పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, మే 2011, శుక్రవారం

వంశీ --- వయ్యారి గోదారి


తెలుగు సినిమాల్లో నాకు ఎక్కువగా నచ్చే సినిమాలు...
ఇప్పటికీ, ఎప్పటికీ Ever Green అనిపించుకునే సినిమాలు దర్శకుడు వంశీ గారివి.
ఈయన సినిమాల్లో గోదావరి అందాలను చాలా చక్కగా చూపిస్తారు.
గోదావరి అందాలతో పోటీ పడేలా వుండే కధానాయిక వంశీ సినిమా ప్రత్యేకత.
కధానాయిక పాత్ర,కట్టుబొట్టు చాలా బాగుంటుంది.
కాటుకకళ్ళు ,వాలుజడ,కాటన్ చీర,పెద్ద నల్లటి బొట్టు,చూడగానే వంశీ హీరోయిన్ అని చెప్పగలిగే ప్రత్యేకత
వంశీ వయ్యారి గోదారమ్మ సొంతం ... వీళ్ళలో ప్రత్యేకస్థానం భానుప్రియకే అని నా అభిప్రాయం..

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడగట్టి...కొండమల్లెలే కొప్పునపెట్టి
వచ్చే దొరసాని ... మా వన్నెల కిన్నెరసాని..
సితార 1984దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా
కరుణ కరిగి భువికి దిగిన సామజవరగమనా
లాయర్ సుహాసిని

మాటరాని
మౌనమిది మౌనవీణ గానమిది.
మహర్షి 1988వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ 1988


అల్లిబిల్లి
కలల రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే...
చెట్టు కింద ప్లీడర్ 1989ఎక్కడికీ
పరుగు ఎందుకనీ ఉరుకు
నీకోసం నేనుండగా మరి ముందుకు పోతావే అలా
w/o v వరప్రసాద్ 1997


ఎన్నెన్నోవర్ణాలు
అన్నిట్లో అందాలూ
ఒకటైతే మిగిలేది నలుపేనండి...
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.2002


నువ్వక్కడుంటే
నేనిక్కడుంటే ప్రాణం విలవిల
గోపి గోపిక గోదావరి 20096 వ్యాఖ్యలు:

ఇందు చెప్పారు...

చాలా బాగుంది మీ టపా! చాలా కష్టపడి వెదికినట్లున్నారు ఈ పాటల వీడియోలన్నీ! నాకు మొదటి పాట...అదే...కిన్నెరసాని పాట....చివరి రెండు పాటలు బోలెడు ఇష్టం :) కానీ ఈమధ్య వంశీ తీసే సినిమాల్లో కథ మీద,కథనం మీద అంత పట్టు ఉన్నట్టు కనిపించట్లేదు!! ఇదివరకు సినిమాలు మాత్రం సూపర్!! :)

మురళి చెప్పారు...

Beautiful..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఇందు గారు థాంక్స్ అండీ...
ఈ పాటల వీడియోలన్నీవెతకడానికి చాలా టైం పట్టింది..
మీరు చెప్పింది నిజమేనండీ నాకు కూడా వంశీ అప్పటి సినిమాలంతగా ఇప్పటి సినిమాలు నచ్చలేదు...
నా టపా నచ్చినందుకు tahnks..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thankyou మురళి Garu

మాలా కుమార్ చెప్పారు...

పాటల కలెక్షన్ బాగుంది .
కిన్నెరసాని వచ్చిందమ్మా పాట నాకు చాలా ఇష్టం .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పాటల కలెక్షన్ నచ్చినందుకు థాంక్యూ
మాలాకుమార్ గారు..

Related Posts Plugin for WordPress, Blogger...