పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జనవరి 2012, మంగళవారం

It's The Life...!

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు..


30, జనవరి 2012, సోమవారం

మాఇంటి దగ్గర సూర్యోదయం


మా
ఇంటి బాల్కనీలో నుండి రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం
సూర్యభగవానుని దర్శనం చేసుకుంటూ తీసిన ఫోటోలు.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

రధసప్తమి శుభాకాంక్షలు28, జనవరి 2012, శనివారం

శ్రీ పంచమి - సరస్వతీ స్తుతి


యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిహి
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా

శ్వేత వస్త్రాలతో అలంకృతమై,హంసవాహినిగా,
తెల్లని తామర పుష్పంపై కొలువుతీరిన వీణాపాణి జ్ఞానానంద పరాశక్తి.
శ్రద్ధ , ధారణా, మేధా, విధి, వల్లభా, భక్తజిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని
అనే సప్త నామధేయాలతో విరాజిల్లే విద్యా స్వరూపిణి.
బుద్ధి, స్మృతి,వాక్కు,విద్య ఆ దివ్య జనని అనుగ్రహ ఫలాలు

అమ్మ చెంతనే వుండే అమ్మ వాహనం హంస - పాలను, నీటిని వేరు చేస్తుంది.
అలాగే మానవులు కూడా మంచి,చెడుల విచక్షణాజ్ఞానంతో మసలుకోవాలని సరస్వతిమాత
తన హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది .

అజ్ఞాన తీరాలనుండి విజ్ఞానపు వెలుగు వైపుకి నడిపించి,జీవితంలో అవసరమైన జ్ఞాన సంపదను,
కరుణాకటాక్షాలను అనుగ్రహించమని ఆ వాగ్దేవిని శ్రీ పంచమి సందర్భంగా ప్రార్ధిస్తూ
అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు.
సరస్వతీ స్తుతి25, జనవరి 2012, బుధవారం

కలకానిది... విలువైనదీ...!


నాకు ఇష్టమైన మరొక ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ"
"వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం
ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది.
సినిమాలో సావిత్రి భర్త జగ్గయ్య అనుకోని ప్రమాదంలో చనిపోతాడు.అప్పుడు ఆ దిగులుతో బాధపడుతున్న
సావిత్రిని ఓదారుస్తూ జీవితంలో కష్టాలు వస్తే వాటి గురించే బాధపడుతూ.. ఎంతో విలువైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకూడదని చెప్తూ, నాగేశ్వరరావు పాడే ఈ పాట అప్పడు... ఇప్పుడు ఒక ఆణిముత్యం.

పాటలో నాకు నచ్చే మహాకవి శ్రీ శ్రీ గారి inspirational words ...

"అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే "

"
ఏదీ
తనంత తానై నీ దరికి రాదు

శోధించి సాధించాలి అదియే ధీరగుణం"


కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలువరించనేలా
సాహసమను జ్యోతినీ చేకొని సాగిపో

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే

ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకూ ... బలిచేయకు

సినిమా: వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
లిరిక్స్ : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల


యాదగిరిగుట్ట ట్రిప్ విశేషాలుమా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.

నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.

ఇక్కడి
నుండి యాదగిరిగుట్ట లోని "కుందా సత్యనారాయణ కళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.


ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు,
పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది.
ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం..  భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు,  కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు
ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు
20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము.
ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం - యాదగిరి గుట్ట
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము.
సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు.
గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు,
అలంకరణ చాలా బాగుంది.
లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని,
వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని,
బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి...
కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి.
ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు..
మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..

22, జనవరి 2012, ఆదివారం

బిజినెస్ మేన్ Vs సద్గురు


బిజినెస్ మాన్ కి సద్గురుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా
హైదరాబాద్ లో బిజినెస్ మాన్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్లకి
"ISHA
FOUNDATION"వాళ్ళు ఒక సి.డి ఇచ్చారు ఉచితంగా ..

