పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, సెప్టెంబర్ 2010, సోమవారం

చిట్టిచెల్లెలు రమ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు....నమ్మవేమో కానీ అందాల యువరాణి
నేలపై
వాలింది మా ముందే నిలిచింది.

మా చిన్నారి చెల్లెలు రమ్య పుట్టినరోజు ఈ రోజు.
మా రమ్యని దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,
మంచి చదువును,ఉజ్వలమైన భవిష్యత్తును,
తను కోరుకున్న అందమైన ప్రపంచాన్ని తనకు కానుకగా అందించాలని కోరుకుంటూ

నా చిన్నిప్రపంచం తరపున
మా ఇంటి అందాలయువరాణి,అల్లరిపిల్ల,మా చిట్టి చెల్లెలు రమ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

HAPPY BIRTHDAY SWEETY

THE FRAGRANCE OF ALL THE SPECIAL TIMES YOU SPEND TODAY....
BE WITH YOU FOREVER!

HAPPY BIRTHDAY
MANY MANY HAPPY RETURNS OF THE DAY....


22, సెప్టెంబర్ 2010, బుధవారం

మయూరి.మయూరి సినిమా అందరికీ తెలిసిన సినిమానే నేను కొత్తగా చెప్పేదేమీ లేదు
కానీ నాకు ఇష్టమైన సినిమా గురించిన నా అభిప్రాయం నా చిన్ని ప్రపంచంలో....

నాకు ఎప్పటికీ గుర్తుండిపొయేలా , ఎంతగానో నచ్చిన సినిమాలు చాలా వున్నాయి.
వాటిలో టాప్ 10 లో వుండే సినిమా మయూరి.

చిన్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టు లో సుధాచంద్రన్ జీవిత చరిత్ర ఒక లెసన్ వుండేది.
ఆ లెసన్ చెప్తూ మా టీచర్ ఇది మయూరి అనే సినిమాగా వచ్చింది.
సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పారు.

అప్పుడు మొదటిసారి మయూరి సినిమా చూశాను.అప్పటినుండి నేను మయూరి ఫాన్ అయిపోయాను.
ఎన్ని సార్లు టివీ లో వచ్చినా మిస్ అవ్వకుండా చూసే సినిమా మయూరి.

మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు అని,ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుందని తెలియచేయటానికి
మయూరి నిజజీవితం గురించి స్ఫూర్తి కలిగించే విధంగా,చిన్నప్పటి పాఠంగా చదివాను .
మళ్ళీ కొంతకాలానికి నేను డిగ్రీ పూర్తీ చేసి, ICET ,EDCET కోచింగ్ కోసం
విజయవాడ SUPERWHIZZ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను.

షార్ట్ టర్మ్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు SUPERWHIZZ డైరెక్టర్ గుప్తా గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో feedback claass ఏర్పాటు చేశారు .

ఆ క్లాస్ లో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకువస్తుంటాయి.
ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక క్షణంలో నిరాశ నిస్పృహలకు,
నేనికేమీ చేయలేననే ఆశక్తతకు లోనవుతాడు.
ఆలాంటి సమయంలోనే మనిషి ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఏది సాధించాలి అనుకున్నామో
దానికోసం రెట్టింపు కృషి చేయాలి ,విజయాన్ని సాధించాలి.
ఇవన్నీ చెప్తూ ఆయన క్లాస్ లో మయూరి సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూపించారు.

నిజంగా ఒక సామాన్య మనిషి జీవితం మరి కొందరి జీవితంలో స్పూర్తిని నింపడానికి ఉపయోగపడింది అంటే
అంతకంటే ఆ మనిషి జీవితంలో సాధించే విజయం ఇంకేముంటుంది?

మయూరి సినిమా కధ విషయానికి వస్తే ....

మయూరికి నాట్యం అంటే చాలా ఇష్టం.ఎప్పటికైనా నాట్యం లో మంచి పేరు సాధించాలన్నది ఆమె ఆశయం.
కానీ ఇంట్లో డాన్సు అచ్చిరాలేదన్న కారణంగా ..మయూరి పిన్ని నాట్యం నేర్చుకోవటానికి ఇష్టపడకపోవటంతో ,
ఇంట్లో తెలియకుండా ఒక స్నేహితుని సహకారంతో డాన్సు నేర్చుకుని తన కలలు నిజం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో తన కాలు కోల్పోతుంది.

