పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, జనవరి 2012, బుధవారం

యాదగిరిగుట్ట ట్రిప్ విశేషాలు



మా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.

నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.





























ఇక్కడి
నుండి యాదగిరిగుట్ట లోని "కుందా సత్యనారాయణ కళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.






ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు,
పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది.
ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం..  భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు,  కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు
ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.



టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు
20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము.
ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం - యాదగిరి గుట్ట
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము.
సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు.
గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు,
అలంకరణ చాలా బాగుంది.
లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని,
వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని,
బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి...
కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి.
ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు..
మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..

8 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగున్నాయి మీ ట్రిప్ విశేషాలు! ఈ రకముగా దర్శన భాగ్యం కలిగింది! నెనెప్పటి నుంచో వెళదామనుకుంటున్నాను! ఎప్పటికి వెళతానో ఏంటో?

మాలా కుమార్ చెప్పారు...

మేము చాలా సార్లు భువనగిరి మీదుగా వెళ్ళినా ఎప్పుడూ కోట చూడటం పడలేదు . ఆ కోట చూడటము 40 ఏళ్ళ నుంచి పోస్ట్ పోన్ అవుతోంది :)

buddhamurali చెప్పారు...

bagundi twaralone vellalani anukuntunnam(pallalatho patu

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ ట్రిప్ విశేషాలు నచ్చినందుకు థాంక్సండీ !
యాదగిరి గుట్టనిజంగా చూడదగిన ప్రదేశం..
త్వరగా మీకు కూడా నరసింహస్వామి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలాకుమార్ గారు 40 సంవత్సరాలనుండి
పోస్ట్ పోన్ చేస్తున్నారా
ఇప్పటికైనా తప్పకుండా చూడండి..
మేమందుకే ఎప్పుడు అనుకున్న పని అప్పుడే చెయ్యాలని చూసేసాము :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"buddha murali" గారూ థాంక్సండీ..
యాదగిరి గుట్ట చూడదగిన ప్రదేశం..
తప్పకుండా వెళ్ళిరండి మీ పిల్లలతో పాటూ ..!

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారూ బావున్నాయండీ ట్రిప్ విశేషాలు. ఫోటోలు పెట్టి మాక్కూడా యాదగిరి గుట్ట చూపించేశారుగా.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జ్యోతిర్మయి గారూ ట్రిప్ విశేషాలు నచ్చినందుకు థాంక్సండీ..
అవునండీ అందరూ చూస్తారనే ఫొటోలు కూడా పెట్టాను.
ఐతే స్వామి వారి దర్శనం చేసుకున్నారన్నమాట

Related Posts Plugin for WordPress, Blogger...