పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, మే 2012, ఆదివారం

నా ప్రియనేస్తం...


మానవ సంబంధాలు స్వార్ధపూరితమే అయినా కొన్ని బంధాలు జీవితాంతం తోడూ,నీడగా జీవితాన్ని నందనవనం చేస్తాయి జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం.మనసును బాధించే కష్టమైనా, ఆహ్లాదపరిచే సంతోషమైనా పంచుకునే ఆత్మీయ నేస్తం ఒకరు తమకంటూ ఉండాలని ప్రతి మనిషీ కోరుకుంటారు ...అలాంటి ఆత్మీయనేస్తమే 
"నా ప్రియనేస్తం"
 నా ప్రియ నేస్తం....
ప్రపంచం అంతా దూరం అయినా...,
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే  
నిజమైన స్నేహం...
 
ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను” 
ఒకరికొకరం...,
మన స్నేహమే మన ప్రపంచం

“నువ్వు” అనే ఈ రెండక్షరాలే 
నా చేయి పట్టి నడిపిస్తుంటే
"
నువ్వు" అనే ఈ రెండక్షరాలే 
నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే
 
" నువ్వు"అనే ఈ రెండక్షరాలే 
నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే

ఇంతకు ముందెపుడూ నేనెరుగని 

మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....

నా ప్రతి అడుగులో 

నువ్వు తోడు వున్నావనే భావన 
ఎంతో ఊరటనిస్తుంటే 

సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని 
నాకు చవిచూపిస్తుంటే

నిన్నటిదాకా కదలనని మొరాయించిన కాలం 
నీ ఆగమనంతో వేగంగా
యుగాలు కూడా క్షణాల్లా కరిగి పోతుంటే ...
 

నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా 
నా గుండెల్లో దాచుకొని....,

ఏవేవో అంతులేని ఆలోచనలతో 

సతమతమవుతున్న నా మనసుకి చెప్తున్నా... 
ఇదిగో "నీ ప్రియ నేస్తం" అని


నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
సినిమా - అంతం
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - సిరివెన్నెల
సింగర్ - S.P.బాలు


15, మే 2012, మంగళవారం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం...


"వెలుగు పధకం" మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు ప్రవేశ పెట్టిన పధకం. ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద,పేద మహిళలను లక్షాధికారుల్ని చేయటం.. మహిళలను స్వయం సహాయక సంఘాలుగా, "సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHG)" గా ఏర్పాటు చేసి,వాళ్లతో డబ్బులు పొదుపు చేయించి,కొంత బాంక్ ల ద్వారా అప్పు ఇప్పించి ఆ డబ్బుతో మహిళలకు స్వయం ఉపాధి కల్పించటం ఈ పధకం లక్ష్యం. దీని కోసం జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి దాకా సిబ్బందిని నియమించి వాళ్ళ ద్వారా ఈ పధకాన్ని అమలు చేసే వాళ్ళు..కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పధకం పేరు "ఇందిరా క్రాంతి పధం" గా మార్చారు.

ఇప్పుడు ఇంతకీ ఈ "వెలుగు పధకం" గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ప్రత్యేకతలు వున్నాయి...
మహిళలను మోటివేట్ చేస్తూ,వాళ్ళు సాధికారత సాధించేలా ప్రోత్సహించే పనిలో భాగం గా వాళ్లకి కొన్ని trainings నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ లో మొదటిది వాళ్లకు ఒక ప్రార్ధనా గీతం వుంటుంది. ఆ పాటను ఈ ప్రాజెక్ట్ CEO స్వయంగా రచించి,రూపకల్పన చేశారట. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు ఎంతవరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారో, ఎంతమంది మహిళలు లక్షాధికారులు అయ్యారో తెలియదు కానీ... నాకు మాత్రం "వెలుగు ప్రార్ధనాగీతం "గా వాళ్ళు పిలుచుకునే ఇన్స్పిరేషన్ సాంగ్ చాలా నచ్చింది..

