పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

12, డిసెంబర్ 2011, సోమవారం

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో...


రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని
కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు
ఏప్రిల్ 29, 1848న జన్మించారు.
రాజా
రవివర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను
చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు.
భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి
అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు.
చీరకట్టుకున్న
స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో
చిత్రించడంలో అతనికి అతనే సాటి.
1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు
ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.
భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ,
1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు.
ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి.
ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.(Wikipedia)

ఎంతో అందంగా వుండి,హుందాగా వుండే రాజా రవివర్మ చిత్రాలు నాకు చాలా నచ్చుతాయి..
వీటిలో శకుంతల అందమైన,అమాయకమైన మొహాన్ని రవివర్మ జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు..
ఇంకా పళ్ళు చేతిలో పట్టుకున్న మహిళ,దమయంతీ హంస సంవాదము,యశోదకృష్ణ చిత్రాలు
చాలా బాగుంటాయి.
రవివర్మ చిత్రాలతో చేసిన "రవి వర్మకే అందనీ" పాటని యూ ట్యూబ్ లో ఇంతకుముందు చూశాను
కానీ 2 రోజుల క్రితం "ఎందుకో? ఏమో !" గారి బ్లాగ్ లో ఈ పాట చూసినప్పుడు నాకు కూడా
ఈ పాటని రవివర్మ చిత్రాలతో చేయాలనిపించింది.

నాకు నచ్చిన రవివర్మ చిత్రాలతో వీడియో మిక్సింగ్ చేసిన పాట:

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
By:Raaji..




రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి చూడని పాడనీ నవ్య రాగానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....
నీ పాటనే ... పాడనీ
రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
కదలాడనీ ...పాడనీ

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆ ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

****************
సినిమా:రావణుడే రాముడైతే
మ్యూజిక్:G.K.వెంకటేష్
లిరిక్స్:వేటూరి సుందరరామ్మూర్తి
సింగర్స్:S.P.బాలు,S.జానకి
****************


8 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

బాగుంది మీ ప్రయత్నం.

Unknown చెప్పారు...

బాగుందండీ 'రవి వర్మ' చిత్రాలతో బ్యాక్ గ్రౌండ్ పాట, చిత్రాలని ఫ్రేం లో ఫిట్ అయ్యేట్టు చేయటంతో అటొ, ఇటో సాగి కాస్త వాటి సహజత్వం దెబ్బదింది. ప్రయత్నం బాగుంది. మంచి చిత్రాలు సేకరించారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా ప్రయత్నం నచ్చినందుకు
థాంక్యూ "శిశిర" గారు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పాట,నేను సేకరించిన చిత్రాలు నచ్చినందుకు
థాంక్యూ చిన్ని ఆశ గారు..
మీరు చెప్పింది నిజమేనండీ కొన్ని చిత్రాలు సాగినట్లు ఉన్నాయని నిన్న మా అమ్మ కూడా చెప్పింది..
మీ స్పందనకు ధన్యవాదములు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!!రాజి!! గారు మంచి విషయం తెలియపరిచారు ధన్యవాదములు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"తెలుగుపాటలు" గారు నా మీ స్పందనకు ధన్యవాదములు..

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుంది రాజీ గారూ! చక్కని ప్రయత్నం! కాకపోతే మీరు దీనిని మీ సరిగమలు....గలగలలు బ్లాగులో పెట్టాల్సింది అనిపించింది!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పాట నచ్చినందుకు ధన్యవాదములు "రసజ్ఞ" గారు..
నేను చేసే పాటలన్నీ నా సరిగమలు ... గలగలలు బ్లాగ్ లో కూడా పోస్ట్ చేస్తానండీ..ఈ రోజు పోస్ట్ చేయటం కొంచెం లేట్ అయ్యింది..
ఇప్పుడే చేశాను...

Related Posts Plugin for WordPress, Blogger...