పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, ఏప్రిల్ 2011, శనివారం

Charlie Chaplin's 122nd birthday...


చిన్నప్పుడు ప్రతి ఆదివారం DD లో చార్లీచాప్లిన్ చూడటం కోసం టీవీ ముందునుండి కదలకుండా కూర్చునేవాళ్ళం
నేను,
తమ్ముడు.సండే ట్యూషన్ కి వెళ్ళినా అక్కడ కూడా చాప్లిన్ చూసిన తర్వాతే చదువుకునే వాళ్లము.
ట్యూషన్ లో TV పెట్టేవారు మా టీచర్. .మరి పిల్లలందరూ చార్లీ చాప్లిన్ అబిమానులే కదా..
ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడకతో అమాయకంగా కనిపించే చార్లీచాప్లిన్ షో చూడటం మాకు చాలా సరదాగా వుండేది..
అందరినీ ఎంతగానో నవ్వించిన చార్లీచాప్లిన్ ఎన్నో కష్టనష్టాలు అనుభవించాడట.
జీవితంలో కష్టాలను అధిగమించి, నవ్వులు పంచిన చార్లీ చాప్లిన్ ప్రపంచఅద్భుతాలలో ఒకరు...
ఈ రోజు చాప్లిన్ పుట్టినరోజు.

HAPPY BIRTHDAY CHARLIE CHAPLIN

Related Posts Plugin for WordPress, Blogger...