పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, నవంబర్ 2011, సోమవారం

శ్రీశైలం శివమయం...శ్రీశైలం విశేషాలు..

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళటం మా చిన్నప్పటినుండి మాకున్న అలవాటు..
అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న శని, ఆదివారాల్లో శ్రీశైలం వెళ్లి వచ్చాము.
కార్తీక మాసం దానికి తోడు వీకెండ్ కావటంతో శ్రీశైలం భక్తులతో నిండి పోయింది.
శనివారం ఉదయాన్నే మొదలైన మా శ్రీశైలం ట్రిప్ చాలా హాయిగా,సంతోషంగా జరిగింది.
మా వూరి నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎక్కువగా వూర్లు వుండవు.
అక్కడక్కడా చిన్న చిన్న పల్లెటూర్లు,మధ్యలో అంతా కొండ మార్గంలో,పచ్చని పొలాల మధ్య
ముఖ్యంగా ఈ సారి ఎక్కువగా అరటి తోటలు వున్నాయి.
వీటన్నిటిని
చూసుకుంటూ సరదాగా సాగింది మా ప్రయాణం..
ముందుగా సాక్షి గణపతిని దర్శించుకుని రూమ్ కి వెళ్లి,కాసేపు రెస్ట్ తీసుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళాము.
శివాజీ
12 అడుగుల కాంస్య విగ్రహంసజీవమూర్తిలాగా చాలా బాగుంది.
ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే ఫోటోల ప్రదర్శనతో వున్న ధ్యాన మందిరం ప్రశాంతంగా వుంది.

ఆదివారం ఉదయాన్నే స్వామి,అమ్మవార్ల దర్శనం పూజలు అన్నీ
జనం
కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రశాంతంగానే జరిగాయి.
ఇక ఈ సారి శ్రీశైలంలో చెప్పుకోవాల్సిన విషయం సర్వాలంకార భూషితుడైన స్వామివారి దర్శనం...
ఎప్పుడూ అభిషేకజలాలతో,పంచామృతాలతో తడిసి ముద్దవుతూ వుండే మల్లిఖార్జునుడు
ఈ సారి ఎంతో కన్నుల పండుగగా పూర్తి అలంకారంలో దర్శనం ఇచ్చాడు.
బంధించే క్యూ లైన్లు మామూలే.మా చిన్నప్పటి శ్రీశైలంతో పోల్చుకుంటే ఇప్పటి శ్రీశైలం నాకెందుకో
బంధించినట్లుగా అనిపిస్తుంది..కానీ కాలం తో పాటు మార్పులు సహజం కదా..
దర్శనం అవ్వగానే బయటికి వచ్చి అందరం కార్తీక దీపాలు వెలిగించుకుని బయటికి వచ్చి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కి వెళ్లి,అక్కడ ఎవరూ చూడకుండా కొన్ని ఫోటోలు తీసుకుని ఇంటికి బయలుదేరాము.
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి అందరినీ
తమ చల్లని చూపులతో కాపాడాలని ప్రార్ధిస్తూ కొన్ని శ్రీశైలం విశేషాలు..

శ్రీ మల్లిఖార్జునస్వామి.
ఆలయంలోపలి స్వామివారి గోపురం
శ్రీశైలం ప్రయాణంలో కొన్ని విశేషాలు:
చెక్ పోస్ట్ దగ్గర కార్ దగ్గరికి వచ్చి అమ్మే చిరుతిండ్లు
అడవి మొదలవ్వగానే వెదురు చెట్ల మధ్యలో నుండి గుంపులుగా వచ్చే కోతులు మనం ఇచ్చే అరటిపళ్ళు,
కొబ్బరి చిప్పలు ఒక దాని మీద ఒకటి పోటీ పడుతూ తీసుకుని మెల్లగా వెనక్కి వెళ్లి పోతాయి.
మేము ఇచ్చిన అరటి పళ్ళు తిని ఫోటోలకు
ఫోజ్ ఇచ్చిన వానరులు
శ్రీశైలం కి 7 K.M దూరంలో వ్యూ పాయింట్
దగ్గర వున్న కృష్ణనంది..
శివాజీ స్ఫూర్తి కేంద్రం లోని శివాజీ కాంస్య విగ్రహం
మేము వున్న రూం బాల్కనీ నుండి కనిపిస్తున్న
అందమైన దృశ్యం
ఆటవికుల జీవన విధానాలని తెలియచేసే
చెంచులక్ష్మిట్రైబల్ మ్యూజియం
వీరభద్ర స్వామి
పార్వతీ పరమేశ్వరులు
దక్షిణామూర్తి
శ్రీశైలం వెళ్లి వచ్చే ప్రతి కార్ కి వేయించే ఆర్ట్

6 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగున్నాయి మీ యాత్రా విశేషాలు! ఆ శ్రీశైల మల్లిఖార్జుని దర్శనం చేసుకొని రెండేళ్ళు అయ్యింది! మీ టపా ద్వారా మళ్ళీ దర్శన భాగ్యం! మీకు చాలా మంచి అలవాటుందండీ! నేను కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండి పంచారామాలు చూసి రాత్రికి ఇంటి దగ్గర శివాలయంలో ఆకాశ దీపం పెట్టాక భోజనం చేయడం అలవాటు నాకు! అన్నట్టు పాపవినాశనం, పాల ధార, పంచ ధార చూడలేదా?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా టపా ద్వారా మీకు శ్రీశైల దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం రసజ్ఞ గారు.
ఐతే మీరు కూడా కార్తీకమాసం వ్రతం చాలా నిష్టగా చేస్తారన్నమాట ..
పాల ధార పంచ ధార ఇంతకుముందు వెళ్ళామండి..
కానీ ఇప్పుడు అమ్మకి హెల్త్ ప్రాబ్లం మెట్లు ఎక్కలేరు అందుకని మేము కూడా ఈ మధ్య అక్కడికి వెళ్ళటం లేదు..
మా యాత్రా విశేషాలు మీకు నచ్చిందుకు ధన్యవాదములు

జ్యోతిర్మయి చెప్పారు...

శ్రీశైలం మా పాప చిన్నగా ఉన్నప్పుడు అమ్మా వాళ్ళతో కలసి వెళ్ళాం. స్వామి దర్శనం, ఆ అడవుల్లో విహారాలు, డి౦గీలో ప్రయాణం.... మరుగున పడిన జ్ఞాపకాలను వెలికి తీసారు..ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జ్యోతిర్మయి గారు..శ్రీశైలంఅంటే నాకు కూడా మీలాగే అన్నీ ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలేనండీ..
మా శ్రీశైలం విశేషాలు మీ జ్ఞాపకాలను గుర్తుచేయటం నాకు చాలా సంతోషం

Dr Surya Ramachandra Varma చెప్పారు...

chala adhbhuthamga blagu chadivinavaru patha gnapakalu nemaresukuntu anandinchela chakkaga photolu mariu kadanamto chalala bagundi dhanyavalatho - Surya

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా బ్లాగు,నేను టపా వ్రాసిన
విధానం మీకు నచ్చినందుకు ధన్యవాదములు
Dr Surya Ramachandra Varma గారు

Related Posts Plugin for WordPress, Blogger...