ఈ రోజు "raafsun" గారి బ్లాగ్ లో
"వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు...."
అన్న పోస్ట్ చూసిన తర్వాత ,కొంత మంది అలా వున్నా మనమందరం భారతీయులం,
భారతీయులంతా ఒక్కటే అనుకునే వాళ్ళు కూడా వుంటారు అని నేను నమ్ముతాను. అందుకే ఈ పోస్ట్..
"వీళ్ళు ముస్లిములు కారు.....వీళ్ళ మతం ఇస్లాం కాదు...."
అన్న పోస్ట్ చూసిన తర్వాత ,కొంత మంది అలా వున్నా మనమందరం భారతీయులం,
భారతీయులంతా ఒక్కటే అనుకునే వాళ్ళు కూడా వుంటారు అని నేను నమ్ముతాను. అందుకే ఈ పోస్ట్..
దేశం మనదే ...తేజం మనదే
దేశం మనదే ...తేజం మనదే
దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతి మనదే ... జాతిమనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం వుంది ఈనేలలో
ఆత్మీయరాగం వుంది ఈగాలిలో .
ఏకులమైన ... ఏమతమైనా
ఏకులమైన ... ఏమతమైనా భరతమాత కొకటేలేరా ...
ఎన్నిబేధాలున్నా ... మాకెన్నితేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా
వందేమాతరం అందాం అందరం
వందేమాతరం అందాం అందరం
దేశంమనదే ...తేజంమనదే
ఎగురుతున్నజండామనదే
నీతిమనదే ...జాతిమనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం వుంది ఈనేలలో
ఆత్మీయరాగం వుంది ఈగాలిలో ..
ఏకులమైనా ...ఏమతమైనా
భరతమాత కొకటేలేరా
రాజులు ఐనా పేదలుఐనా
భరతమాత సుతులేలేరా...
ఎన్నిదేశాలున్నా... మాకెన్నిదోషాలున్నా
దేశమంటే ప్ర్రాణమిస్తాం అంతాఈవేళా
వందేమాతరం అందాంఅందరం
2 కామెంట్‌లు:
ఏ కులమైనా ,ఏ మతమైనా పరవా లేదు.కాని,మా మతం వేరు,మా భాషా సంస్కృతి, వేరు అంచేత మాకు వేరే రాజ్యం కావాలి అనకుండా ఉండే వరకు .పాకిస్తాన్ అలాగే కదా ఏర్పడింది.ఖలీస్థాన్ ,నాగాలాండ్, కాశ్మీర్, ప్రత్యేక ఉద్యమాలు అలాగే కదా పుట్టేయి.భారత దెశ ఐకమత్యానికి,ప్రాదేశిక సమగ్రతకి భంగం తీసుకు రానంతవరకూ, ఎవ రు ఏ కులమైనా,ఏ మతమైనా,ఏ భాష ఐనా,పరవా లేదు.
"భారతదేశ ఐకమత్యానికి,ప్రాదేశిక సమగ్రతకి భంగం తీసుకు రానంతవరకూ, ఎవరు ఏ కులమైనా,
ఏ మతమైనా,ఏ భాష ఐనా,పరవాలేదు."
కమనీయం గారూ చాలా మంచి మాట చెప్పారండీ..
మీ స్పందనకు ధన్యవాదములు ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి