అన్నట్లుగా జరిగింది నా పుట్టినరోజు..
ఉదయాన్నే కుటుంబ సభ్యులందరి శుభాభినందనలతో మొదలైన నా పుట్టినరోజు
రోజంతా బంధువులు,స్నేహితుల శుభాకాంక్షలతో, నా ప్రియమైన వాళ్ళందరి మధ్య
BirthDay సెలెబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది.
ముఖ్యంగా నా పుట్టినరోజుకి ప్రత్యేక అతిధులు మా చెల్లి,మరిది గారు లీవ్ లేకపోయినా
వీలు కల్పించుకుని వచ్చి నా పుట్టినరోజుని ఒక మరిచిపోలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశారు..
జీవితంలో ఏమి సాధించినా, సాధించకపోయినా,సంపాదించినా,సంపాదించకపోయినా
"నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు... నేనున్నానని నిండుగా పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము" అన్న మాట ఎంతో నిజం కదా..
అలా నా జీవితంలో ప్రతి సుఖంలో,కష్టంలో,గెలుపు, ఓటముల్లో తోడుండే
నా చిన్నిప్రపంచం లో అతి ముఖ్య భాగమైన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు..
With Love : Sister & Brother In Law
ఇంక ఈ సంవత్సరం నా పుట్టినరోజుని మరింత అద్భుతమైనదిగా మార్చింది
నా చిన్నిప్రపంచం,నా చిన్ని ప్రపంచంలో నా "బ్లాగ్ స్నేహితులు"...
నా చిన్నిప్రపంచం బ్లాగ్ లో ,నాకిష్టమైన పాటలు సరిగమలు...గలగలలు బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ వున్నాను..
అప్పుడప్పుడు కొంతమంది బాగుందని కామెంట్స్ ఇచ్చేవారు.
నా బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుండి నాకు ఎక్కువ కామెంట్ ఇచ్చి,నన్ను ప్రోత్సహించే వాళ్ళు
''మనస్వి- జయ'' గారు, ''సాహితి - మాలా కుమార్'' గారు ... ఇద్దరు దాదాపు నేను పెట్టే ప్రతి టపాలో
వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసే వారు..
తర్వాత ''వనజ వనమాలి'' గారు ఎక్కువగా నా చిన్నిప్రపంచానికి వచ్చేవారు,
నాభావాలను మెచ్చుకునే వారు..
ఇప్పుడు ''కడలి - సుభా గారు'' , ''నవరసజ్ఞ భరితం - రసజ్ఞ'' గారు,
"శర్కరి - జ్యోతిర్మయి"గారు, ''ఎందుకో?ఏమో!'' గారు నాచిన్ని ప్రపంచంలో కొత్త అతిధులు..
నా ప్రతి టపాలో వాళ్ళ అభిప్రాయాలను నాతో పంచుకునే స్నేహితులు..
నా పుట్టిన రోజుకి కూడా నేను బ్లాగ్ లో పోస్ట్ పెట్టాను..కానీ నేను ఊహించనంత అభిమానం
నా బ్లాగ్ మిత్రుల నుండి లభించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కామెంట్ ఇవ్వని వాళ్ళు కూడా
నాకు BirthDay శుభాకాంక్షలు చెప్పి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించారు..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటమే కాదు నాబ్లాగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియచేశారు..
నా ఈ బ్లాగ్ మిత్రుల అభిమానం,శుభాభినందనలు
నా పుట్టిన రోజుని మరువలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశాయి..
నా బ్లాగ్ ఫ్రెండ్స్ లో పెద్దల దీవెనలతో,స్నేహితుల శుభాకాంక్షలతో,అభినందనలతో...
నా ఫ్రెండ్ 'సుభా' గారి 'సుభా'కాంక్షలతో పాటు అందించిన దీవెనల చిరుకానుక తో నా పుట్టినరోజు మరపురానిది..మధురమైనది గా నిలిచిపోయింది..

13 కామెంట్లు:
చిన్నిప్రపంచం చిన్నారి రాజికి పుట్టినరోజు శుభాకాంక్షలు,
దీర్ఘాయుష్షు,యశస్సు కలిగి,
నీ కోరికలన్నీ నెరవేరాలని,నీ జీవితంలో
నీ కన్న తల్లిదండ్రులు కన్న కలలన్నీ
నిజం కావాలని..