ఈ పాట నాకు ఈ వెలుగు ప్రాజెక్ట్ లో APM గా వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది..
నా చిన్ని ప్రపంచం లో "ఇన్స్పిరేషన్ సాంగ్స్ కలెక్షన్" లో యాడ్ చేయాలనిపించింది..


జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం
జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

గగనమెంత వురిమినా గిరికి చలనముండునా
గంగ పొంగిపొరలినా నేల భీతి చెందునా
ఆత్మబలం కూడగట్టి ... ఆకశాన్ని వంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా
చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా
ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

పేదరికం కసిరినా పెనుచీకటి ముసిరినా
వేలజనం మేలుకుంటే వేకువ రాకుండునా
అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం14, మే 2012, సోమవారం

పవన్ ......... ఆనందం అల్లరి చేస్తే నీలా ఉంటుందే ...


"పవన్ కళ్యాణ్" మా అమ్మతో సహా మా ఫామిలీ మొత్తానికి అభిమాన నటుడు,ముఖ్యంగా మా చెల్లి రమ్య పవన్ కి పెద్ద ఫ్యాన్..పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే సినిమా హాల్ లోనే చూడాలన్నది మా ఖచ్చితమైన నిర్ణయం..అలాగే చూసే వాళ్ళం కూడా.. కానీ ఖుషి తర్వాత పవన్ సినిమా ఒక్కటి కూడా సరిగా హిట్ కాకపోవటం పవన్ కి ఎంత బాధ కలిగించిందో చెప్పలేను కానీ మాకు మాత్రం చాలా బాధ అనిపించేది.ముఖ్యంగా పంజా సినిమా మరీ నిరాశ కలిగించింది..


పవన్
కళ్యాణ్ ఇన్నాళ్ళ ఓటమిని మర్చిపోయేలా చేసిన సినిమా "గబ్బర్ సింగ్" ..ఆడియో వచ్చినప్పటి నుంచే సినిమా కోసం వెయిట్ చేసిన అభిమానులు ఆనందించేలా వుంది ఈ సినిమా విజయం ..కేవలం పవన్ అభిమానులే కాదు... తమ అభిమాన హీరోల కోసమే మాట్లాడటం కాకుండా, నిజంగా సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు కూడా వున్నారు..

ఇంక
మేమందరం సినిమా వచ్చినప్పటి నుండి అదే పనిలో ఉన్నాము.. మా చెల్లి వాళ్ళ ఫామిలీ,తమ్ముడు వాళ్ళు అందరూ రిలీజ్ రోజే చూసేశారు,మేము ఈ రోజే చూశాము.. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా,విసుగు లేకుండా గడిచిపోయింది.. దేవిశ్రీ సంగీతం చాలా బాగుంది. స్టోరీ అంతగా లేకపోయినా entertainment కోసం ఈ సినిమా చూడొచ్చు... ఇంక శ్రుతిహాసన్ కి కూడా ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో తన కెరీర్ లో...


పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్,ఖుషి తర్వాత నాకు చాలా నచ్చిన మూవీ గబ్బర్ సింగ్..అప్పట్లో ఖుషీ కూడా ఇలాగే మే నెలలో చూసాము..మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మాకు...
"ఆకాశం అమ్మాయైతే" పాట నాకు చాలా నచ్చింది.. ఇంక "కెవ్వు కేక" పాట మా ఇంట్లో మా బుడుగులందరికీ తెగ నచ్చేసింది.. పాట టీవీలో వస్తుంటే , ఎక్కడ వున్నా పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకొచ్చేస్తున్నారు.. ""
ఏమి చేస్తాం "జీ టీవీ ఆట - 2" ప్రభావం అనుకుంటా"...

"మేము ట్రెండ్ ఫాలో అవ్వం,సెట్ చేస్తాం" అంటూ,వాళ్ళు అల్లరి చేస్తూ ప్రేక్షకులతో కూడా ఆనందంగా అల్లరి చేయించిన పవన్ & టీం వేసవికి సాధించిన విజయానికి అభినందిస్తూ...
నాకు నచ్చిన ఈ పాట ...

ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే ... నీలా ఉంటుందే..
ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే ... నాలా ఉంటుందే
13, మే 2012, ఆదివారం

అమ్మ లాలి చాలునే ... నిన్ను కమ్మంగ లాలించునే...


"అమ్మవంటిది ... అంతమంచిదిఅమ్మఒక్కటే"
-- ఆత్రేయ


అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
-- దాశరథి. కృష్ణమాచార్య


"అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే "
-- సి. నారాయణరెడ్డి


పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
--వేటూరి. సుందరరామమూర్తి


ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
-- సిరివెన్నెల. సీతారామశాస్త్రి


పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ
-- చంద్రబోస్


ఇవన్నీఅమ్మ గురించి గొప్పగొప్ప రచయితలూ, కవులు చెప్పినమాటలు,
గొప్పవాళ్ళ
మాటల్లోనేకాదు...
ప్రతీ మనిషి మనసులోని మాట "అమ్మకనిపించే ... కనిపెంచేదేవత" అని.


అమ్మ నేను సంతోషిస్తే తను చిరునవ్వవుతుంది...
నా కష్టంలో తను కన్నీరవుతుంది..
నా విజయం లో తానే విజేతగా సంబరపడుతుంది...

నా
ఓటమిలో ఓదార్పవుతుంది ..
నా సమస్యకు పరిష్కారమవుతుంది..
నా అలకను తీర్చే అక్షయపాత్ర అవుతుంది...

నా
చుట్టూ ఆవరించిన శూన్యం నన్ను నిస్తేజం చేసినప్పుడు,
నిస్సహాయంగా నిలిచినప్పుడు, శూన్యమనే చీకటిని తొలగించే
కాంతి పుంజంలా అమ్మమాట, అమ్మ చెప్పే ధైర్యం
నన్ను చైతన్యవంతం చేస్తుంది.


మనిషికి దేవుడు ఇచ్చిన వరం అమ్మప్రేమ.. ఆవరాన్ని పొందిన ప్రతి మనిషీ అదృష్టవంతులే..
అమ్మప్రేమను గురించి "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" పాట నాకు చాలా ఇష్టం..
బిడ్డపైన అమ్మకు వుండే ప్రేమాభిమానాలను తెలుపుతూ అమ్మపాడే పాట ఇది..

అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతూ, కధలు చెప్పమని ముద్దుగా అల్లరిచేసే చిన్నారి అల్లరికి సంతోషిస్తూ..
ఎంతో ముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పెళ్లై అత్తవారింటికి వెళ్తే తనను చూడకుండా ఎలావుండగలననే కన్నతల్లి బాధను వ్యక్తపరుస్తూ...
నువ్వు ఎక్కడవున్నా ఆనందంగా వుండాలి,కలతలు,కష్టాలు లేకుండా నీకలలన్నీ పండి నీ జీవితం సంతోషంగా వుండాలని మనసారా బిడ్డను దీవిస్తూ ...

అమ్మ మనసును ప్రతిబింబించే ఈ పాట రచనా,సంగీతం "పాలగుమ్మివిశ్వనాధం" గారు..
ఈ పాటను "శ్రీమతి వేదవతీ ప్రభాకర్" గారు పాడారు..
నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మకోసం , అమ్మలందరికోసం..

మాతృదినోత్సవ
శుభాకాంక్షలు.


అమ్మదొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

అమ్మ
దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ ...
నా కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ

గలగలమని నవ్వుతు కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

కథ చెప్పేదాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే

గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే ... నాకు బెంగ10, మే 2012, గురువారం

మా పావురాల ప్రేమ ఊసులు ...


