పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
అమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2017, గురువారం

మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు



నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా  ఎప్పటికీ నిలిచిపోతాయి కదా.. 

ఉగాది రోజునే పుట్టిన మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy BirthDay అమ్మ :)

మాలోనే తన చిన్నిప్రపంచాన్ని చూసుకుంటూ
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
లేకుండా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలవాలనే ప్రేమ,ఆప్యాయతలు

ఎవరికీ మేలు చేయలేకపోయినా,కీడుమాత్రం చేయొద్దని, 
మాకు మేముగా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో పాటు
కావాలని మాకు హాని చేయాలనుకునే వాళ్ళనుండి కాపాడుకోగలిగే ధైర్యం

ఎవరినుండి ఏమీ అతిగా ఆశించకూడదు,ఎవరి తోడు లేకపోయినా 
దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడతాడనే నమ్మకంతో పాటు,
సమాజంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,మాట్లాడాలనే హద్దులు తెలుసుకునే ఇంగితఙ్ఞానం

రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది, ప్రయాణం ఉంటే గమ్యం కూడా ఉంటుంది, 
అలాగే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది కాబట్టి 
ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం

అన్ని విషయాలు గురువు,నేస్తంగా నేర్పిన, నేర్పుతున్న 
మా అమ్మని ఆయురారోగ్యాలతో కాపాడమని భగవంతుడ్ని వేడుకుంటూ,
ఎప్పటికీ మాకు తోడుగా,మా అందరితో సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ... 

Happy Birthday 🎂💐 అమ్మా 
Many Many Happy returns of the day...

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
Love u మా 💕💞💝
Raaji,Vamsi,Ramya



13, మే 2012, ఆదివారం

అమ్మ లాలి చాలునే ... నిన్ను కమ్మంగ లాలించునే...


"అమ్మవంటిది ... అంతమంచిదిఅమ్మఒక్కటే"
-- ఆత్రేయ


అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
-- దాశరథి. కృష్ణమాచార్య


"అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే "
-- సి. నారాయణరెడ్డి


పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
--వేటూరి. సుందరరామమూర్తి


ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
-- సిరివెన్నెల. సీతారామశాస్త్రి


పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ
-- చంద్రబోస్


ఇవన్నీఅమ్మ గురించి గొప్పగొప్ప రచయితలూ, కవులు చెప్పినమాటలు,
గొప్పవాళ్ళ
మాటల్లోనేకాదు...
ప్రతీ మనిషి మనసులోని మాట "అమ్మకనిపించే ... కనిపెంచేదేవత" అని.


అమ్మ నేను సంతోషిస్తే తను చిరునవ్వవుతుంది...
నా కష్టంలో తను కన్నీరవుతుంది..
నా విజయం లో తానే విజేతగా సంబరపడుతుంది...

నా
ఓటమిలో ఓదార్పవుతుంది ..
నా సమస్యకు పరిష్కారమవుతుంది..
నా అలకను తీర్చే అక్షయపాత్ర అవుతుంది...

నా
చుట్టూ ఆవరించిన శూన్యం నన్ను నిస్తేజం చేసినప్పుడు,
నిస్సహాయంగా నిలిచినప్పుడు, శూన్యమనే చీకటిని తొలగించే
కాంతి పుంజంలా అమ్మమాట, అమ్మ చెప్పే ధైర్యం
నన్ను చైతన్యవంతం చేస్తుంది.


మనిషికి దేవుడు ఇచ్చిన వరం అమ్మప్రేమ.. ఆవరాన్ని పొందిన ప్రతి మనిషీ అదృష్టవంతులే..
అమ్మప్రేమను గురించి "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" పాట నాకు చాలా ఇష్టం..
బిడ్డపైన అమ్మకు వుండే ప్రేమాభిమానాలను తెలుపుతూ అమ్మపాడే పాట ఇది..

అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతూ, కధలు చెప్పమని ముద్దుగా అల్లరిచేసే చిన్నారి అల్లరికి సంతోషిస్తూ..
ఎంతో ముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పెళ్లై అత్తవారింటికి వెళ్తే తనను చూడకుండా ఎలావుండగలననే కన్నతల్లి బాధను వ్యక్తపరుస్తూ...
నువ్వు ఎక్కడవున్నా ఆనందంగా వుండాలి,కలతలు,కష్టాలు లేకుండా నీకలలన్నీ పండి నీ జీవితం సంతోషంగా వుండాలని మనసారా బిడ్డను దీవిస్తూ ...