జరిగిన ప్రమాదం లో మయూరికి సానుభూతి చూపకపోగా మాటలతో హింసిస్తుంది ఆమె పిన్ని.
తన స్వార్ధం కోసమే మయూరికి నాట్యం నేర్పి, ప్రదర్శనలు ఇప్పించి,ఆమెని పెళ్లి చేసుకుంటానన్న మోహన్
మయూరికి కాలు పోగానే నిన్ను పెళ్లి చేసుకుంటే నాది కూడా అవిటి బతుకేనంటూ అవహేళన చేస్తాడు.

ఈ సంఘటనలతో బాధపడిన మయూరి ఇల్లు వదిలి వెళ్లి,స్నేహితురాలి వద్ద ఉంటూ
జైపూర్ ఫుట్ గురించి తెలుసుకుని, తన బామ్మ సహకారంతో ,
తను సాధించాలనుకున్న నాట్యాన్ని తిరిగి నేర్చుకుని మనిషి తలచుకుంటే ఏది అసాధ్యం కాదు అని నిరూపిస్తుంది.

సినిమాలో మనుషుల వ్యక్తిత్వాలను చాలా చక్కగా చిత్రీకరించారు...

కోరుకున్న గమ్యాన్ని చేరటం కోసం ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని అధిగమించిన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి మయూరి.

మయూరి తండ్రి మంచి మనసుతో కూతురిని అర్ధం చేసుకుంటాడు కానీ భార్య,కుటుంబాన్ని కాదనుకోలేని వ్యక్తి.

ఇక మయూరి పిన్ని ఎప్పుడో జరిగిన అనర్ధాలను దృష్టిలో ఉంచుకుని మయూరిని డాన్స్ కి దూరంగా ఉంచాలన్నది ఆమె పట్టుదల.

ఇక సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది,నాకు నచ్చే పాత్రలు అని చెప్పదగినవి
మయూరి బామ్మ నిర్మలమ్మ, వాళ్ళింట్లో పని చేసే సత్యం.

మయూరికి కష్ట కాలంలో ఎంతో చేదోడు వాదోడుగా నిలిచి,తనలో ఆత్మస్థైర్యాని నింపి ఆమె విజయానికి బాటలు వేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ.

జీవితంలో విజయం సాధించిన ప్రతి మనిషి వెనుక ఇలాంటి వ్యక్తులు తప్పకుండా వుంటారు.

ఇక సినిమాలో కీలక పాత్ర అని చెప్పదగినది మోహన్ పాత్ర.
స్వార్ధానికి నిలువెత్తు ఉదాహరణ మోహన్

అతను బైక్ మీద వెళ్తున్నప్పుడు కాలినడకన వెళ్ళే వాళ్ళని సరిగా నడవరని విమర్శించడం,
వెంటనే అతను నడిచి వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళను విమర్శిస్తూ జనాలకి బొత్తిగా సివిక్ సెన్సు లేకుండా పోయిందండీ అనే సంఘటనలోనే అతని వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు.

ఇదే స్వార్ధాన్ని మయూరి విషయంలో కూడా చూపించిన మోహన్
అతని వలననే ప్రమాదానికి గురి అయిన మయూరి అసహాయ పరిస్థితిలో వుండి
తనను పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చినప్పుడు ఎంతో అవమానించి మాట్లాడతాడు.

కానీ అతని మాటలు విన్న మయూరి కుంగిపోకుండా, అతని ముందే నేను సాధించగలను అని,
తను అనుకున్న గమ్యాన్ని సాధించి నాట్య మయూరిగా విజయ తీరాలని చేరుకుంటుంది.

మయూరి తిరిగి నర్తకిగా పేరు తెచ్చుకోగానే మోహన్ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మయూరికి మళ్ళీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు,
కానీ మయూరి అతనిని నిరాకరించి తగిన గుణపాఠం చెప్తుంది.

జీవితంలో కష్ట,నష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని ఎదిరించి పోరాడితేనె విజయం సాధించగలం అని
నిజ జీవితంలో జరిగిన సంఘటన ద్వారా రుజువు చేసిన మయూరి సుధాచంద్రన్ అందరికీ ఆదర్శం.

మనల్ని అవమానించిన వాళ్ళమీద మనం పగ తీర్చుకోవటం అంటే తిరిగి మనం కూడా వాళ్లకి ఏదో ఒక నష్టం కలగచేయటం,వాళ్ళని బాధించటం కాదు.
మనం ఏదైతే సాధించలేమని,చేయలేమని మనల్ని అవమానించారో అది సాధించటం అని నా అభిప్రాయం.
నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే..

