పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, అక్టోబర్ 2010, సోమవారం

బంగారు పాపాయి...


మా ఇంట్లో మొదటి అమ్మాయిని.
నేను పుట్టినందుకు ప్రక్రుతి ఆనందంతో నాట్యం చేసిందో..
నదులూ,సముద్రాలూ ఉత్సాహంగా ఉరకలు వేసాయో తెలియదు కానీ..
మా అమ్మా,నాన్న మాత్రం మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అని పండగ చేసుకున్నారంట.
నన్ను లోకానికి ఆనందంగా ,ప్రేమతో ఆహ్వానించారట.
అందరు తల్లిదండ్రుల్లాగానే నేను లైఫ్ లో సక్సెస్స్ అవ్వాలని,గొప్పదాన్ని అవ్వాలని
నన్ను గురించి ఎన్నో కలలు కన్నారట ...

బాలసరస్వతి గారి "బంగారుపాపాయి" పాటలో లాగా మా అమ్మ కూడా నా గురించి ఎన్నో కలలు కనేది.

బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
బంగారు పాపాయి బహుమతులు పొందాలి..
పాపాయి చదవాలి మా మంచి చదువు..
పాపాయి చదవాలి మా మంచి చదువు..

"
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
ఘన కీర్తి తేవాలి...ఘన కీర్తి తేవాలి ...

దేశ మేజాతి ఎవరింటిదీ పాప...
ఎవ్వరీ పాపయని అందరడగాలి..
తెనుగుదేశము నాది , తెనుగు పాపను నేను,
అని పాప జగమంత ఖ్యాతి వెలిగించాలి ...

బంగారు పాపాయి బహుమతులు పొందాలి.
పాపాయి చదవాలి మా మంచి చదువు ...
పాపాయి చదవాలి మా మంచి చదువు ...


అమ్మ కోరిక తీర్చగలిగేలా ఎదగాలని కోరుకుంటూ..
There's a reason behind every thing in this world.
But am I born for a reason too...

And if so, what might it be?
That is the greatest mystery behind every life.


"Every failure should become a stepping stone to success..
Learn from your mistakes..."
4 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

అంతే రాజి, అదే కదా తరతరాలు కొనసాగేది. 'తల్లిని మించిన దైవం లేదని ' ఊరికే అన్నారా!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

GoodMorning.. జయ గారూ
మీరు చెప్పింది నిజమేనండీ
అమ్మని మించిన దైవం లేదు.అమ్మ అమ్మే.

మాలా కుమార్ చెప్పారు...

ఈ పాట మా చిన్నప్పటిది . ఐనా ఎవర్ గ్రీన్ పాట. అమ్మ మనసును తెలిపే మధురమైన పాట . నా చిన్నప్పుడు , మా అమ్మ , అత్తయ్య పాడేవారట. నాకూ చాలా ఇష్టం ఈ పాట.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు మాలాకుమార్ గారూ..
అమ్మమనసు తెలిపే ఈ పాట నాకు కూడా
చాలా నచ్చిందండీ..

Related Posts Plugin for WordPress, Blogger...