అమ్మ మనసును ప్రతిబింబించే ఈ పాట రచనా,సంగీతం "పాలగుమ్మివిశ్వనాధం" గారు..
ఈ పాటను "శ్రీమతి వేదవతీ ప్రభాకర్" గారు పాడారు..
నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మకోసం , అమ్మలందరికోసం..

మాతృదినోత్సవ
శుభాకాంక్షలు.


అమ్మదొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ





అమ్మ
దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ ...
నా కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ

గలగలమని నవ్వుతు కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

కథ చెప్పేదాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే

గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి

అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే ... నాకు బెంగ



23, మార్చి 2012, శుక్రవారం

అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు...



నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు తన నిద్రమానుకుని నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది..
కలల ఊయలలో నన్ను మెల్ల మెల్లగా ఊపింది..

ఎలాంటి
పరిస్థితిలోనైనా నీకు నేనున్నానని స్నేహపూరితంగా
నాకు ధైర్యం చెప్పింది..

బాధని తట్టుకునే ధైర్యంలేని నా మనసు కన్నీరుగా మారినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని
నా కన్నీటిని తన చీర చెంగుతో తుడిచింది..

తనని విసిగించే పనులు చేసి మనశ్శాంతి లేకుండా చేసినా భరిస్తుంది.
అర్ధంలేకుండా నేను కోప్పడినా అర్ధం చేసుకుంటుంది..

మొత్తం ప్రపంచం మీద అలిగి నేను కోపంగా నిద్రపోయినప్పుడు నెమ్మదిగా
దుప్పటి కప్పి,తన కొంగులో నన్ను దాచుకుంటుంది..

మొదటి గురువుగా జీవిత పాఠాల్ని నేర్పుతుంది
పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ కీ తను తీసిపోను అంటుంది.

రెక్కలొచ్చి మనం ఎగిరిపోయినప్పుడు మన ఉన్నతికి గర్విస్తుంది
తన గూటిలోనే తను ఉండిపోతుంది..

అమ్మంటే సృష్టి, అమ్మంటే సహనం, అమ్మంటే త్యాగం, అమ్మంటే ప్రేమ
"అమ్మ వంటిది ... అంత మంచిది అమ్మ ఒక్కటే"


ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మను భగవంతుడు
ఆయురారోగ్యాలతో
దీవించి, కాపాడాలని,
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
అమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


"నా
చిన్నిప్రపంచం
"






1, నవంబర్ 2011, మంగళవారం

మీనా... మీనా జలతారు మీనా ...

నా చిన్నిప్రపంచంలో కొత్తగా వచ్చిన సభ్యులు ఈ మీనాలు..
మా అమ్మకి ఎప్పటి నుండో కోరిక ఈ అక్వేరియం కొనాలని..
ఎప్పటికప్పుడు కుదరకపోవటం,దాని మీద మేమెవరం ఇంటరెస్ట్ చూపించకపోవటం
ఇలాంటి కారణాలన్నింటి వలన మా అమ్మ అక్వేరియం కోరిక అలాగే మిగిలిపోయింది..
ఐతే ఇప్పటికి ఆ కోరిక తీరటం మా అమ్మకి చాలా సంతోషం పైగా ఆ కోరిక తన
చిన్నల్లుడి ద్వారా తీరటం మరీ మరీ సంతోషం..

మా చెల్లి వాళ్ళింటికి లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మ ఎప్పటిలాగే
మా తమ్ముడిని అక్వేరియం గురించి అడగటం విన్న మా మరిది గారు మా చెల్లి ద్వారా
మా అమ్మకి వున్న ఇష్టం తెలుసుకుని తను,మా చెల్లి ఇద్దరు వెళ్లి తీసుకువచ్చిన అక్వేరియం ఇది..
ఏ వస్తువైనా మనం కొనుక్కోవటం కంటే మన ఇష్టాన్ని తెలుసుకున్న ఆత్మీయులు
మనకి దాన్ని గిఫ్ట్ గా ఇవ్వటం చాలా సంతోషాన్ని కలిగించే విషయమే కదా...

ఆ అక్వేరియంలో ఆనందంగా ఆడుకుంటున్న చేపల్ని చూస్తుంటే చాలా బాగుంది.
పైగా అక్వేరియం ఇంట్లో వుండటం వాస్తుప్రకారం కూడా మంచిదట..
మా జలతారు మీనాల ముచ్చటైన విన్యాసాలు
మీరు కూడా చూడండి..