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండే ఒక మాట, నాకు ఎప్పుడూ గుర్తుండే మాట ...
పట్టు
పట్టరాదు
పట్టి
విడువరాదు
పట్టి
విడుచుటకంటే
పడి
చచ్చుటే మేలు


నాకు నచ్చిన మయూరి సినిమాలో పాటలు నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో


20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా పింకీ బారసాల


నా మేనకోడలు పింకీ బారసాల 30-08-2010


మా తమ్ముడి కూతురు,నా మేనకోడలు పింకీ బారసాల మరియు నామకరణ మహోత్సవం

తన అమ్మమ్మ వాళ్ళింట్లో బంధుమిత్రుల మధ్య సంతోషంగా జరిగింది.
పింకీ మేము పెట్టుకున్న ముద్దుపేరు.


తన జన్మనక్షత్రం ప్రకారం మా అమ్మ మేము పూజించే అమ్మవారిపేరు కలిసి వచ్చేలా
దేవీప్రియ అని పేరు పెట్టింది.మా ముద్దుల దేవీప్రియను అమ్మవారు తన చల్లని చూపులతో కాపాడి,
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని కోరుకుంటూ..
మా తమ్ముడు,మరదలు,నా మేనకోడలికి నా చిన్నిప్రపంచం తరపున దీవెనలు మరియు శుభాకాంక్షలు.

రాజి

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

మాఇంటి గణపతి


ఓం
గం గణపతయే నమః


మా పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి వినాయకచవితి కావటంతో ఈ వినాయకచవితి మా అమ్మ వాళ్ళింట్లో జరుపుకున్నాము.
చిన్నప్పటినుండి మాకు చాలా ఇష్టమైన పండుగ వినాయకచవితి.
నాన్నతో బజారుకి వెళ్ళి వినాయకచవితి షాపింగ్ చేయటం చాలా సరదాగా వుండేది.
అప్పట్లో బంకమట్టితో అచ్చులు వేసి,దానిమీద రంగు కాగితం అద్ది వుండే వినాయకుడి ప్రతిమలు ఉండేవి.


తర్వాత కొంత కాలానికి pop వినాయకులు అదేనండీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులు వచ్చిన తర్వాత,
మట్టితో చేసిన వినాయకులకంటే ఆ వినాయకుడే మాకు ఎక్కువ నచ్చేవాడు.
మాకోసం నాన్న,ఈ వినాయకుడిని కొన్నా,మట్టివిగ్రహం మాత్రం తప్పకుండా తీసుకునేవాడు
ఎందుకంటే పూజ మట్టితో చేసిన వినాయకుడికే చేయాలని.

మా చెల్లి ఫ్రెండ్ గణేష..మా చెల్లి సేకరించిన చిన్ని గణపతులు...


ఈ సంవత్సరం పర్యావరణ రక్షణ కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాలే వాడాలని టీవీల్లో,పేపర్లో వస్తున్న సలహాలు విని మేము కూడా మట్టి గణేషుడ్ని తేవాలని చాలా ప్రయత్నించాము..
కానీ మా వూరిలో ఎక్కడా ఆ మట్టివిగ్రహాలే కనపడలేదు.ఇంకోచోటికి వెళ్లి ప్రయత్నించే సమయం లేకపోవటంతో
ఈ సంవత్సరానికి మా ఇంటికి రావాలనుకున్న ఓ రంగురంగుల బొజ్జ గణపతిని మా ఇంటికి తీసుకువచ్చాము.


తమ్ముడు,చెల్లి,నేను మా గణేష్ మండపాన్ని అందంగా అలంకరించుకుని,
అమ్మ చేసిన నైవేద్యాలతో,మా కుటుంబంతో ఆనందంగా గణపతిని పూజించుకున్నాము.


మా పూజ నిర్విఘ్నంగా జరిపించిన ఆ గణపతిని మనసారా ధ్యానిస్తూ...ఆ గణనాధుడు
నా చిన్నిప్రపంచాన్ని ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో దీవించాలని,
సకల శుభాలు కలుగచేయాలని ,మా పనులన్నిటినీ నిర్విఘ్నంగా జరిగేలా దీవించమని ప్రార్ధిస్తూ ...

వినాయకచవితి శుభాకాంక్షలు.రాజి
Related Posts Plugin for WordPress, Blogger...