పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, జనవరి 2012, శనివారం

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...!


ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్ధంకాని పుస్తకమే అయినా కాని ఈ ప్రేమ

జీవితపరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ


ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ

ప్రతి ఇద్దరితో మీగాధే మొదలంటుంది ఈ ప్రేమ

కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ

కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ


ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ


Related Posts Plugin for WordPress, Blogger...