండించుకోవాలని మనసారా దీవిస్త్తూ…
మీ మన నా చిన్ని ప్రపంచం…

లేబుళ్లు:
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు...














