పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, మార్చి 2011, గురువారం

స్వల్పవిరామం


నా చిన్నిప్రపంచంలో కొన్నాళ్ళుగా పోస్టింగ్స్ పెట్టటం కుదరటంలేదు.
అందుకు కొంచెం బాధగానే వున్నా తప్పదు కదా...
సివిల్ జడ్జ్ exam కోచింగ్,LL.M exams
వీటన్నిటి కోసం చదివే పనిలో వున్నాను.అందుకే ఈ స్వల్పవిరామం.
విజయవంతంగా ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత నా చిన్ని ప్రపంచంలో చెప్పుకోవాల్సిన
విషయాలు చాలానే వున్నాయి.
త్వరలో నా చిన్నిప్రపంచం లో అన్నివిషయాలు నా బ్లాగ్ మిత్రులందరికీ చెప్పాలని ఎదురుచూస్తూ....

రాజి

8, మార్చి 2011, మంగళవారం

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు...


గుండెకే గాయం చేసి... నిండుగా నవ్వేస్తుంది
పుండుపై కారం చల్లి... పువ్వులే చల్లేస్తుంది
మనసులో చోటిస్తున్నా...మాటలే దాచేస్తుంది
పాపలా ముద్దొస్తుంది ... పడుచులా కవ్విస్తుంది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...Related Posts Plugin for WordPress, Blogger...