మా ఇంటి దగ్గర పావురాలు మాకు అతిధులు..మేము పిలవకపోయినా వచ్చి ఇంటి చుట్టూ సందడి చేస్తుంటాయి.ఈ ఎండకి మా బాల్కనీ,స్లాబ్ గట్లు ,విండో లు వాటికి స్థావరాలు.. ఆ పావురాల్ని చూడటం, ఫోటోలు తీసుకోవటం నాకు సరదా ఐతే... ఇల్లు చుట్టు పక్కలంతా శుభ్రం చేయటానికి మా భారతమ్మకు మహా కష్టం..
ఏంటమ్మా వాటిని కొట్టనివ్వవు ఇల్లంతా పాడు చేస్తుంటే అని తెగ బాధ పడిపోతుంది..

ఒక పావురం ముందుగానే వచ్చి మరో పావురం కోసం ఎదురు చూస్తూ కూర్చుని, తను ఎదురుచూస్తున్న పావురం రాగానే ముచ్చట్లు,ఆలస్యంగా వచ్చిందని అలకలు..
ఎప్పుడూ ప్రేమికులకు ప్రేమ సందేశాల్ని అందించే పావురాలు తమ మనసులోని ప్రేమ గురించి చెప్పుకుంటున్న ఊసులు ... ఫొటోలతో పాటూ నాకు"నచ్చిన" ... "వచ్చిన కాదు" :) కవిత కూడా ...

మా పావురం ఎదురుచూపులు - కవిత్వాలు


ఎన్నాళ్ళు ప్రియా నా ఎదురుచూపులు
మనసూ మనసుకు మధ్య మరచిపోలేని మమతానురాగాలు
మరువగలవా ప్రియా ?? మరపురాని సంఘటనలు
ఎందుకు ప్రియా ఆకాశానివై అందనంటావు??


ఎండమావివై దొరకనంటావు ...
పాద రసమై పట్టుబడనంటావు...
కలువపువ్వువై నన్ను కవ్వించరావా ...
మల్లె తీగవై నన్ను అల్లుకోవా?


కంటిలో కనుపాపలా నాలో కలిసిపోవా
చీకటిలో చిరు వెలుగువై రావా..
చినుకులా నా మీద పడి నా కౌగిలిలో కరిగిపోవా
కల అనుకున్న నా జీవితాన్ని నిజం చేయలేవా !!!


6, మే 2012, ఆదివారం

అమీర్ ఖాన్ - సత్యమేవ జయతే..


దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ,ప్రజల్లో సమాజం పట్ల అవగాహనను కలిగించి,వ్యవస్థ లోని లోపాలను తెలియచేసేలా ఒక మంచి రియాలిటీ షో "అమీర్ ఖాన్ - సత్యమేవ జయతే"...హిందీ,తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ...ఇలా అన్ని భాషల్లో 'సత్యమేవ జయతే' కార్యక్రమం మే 6 నుండి ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది..

ఈ కార్యక్రమం కోసం అమీర్ ఖాన్ మన దేశమంతా తిరుగుతూ వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారట.ఈ ప్రోగ్రాం కోసం తయారు చేసిన టైటిల్ సాంగ్ చాలా బాగుంది. నాకు అమీర్ ఖాన్ ఫేవరేట్ ఆర్టిస్ట్,
ఇప్పుడు అమీర్ చేస్తున్నది మన దేశానికి,ప్రజలకి సంబంధించిన ఒక మంచి కార్యక్రమం "మన జీవితం బాగుంది కదా ఇంక ఎదుటి వాళ్ళ తో మనకెందుకు" అని అనుకోకుండా ,నేను కూడా ఈ సమాజం లో ఒక భాగమే కాబట్టి,నా వంతుగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ... మనుషుల మనస్సులో,ఆలోచనల్లో కొంతైనా మార్పు తీసుకురావాలన్న ఒక సదుద్దేశ్యంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్తున్నారు అమీర్ ఖాన్..

అమీర్ ఖాన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడతాం కాబట్టి ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ..
ఇప్పటి నుండి ప్రతి వారం ఈ "సత్యమేవ జయతే" షో చూడాలని నిర్ణయించుకున్నాను.

