
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించారు.
ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986లో తను మరణించే వరకు
ప్రపంచం నలుమూలల అనేక ప్రసంగాలు చేశారు..
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో.
మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ,
ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల
నుండి విముక్తి చెందాలని భోధించారు..


