పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, జూన్ 2011, ఆదివారం

Happy Father's Day నాన్నా..మాట కటువు మనసు వెన్న అందుకే నాన్న కన్నా లేదు మిన్న
పైకి గంభీరంగా వుండి కన్నెర్ర చేసినా ఆ కళ్ళ చాటున చల్లని ఆశీస్సులు,
ఆ గాంభీర్యం మాటున అంతులేని ప్రేమ ..ఈ రెండిటినీ కలిపి ఆప్యాయతా అనురాగాలనే అమృతాన్ని
నిరంతరం కన్న బిడ్డలకు పంచేవాడే నాన్న..

ఒకప్పుడు నాన్నగారండీ అంటూ గౌరవంతో పిల్లలు నాన్న ముందు నిలుచోవటానికి కూడా భయపడేవారు
ఆ తర్వాత తరంలో నాన్నగారు నేనిలా చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారు
అని ఆయన అభిప్రాయం కోసం ఎదురు చూసే వారు..

మరో తరం మారాక నాన్నా నాకిది బాగా నచ్చింది ఈ పని చేసేస్తున్నా అని
ఆయన సమాధానం వచ్చేంతలోనే తమ పని తాము చేసుకుపోయే పిల్లలు వచ్చారు..
మరికొన్నాళ్ళు పోయాక నాన్న స్నేహితుడయ్యాడు..
నాన్నా నాకు ఇది బాగుంటుంది అనిపిస్తుంది బిడ్డలు అనే లోపే కన్నతండ్రి నిజమేరా
నేను
అదే అనుకుంటున్నానీదీ నాదీ ఒకే అభిరుచి అని సమర్ధిస్తాడు నాన్న

డాడీ అన్నా... నాన్నా అన్నా కాలానికి తగినట్లుగా తనే ఒదిగిపోతూ కన్నబిడ్డల క్షేమం
కోసం నిరంతరం తపిస్తాడు నాన్న
కేవలం డబ్బు తయారుచేసే యంత్రం గానే కాక తన శ్రమలో కన్నప్రేమను కలిపి
బిడ్డల
భవిత కోసం నిరంతరం శ్రమించి,కలలు కనే నాన్న ఏదో ఒక క్షణంలో కోప్పడినా
మరుక్షణంలోనే దగ్గరకు తీసుకునితానోడినా గెలిచినట్లే తనవారి గెలుపును
తన
గెలుపుగా భావించి సంతోషించే గొప్పవాడు నాన్న

మా ముగ్గురి సంతోషంకోసం తను కష్టపడి ,జీవితంలో అత్యుత్తమమైన వాటినే
మాకు
అందించాలని తాపత్రయపడి ప్రయత్నంలో విజయం సాధించి
ప్రపంచంలో మాకంటూ ఒక మంచి స్థానాన్ని కల్పించిన నాన్నకు
మా
ముగ్గురి తరపున Father's Day శుభాకాంక్షలు

Happy Father's Day నాన్నా..

Related Posts Plugin for WordPress, Blogger...