పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, జులై 2011, సోమవారం

జీవితం ప్రతిపధం సమరమై సాగనీహిందీ లో "MeriJung" అనిల్ కపూర్ హీరోగా
తెలుగులో "విజృంభణ" శోభన్ బాబు హీరోగా నటించిన
సినిమాలో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట...
జీవితం గురించి,జీవితంలో ఎన్నిఎదురుదెబ్బలు తగిలినా
ధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించాలని చెప్పే పాట ఇది.
హిందీ,తెలుగు రెండిటిలో ఈ పాట చాలా బాగుంటుంది.

విజృంభణ(1986)
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమాగెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా

గగనమే రగిలినా
జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా


కమ్మని మనసులు కళకళలాడే కాపురం

తొలకరి ఎండకు తళతళలాడే గోపురం

మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం

పాపలు తిరిగే వాకిలి సుందర నందనం


నిప్పులు పైబడినా ఉప్పెనలెదురైనా

తడబడకా వడివడిగా నడిచేదే జీవితం...


జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా

జీవితం ప్రతిపధం సమరమై సాగనీ


చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం

మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం

పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా

ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం..


జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా

గగనమే రగిలినా ...

జీవితం జీవితం ప్రతిపధం ప్రతిపధం సమరమై సాగనీ

జీవితం జీవితం ప్రతిపధం ప్రతిపధం సమరమై సాగనీMeri Jung (1985)
Zindagi Har Kadam Ek Nayi Jung Hai

Related Posts Plugin for WordPress, Blogger...