పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, జూన్ 2011, శనివారం

రమ్య వెడ్స్ భద్ర


మా చిన్నారి చెల్లి రమ్య పెళ్లి కూతురయ్యింది...
జనవరిలో నిశ్చితార్ధం జరిగిన మాచెల్లి రమ్య వివాహం 09-06-2011 న తిరుమలలో
పచ్చనిపందిరిలో వేదమంత్రాల సాక్షిగా దేవుని దీవెనలతో..పెద్దల మరియు బంధుమిత్రుల
ఆశీస్సులు,అభినందనలతో కన్నులపండుగగా,సంతోషంగా జరిగింది..
ఇప్పటిదాకా మా ఇంటి యువరాణి ఇప్పుడు తన ఇంటి మహారాణి అయ్యింది..
భార్యాభర్తలుగా కొత్తజీవితాన్ని ప్రారంభించిన మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర
మీ దాంపత్య జీవితం ఎప్పుడు సంతోషమయం కావాలని, ఒకరికి ఒకరు అన్నివేళలా తోడునీడగా
సాగిపోవాలని కోరుకుంటూ....


మీకు మా హృదయపూర్వక వివాహమహోత్సవ శుభాకాంక్షలు..

శతమానంభవతి శతమానంభవతి
శతమానంభవతి మీకు శతమానంభవతి
ఒక ఒంట్లోనె కాపురమున్న శివుడూ పార్వతీ..
శతమానంభవతి మీకు శతమానంభవతి
తనువులు రెండూ తామొకటైనా సీతారాములకీ
శతమానంభవతి మీకు శతమానంభవతి
నూరేళ్ళ మీ నిత్య కళ్యాణ హేలా..
శతమానంభవతి మీకు శతమానంభవతి



Related Posts Plugin for WordPress, Blogger...