ఆ సి.డి పేరు "Technologies for Wellbeing" "సద్గురు జగ్గి వాసుదేవ్"
అనే
ఒక spiritual Guru ఆధ్వర్యంలోని Isha Yoga Center గురించి, యోగా ప్రాధాన్యతను గురించి
సి.డి లో చెప్పారు.సి.డి చూసిన తర్వాత నెట్ లో "Isha Foundation" గురించి సెర్చ్ చేశాను.

ఈ సద్గురు కూడా ఈ మధ్య కాలంలోని కొంతమంది యోగా గురువుల్లాగానే యోగా తో పాటు,Health,Education,Environment లాంటి కొన్ని సమాజహిత కార్య క్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

యోగా,సోషల్ సర్వీస్ ఇలాంటివన్నీ అందరూ చేసేవే అయినా ఈ సద్గురు ఆశ్రమం లో
నాకు
చాలా నచ్చింది ఆశ్రమంలోని ధ్యాన లింగం,లింగభైరవి ఆలయాలు .
శివాలయం,అమ్మవారి ఆలయాలు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా,
తప్పకుండా
చూడాలి అనిపించేలా వున్నాయి.
Dhyanalinga Yogic Temple

లింగ భైరవి ఆలయం
“One who earns the Grace of Bhairavi neither has to live in
concern
or fear of life or death, of poverty, or of failure.
All that a human being considers as wellbeing will be his,
if only he earns the Grace of Bhairavi.”

Sadhguru

"ISHA
FOUNDATION"
Velliangiri Foothills Semmedu (P.O)
Coimbatore.
గురించి "సద్గురు" గురించి తెలుసుకోవాలంటే లింక్ లు చూడండి.
http://sadhguru.org/
http://www.ishafoundation.org/
http://lingabhairavi.org/

15, జనవరి 2012, ఆదివారం

శుభపర్వాల నాంది... సంక్రాంతి శుభాకాంక్షలు.


సింగారమొలికించు చెలికత్తెలను కూడి
పడతులు తీర్చిదిద్దిన పసిడి ముగ్గులు
ముగ్గు మధ్యన గొబ్బెమ్మ ముద్దులొలుక
ధాన్యపు రాశులతో పొంగి పొరలెడి

వ్యవసాయదారుని వడ్లగూళ్ళు
సన్నాయినూదుచు చనుదెంచి యాచించు
గంగిరెద్దుల వాని గడుసు పాట
భక్తిభావముతోడ భజనలు సల్పెడి
హరిదాసు కీర్తనల
గంగిరెద్దుల మెడల చిరుగంటలు మ్రోగ
పాడి పంటలు, వాకిళ్ళ కళకళలతో

తీపితీపి వంటల ఘుమఘుమలతో

బంధుమిత్రుల సంతోష,సంరంభాలతో

అరుదెంచింది సంక్రాంతి లక్ష్మి


ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సిరులు పండించాలని,
అందరినీ భోగ భాగ్యాలతో,ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

14, జనవరి 2012, శనివారం

భోగి పండుగ శుభాకాంక్షలు...


గతానికి వీడ్కోలు పలుకుతూ ... జీవితంలోకి కొత్త కాంతులను ఆహ్వానిస్తూ
భోగిమంటల వెలుగులతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ
వచ్చిన 'భోగి'పర్వం భోగ
భాగ్యలను అందించాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

ముద్దబంతులు ..మువ్వమోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు..పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మదినిండగా

చలిపండగే సంక్రాంతి.

Video By :Raaji

సంక్రాంతి శుభాకాంక్షలు13, జనవరి 2012, శుక్రవారం

బాపుబొమ్మల సంక్రాంతి శుభాకాంక్షలు ...


ముంగిళ్ళలో మెరిసే ముగ్గులు,
ముగ్గుల మెలికల మధ్య ఒదిగిన గొబ్బెమ్మలు,
హరిదాసు కీర్తనలు,జంగందేవర దీవెనలు,
తియ్య తియ్యని పిండివంటలు,
బంధుమిత్రుల కోలాహలాల మధ్య
తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నఅందరికీ
బాపు బొమ్మలతో బుడుగు సీగాన పెసూనాంబల
సంక్రాంతి శుభాకాంక్షలు.Related Posts Plugin for WordPress, Blogger...