నా చిన్నిప్రపంచంలో కొత్తగా వచ్చిన సభ్యులు ఈ మీనాలు..
మా అమ్మకి ఎప్పటి నుండో కోరిక ఈ అక్వేరియం కొనాలని..
ఎప్పటికప్పుడు కుదరకపోవటం,దాని మీద మేమెవరం ఇంటరెస్ట్ చూపించకపోవటం
ఇలాంటి కారణాలన్నింటి వలన మా అమ్మ అక్వేరియం కోరిక అలాగే మిగిలిపోయింది..
ఐతే ఇప్పటికి ఆ కోరిక తీరటం మా అమ్మకి చాలా సంతోషం పైగా ఆ కోరిక తన
చిన్నల్లుడి ద్వారా తీరటం మరీ మరీ సంతోషం..
మా చెల్లి వాళ్ళింటికి లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మ ఎప్పటిలాగే
మా తమ్ముడిని అక్వేరియం గురించి అడగటం విన్న మా మరిది గారు మా చెల్లి ద్వారా
మా అమ్మకి వున్న ఇష్టం తెలుసుకుని తను,మా చెల్లి ఇద్దరు వెళ్లి తీసుకువచ్చిన అక్వేరియం ఇది..
ఏ వస్తువైనా మనం కొనుక్కోవటం కంటే మన ఇష్టాన్ని తెలుసుకున్న ఆత్మీయులు
మనకి దాన్ని గిఫ్ట్ గా ఇవ్వటం చాలా సంతోషాన్ని కలిగించే విషయమే కదా...
ఆ అక్వేరియంలో ఆనందంగా ఆడుకుంటున్న చేపల్ని చూస్తుంటే చాలా బాగుంది.
పైగా అక్వేరియం ఇంట్లో వుండటం వాస్తుప్రకారం కూడా మంచిదట..
మా జలతారు మీనాల ముచ్చటైన విన్యాసాలు
మీరు కూడా చూడండి..
ఈ అక్వేరియంలో ఆడుతూపాడుతూ, అల్లరిగా హాయిగా తిరుగుతున్న ఈ చేపల్ని చూస్తుంటే నాకు
సాహసవీరుడు సాగరకన్యలో
మీనా మీనా జలతారు వీణా పాట గుర్తుకు వచ్చింది.
అందుకే అక్వేరియం
వీడియో తీసి దానికి ఆడియో జత చేసి యూ ట్యూబ్ లో
అప్ లోడ్ చేశాను..
మీనా మీనా జలతారు వీణా
with నా చిన్నిప్రపంచం చేపలు..By:రాజి