పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, సెప్టెంబర్ 2016, బుధవారం

చిల్లర బుధ్ధులు / మనుషులు



చిన్న పిల్లల్ని ,చిల్లర (చిన్న/ వెధవ బుధ్ధులున్న) మనుషుల్ని ఎక్కువగా కదిలించకూడదని మా తమ్ముడు చెప్తుంటాడు. చిన్న పిల్లలకి వాళ్ళేం చేస్తున్నారో తెలియక ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. చిల్లర మనుషులు మేమేం చేస్తే ఏంటి, మమ్మల్ని ఎవరేం చేయగలరు అనే అహంకారంతో చేస్తుంటారు.మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అని పెద్దలు చెప్పినట్లు మర్యాదస్తులకి ఎవరితోనైనా చిన్న మాట పడాల్సి వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది కానీ అదే వెధవలకి ఎన్ని మాటలనిపించుకున్నా దున్నపోతు మీద వడగళ్ళవాన లాగా ఏమీ చలనం ఉండదు.అలాంటి వాళ్ళని ఏదో అనాలనుకోవటం కూడా అనవసరం అనే సందర్భంలో  ఈమాట వర్తిస్తుందన్నమాట.










Related Posts Plugin for WordPress, Blogger...