ఈ అక్వేరియంలో ఆడుతూపాడుతూ, అల్లరిగా హాయిగా తిరుగుతున్న ఈ చేపల్ని చూస్తుంటే నాకు
సాహసవీరుడు సాగరకన్యలో మీనా మీనా జలతారు వీణా పాట గుర్తుకు వచ్చింది.
అందుకే అక్వేరియం వీడియో తీసి దానికి ఆడియో జత చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను..

మీనా మీనా జలతారు వీణా
with నా చిన్నిప్రపంచం చేపలు..
By:రాజి




8, మే 2011, ఆదివారం

అమ్మకు శుభాకాంక్షలు...



బంధం కోసం,భాధ్యత కోసం, కుటుంబంకోసం
అందరినీ కనుపాపలా తలచి...ఆత్మీయతను పంచి
తనవారి కోసం అహర్నిశలు శ్రమించి
కన్నబిడ్డల కలల్ని నిజంచేసి...తన ఇంటిని నందనవనం చేసే
ప్రియమైన అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు






4, ఏప్రిల్ 2011, సోమవారం

Happy BirthDay అమ్మా...


అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు


Happy BirthDay అమ్మా ...
నువ్విలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని,
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించి
నువ్వు మా మీద పెట్టుకున్న కలలు, కోరికలు అన్నీ నిజమయ్యేలా దీవించాలని ప్రార్ధిస్తూ...

You made me dream...
You made me live my dream.

You are an inspiration.

You are the reason for what i am.


you ask for nothing...

But have given me everything.

I would like to tell this

from the bottom of my heart...


I love you so much mom!

Wish you a very Happy BirthDay


నా చిన్నిప్రపంచం...


4, అక్టోబర్ 2010, సోమవారం

బంగారు పాపాయి...


మా ఇంట్లో మొదటి అమ్మాయిని.
నేను పుట్టినందుకు ప్రక్రుతి ఆనందంతో నాట్యం చేసిందో..
నదులూ,సముద్రాలూ ఉత్సాహంగా ఉరకలు వేసాయో తెలియదు కానీ..
మా అమ్మా,నాన్న మాత్రం మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అని పండగ చేసుకున్నారంట.
నన్ను లోకానికి ఆనందంగా ,ప్రేమతో ఆహ్వానించారట.
అందరు తల్లిదండ్రుల్లాగానే నేను లైఫ్ లో సక్సెస్స్ అవ్వాలని,గొప్పదాన్ని అవ్వాలని
నన్ను గురించి ఎన్నో కలలు కన్నారట ...

బాలసరస్వతి గారి "బంగారుపాపాయి" పాటలో లాగా మా అమ్మ కూడా నా గురించి ఎన్నో కలలు కనేది.

బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
పాపాయి చదవాలి మా మంచి చదువు..
పాపాయి చదవాలి మా మంచి చదువు..

"
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
ఘన కీర్తి తేవాలి...ఘన కీర్తి తేవాలి ...

దేశ మేజాతి ఎవరింటిదీ పాప...
ఎవ్వరీ పాపయని అందరడగాలి..
తెనుగుదేశము నాది , తెనుగు పాపను నేను,
అని పాప జగమంత ఖ్యాతి వెలిగించాలి ...

బంగారు పాపాయి బహుమతులు పొందాలి.
పాపాయి చదవాలి మా మంచి చదువు ...
పాపాయి చదవాలి మా మంచి చదువు ...


అమ్మ కోరిక తీర్చగలిగేలా ఎదగాలని కోరుకుంటూ..
There's a reason behind every thing in this world.
But am I born for a reason too...

And if so, what might it be?
That is the greatest mystery behind every life.


"Every failure should become a stepping stone to success..
Learn from your mistakes..."




9, మే 2010, ఆదివారం

అమ్మ అన్నది ఒక కమ్మని మాట


అమృతానికి అర్పణకీ ఆది పేరు అమ్మ
ఆలయాన
దేవుని ప్రతిరూపం అమ్మ

ఇలలో
స్వర్గాన్ని సృష్టించేది అమ్మ

లోకం గుడి చేరగ తొలి వాకిలి అమ్మ...

అమ్మ లేని ప్రపంచం లేదు.అలాగే నా చిన్ని ప్రపంచంలో నా బంధువు, నా స్నేహితురాలు,నా గురువు అన్నీ ముందుగా అమ్మే.
ఎప్పుడు నా వెంట వుంటూ ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అమ్మ

చిన్నప్పటినుండి నా డ్రెస్ డిజైనర్ కూడా అమ్మే.తనే సొంతగా నా డ్రెస్లు డిజైన్ చేసి కుట్టేది.
ఫాబ్రిక్ పైంట్ చేసేది.ఆ డ్రెస్ లు బాగున్నాయని నా ఫ్రెండ్స్ మెచ్చుకుంటే చాలా గర్వంగా వుండేది.
ఇది మా అమ్మ కుట్టింది అని గొప్పగా చెప్పేదాన్ని.