Aamir's Satyamev Jayate
A Love Song To India


నీ సౌరభం సమ్మోహనం ... నీ తోటిదే నా జీవితం
నా హృదయమూ నీకంకితం
వేరెవరికీ అది దుర్లభం

మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము

నీవే నేర్పావూ ... నీ జాతికి
అర్ధం
నీ వరములో దాచానూ ... నా జీవిత పరమార్ధం
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా ... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే

నీ కాంతిలో నీ క్రాంతిలో ... నే తప్పనూ దారెన్నడూ
నా యత్నమూ ... ధృఢ చిత్తమూ
పూదోటయే ఎల్లప్పుడూ
నీ బాటలో చిక్కుల్ని నే ... విడదీస్తూ దరి చేరతా
నీ ప్రేమయే అలరించగా ... సుస్వరములో నే పాడతా

మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము

నీవే నేర్పావూ ... నీ జాతికి అర్ధం
నీ వరములో దాచాను నా జీవిత పరమార్ధం
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే

నీ సౌరభం సమ్మోహనం ... అహ మధురమూ
అది మదిరమూ
చల్లావూ విత్తు నీవే ... ఈ అంకురం ఆ ఫలితమూ
నను నన్నుగా దరి చేర్చుకో
... అని అననులే ఏ నాటికీ
నీ దరికి చేరే అర్హత సాధిస్తా ముమ్మాటికీ

నా ఊపిరీ నా స్పందనా .
.. ఈ జీవితం నీ కోసమే
ప్రతి సఫలతా ... ప్రతి విఫలతా
ప్రతి యత్నమూ నీ నామమే
నే మారతా ... నీ కోసమూ...

మోహమూ ... దాహమూ
మోహమనే దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము

సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే

గురి చెయ్యి నన్ను పరీక్షకీ
లోపాలు తెలుపు నా ఆత్మకీ
లొసుగున్ననూ ... ముసుగెందుకు
సత్యాన్ని చూసి బెదురెందుకూ...

నను మార్చుకోవలసొచ్చినా ... నే మారతా నీ కోసమూ
నే నిప్పుపై నడవాల్సినా ... నే నడుస్తా నీ కోసమూ
నీ ప్రేమయే సంకల్పమూ
నా రక్తమూ ప్రతి చుక్కలో ... నా మేనిలో రుధిరమ్ములో
నీ సౌరభం ప్రతి ... ధారలో

మోహమూ ... దాహమూ
మోహమనే దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము

సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే

మ్యూజిక్ డైరెక్టర్ : రామ్ సంపత్
లిరిక్స్
: V . చక్రవర్తి
సింగర్స్ : రామన్ మహదేవన్, రాజీవ్ సుందరేసన్


Satyamev Jayate - 6th May 2012

5, మే 2012, శనివారం

మా తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...


"బంధం విలువ రక్త సంబందానికే తెలుస్తుంది" అన్న మాటని నిజం చేస్తూ
తోడబుట్టినందుకు తోడుగా నిలుస్తూ
బాధలో ... సంతోషంలో, కష్టం లో ... సుఖంలో
చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నా ప్రతి అడుగులోనూ తోడుంటూ,
ఎప్పడైనా, అవసరమైనా నాకు నా తమ్ముడున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించే
నీ ప్రేమాభిమానాలు నాకు భగవంతుడు అందించిన ఒక అదృష్టం...

ఈ అదృష్టం ఎప్పుడూ ఇలాగే వుండాలని,నాకు,చెల్లికి ఎప్పటికీ నువ్వొక అండగా
నిలవాలి అని కోరుకుంటూ ...
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని
నిత్యనూతనంగా తీర్చిదిద్దాలని,నువ్వు కోరుకునే ప్రతి కోరికా నెరవేరాలని,
సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ
నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడూ..

Wish you a very happy birthday
May life lead you to great happiness success and hope
That all your wishes comes true!
enjoy your day.

Happy BirthDay
Many
Happy Returns Of The Day

ఎప్పటికీ నీ ప్రేమాభిమానాలను,నీ క్షేమాన్ని కోరుకునే
నా
(మన) చిన్నిప్రపంచం..
2, మే 2012, బుధవారం

తెలుసుకో నువ్వే ...నా కళ్ళనే చూసి


"కూరిమి గల దినములలో" అన్న పద్యం భార్యా భర్తలకు కూడా వర్తిస్తుంది కదా..
పెళ్ళైన కొత్తల్లో ఏ తప్పైనా చిన్నగా,మురిపెంగా అనిపిస్తుంది .. అదే తప్పు కొంతకాలానికి
మహా అపరాధంగా అనిపిస్తుంది.
భార్యా భర్తల మధ్య గొడవలు గడప దాటకూడదు అనేది ఒకప్పటి మాట..
కానీ ఇప్పుడు అవి గడపలు,గేట్లు అన్నీ దాటి పోయి ... కేసులు, కౌన్సిలింగ్ సెంటర్ల దాకా
కూడా వెళ్లక తప్పని పరిస్థితులు వచ్చేసాయి..

ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లు చేస్తున్న పనిని ఒకప్పుడు మన పెద్దలే చేసేవారు.
ఎన్ని గొడవలు ఉన్నా బంధువులు,స్నేహితులు సర్దుబాటు చేసేవారు..
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కదా!!
చిన్న చిన్న కారణాలకే భార్యా భర్తలు శత్రువులుగా మారిపోతున్నారు.
వాళ్ళని సరిచేయకపోగా,ఇంకా రెచ్చ గొట్టే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు..

ఏది ఏమైనా భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు,అలకలు,మౌనాలు సహజం..
కానీ ఒక్కోసారి అవి శ్రుతి మించితే మళ్ళీ సరి చేసుకోవటం చాలా కష్టం.
శ్రీమతికి,శ్రీవారికి ఎన్ని గొడవలు వచ్చినా మౌన వ్రతాలు ,కక్ష సాధింపులు
ఎన్ని చేసినా ...ఆయనే నన్ను పలకరిస్తే బాగుంటుంది కదా అని శ్రీమతికి,
తనే నాతో మాట్లాడొచ్చు కదా అని శ్రీవారికి ఇద్దరికీ అనిపిస్తుంది.

అన్యోన్యంగా వుండే భార్యా భర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలతో.. బాధపడుతున్న
ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, నా మనసులోని భావాలను నా కళ్ళ ద్వారా
తెలుసుకోలేవా ?? అంటూ మనసులోనే ఒకరినొకరు ప్రశ్నిస్తూ పాడుకునే...
"కావ్యాస్ డైరీ"లో "తెలుసుకో నువ్వే" పాట చాలా బాగుంటుంది..

తెలుసుకో నువ్వే ...నా కళ్ళనే చూసి
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి
తెలపాలి నువ్వైనా  తెలపాలి నువ్వైనా
నేనే తెలుపలేకున్నా

తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసీ
నీ చేరువై నేనుండగా 
  దూరమేమిటో ఇంతగా
అనుకొనే నా మనసునే వినవా

నీ శ్వాస సోకితే చాలనే 
  ఆశ ఇంకిపోలేదనే
నిజమునే నీ పెదవితో అనవా

తలుచుకుంటాను నువ్వు నను  
తలిచేవని క్షణం
నిదురలేస్తాను ఎదురుగా  
కదలేవనీ దినం

నేనే...

అపుడేమో పెదవిపై నవ్వులే
ఇపుడేమో
నవ్వులో నలుపులే
ఎందుకా చిరునవ్వులో మసకా

అపుడెంత కసిరినా మామూలే 
 ఇప్పుడేమి జరిగినా మౌనమే
ఎందుకే నీ మాటలో విసుగా

కలిసి రావాలి వెంటనే కాలాలు మనకోసమై
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై

నేనే ... తెలుపలేకున్నా
నీతో నేనే తెలుపలేకున్నా


Related Posts Plugin for WordPress, Blogger...