ప్రతి విషయంలో అమ్మ సలహా నాకు తప్పనిసరి.

మనం చేసినా చేయకపోయినా అన్ని పనులు నేర్చుకుని వదిలేయాలి అని చెప్పేది మా అమ్మ.
అప్పుడు అమ్మ అట్లా నేర్పింది కాబట్టే ఇప్పుడు నేను అన్ని పనులు ఎవరి సహాయం లేకపోయినా చేసుకోగలుగుతున్నాను అనుకుంటాను.

నా హాబీలలో మంచి పాటలు వినడం,పుస్తకాలు చదవటం,పూజలు చేసుకోవటం,
ఇల్లు అందంగా సర్దటం ఇలాంటివన్నీ అమ్మ నుండి నేను నేర్చుకున్నవే.

నాకు,మా తమ్ముడికి,చెల్లికి మీరు ఎప్పుడు ఒకరిని ఒకరు వదిలి పోకూడదు, కలిసి వుండాలి.
ఒకరి పై ఒకరు ప్రేమగా వుండాలి అని చెప్తూ వుంటుంది మా అమ్మ.
మా మధ్య వున్న ప్రేమాభిమానాలకు మూలం మా అమ్మ.

పిల్లల క్షేమాన్ని కోరుకుని వాళ్ళ అభివృద్ధికి పాటుపడే అమ్మ దీవెనే మనకి శ్రీరామరక్ష.

మన కోసం అహర్నిశలు శ్రమించే అమ్మకి మనం ఇచ్చే బహుమతి మన ప్రేమ ఒక్కటే.
మన అవసరాలను తీర్చి మనల్ని మనిషిగా తీర్చిదిద్దిన అమ్మకి ఆమె అవసరంలో మనం ఉన్నామన్న ధైర్యాన్ని కలిగించాలి.
నా కోసం నా పిల్లలు ఏదైనా చేయగలరు అని అమ్మ అనుకునేలా చేయగలగాలి.
చిన్నప్పుడు సలహాలుగా అనిపించిన అమ్మ మాటలు పెద్దయ్యాక చాదస్తంగా అనిపించకూడదు.

మన కోరికలు తీర్చిన అమ్మకి కూడా కోరికలు వుంటాయి వాటిని తీర్చాల్సిన బాధ్యత పిల్లలది.
మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న అమ్మని మనం కూడా అలాగే చూడాల్సి వచ్చిన రోజున అమ్మని నిర్లక్ష్యం చేయకపోవటం మనం అమ్మకి ఇచ్చే గొప్ప బహుమతి.

మా అమ్మ కోరికలను,ఆశయాలను తీర్చగలిగే శక్తిని,అమ్మని ఆనందంగా ఉండేలా చేయగలిగే పరిస్తితులను భగవంతుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ

అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.


నేను వర్షంలో తడిచి ఇంటికి వచ్చినప్పుడు
గొడుగు తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు తమ్ముడు
వర్షం ఆగిన తర్వాత రావచ్చు కదా అని సలహా ఇచ్చింది చెల్లి
జలుబు చేస్తే గానీ అప్పుడు తెలుస్తుంది నీకు ఇది నాన్న బెదిరింపు
కానీ
నా తల తుడుస్తూ అమ్మ అంది ఈ వెధవ వర్షం ఇప్పుడే రావాలా
నువ్వు ఇంటికొచ్చేదాకా ఆగొచ్చు కదా... అని.
అమ్మ ప్రేమ అంటే ఇదే కదా..

అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ గురించి కమ్మని పాటలు


అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా

దైవానికి మరో రూపం అమ్మ.తన పిల్లలే ప్రపంచంగా బ్రతికే అమ్మని గురించి చాలా పాటలు వున్నాయి
వాటిలో నాకు నచ్చిన కొన్ని పాటలు మాతృ దినోత్సవం సందర్భంగా
నా ''సరిగమలు-గలగలలు''
బ్లాగ్ లో ...

పాటలన్నీ మా చెల్లి రమ్యా నాయుడు సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు.
http://raaji-telugusongslyrics.blogspot.in/2010/05/blog-post_08.html


అమ్మ పాటలు


http://raaji-telugusongslyrics.blogspot.in/2012/05/blog-post_13.html



Related Posts Plugin for WordPress, Blogger...