నీ చిన్నిప్రపంచం నిత్యనూతనంగా,నందనవనంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ దీవెనలతో...
నాని
మీ జీవితంలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.
థాంక్స్ కూడా చాలా అందం గా చెప్పారు .
వెల్కం :)
నాని గారు నా చిన్నిప్రపంచానికి స్వాగతం
మీ దీవెనలకి..మీ శుభాభినందనలకి
ధన్యవాదములండీ..
మీ ఆశీస్సులన్నీ ఫలించాలని భగవంతుడిని కోరుకుంటాను..
ThankYou VeryMuch For Your Best Wishes..
జ్యోతిర్మయి గారు మీరందరు ( బ్లాగ్ స్నేహితులు ) నా చిన్నిప్రపంచంలో,నా జీవితంలో భాగం కావటం నిజంగా చాలా సంతోషంగా వుందండీ..
ఎవరికి ఎవరు తెలియకపోయినా ఒకరి భావాలను,అభిరుచులను మరోకరు ప్రొత్సహిస్తూ ఒక మంచి స్నేహభావాన్ని ఏర్పరుచుకోవటం నిజంగా
గొప్ప విషయం..
నిన్న మీరందరు నాకు అందించిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఏదో ఒక కామెంట్ మాత్రమే కాదు
నన్ను అభిమానించే వాళ్ళు ఇక్కడ కూడా వున్నారు అన్న సంతోషాన్ని కలిగించింది..
నా జీవితంలోకి మీరు మంచి స్నేహితురాలిగా వచ్చినందుకు మీకు ధన్యవాదములు..
మాలా కుమార్ గారు నా చిన్నిప్రపంచాన్ని మెచ్చుకుని ప్రొత్సహించే మీరందరు..
మీ శుభాభినందనలతో నా పుట్టినరోజును ఒక SweetMemory గా గుర్తుండి పోయేలా చేశారు
అందుకే ఇలా థాంక్స్ చెప్పాను.
నా ప్రయత్నం మీకు నచ్చినందుకు ధన్యవాదములు
ఛ!! నేను ఎప్పుడూ లేట్ !! ఇంతకీ చాక్లెట్లు ఉన్నాయా ఐపోయినయా??
కొంచెం లేట్ గా అయినా వెరైటీగా "పుట్టిన డే ముబారక్ !!"
చాక్లెట్లు ఉన్నాయో అయిపోయాయో?? నాకిస్తారో లేదో ? ఎన్ని మిగిలినయ్యో !! :) :)
( ప్రపంచం గుండ్రంగా ఉంటుంది అంటారు..నిజంగా ఉంటె నా కామెంటు మళ్ళి మీకు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది :):)
శ్రేయోభిలాషి
RAAFSUN
శ్రేయోభిలాషి raafsun గారు లేట్ గా చెప్పినా మీ
వెరైటీగా "పుట్టిన డే ముబారక్ !!" కి
నా హ్రుదయపూర్వక ధన్యవాదములండీ..
"ప్రపంచం గుండ్రంగా ఉంటుంది అంటారు..నిజంగా ఉంటె నా కామెంటు మళ్ళి మీకు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది "
ప్రపంచం గుండ్రంగానే వుంటుంది అందుకే మీ కామెంట్ తప్పకుండా నాకు మళ్ళీ కనిపిస్తుందనుకుంటాను..
ThankYou VeryMuch For Your BestWishes..
వావ్ రాజి గారూ నా పేరు మీ బ్లాగ్‌లో! నన్ను మన కుటుంబంలో కలిపినందుకు చాలా ఆనందంగా ఉంది! ధన్యవాదాలు ఇంత అందంగా కూడా చెప్తారనమాట!
మీరు నా కుటుంబంలో కలిసిపోయినందుకు నాకు కూడా ఆనందంగా వుంది రసజ్ఞ గారు..
నా బ్లాగ్ మిత్రులందరు శుభాకాంక్షలతో,దీవెనలతో
నా పుట్టినరోజును ఒక SweetMemory గా గుర్తుండేలా చేశారు..
మరి అంత మంచి ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పాలి కదా..
అందుకే ఇలా ప్రయత్నించానన్నమాట
అందమైన నా ధన్యవాదములు మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ..
be lated happy birthday.maa baabu birthday koodaa rendo tedi...))))
raaji gaaru mee bloglo follow ledu anduke follow kaaleka potunnaanu....friendly sasi
శశికళ గారు మీ బాబు పుట్టినరోజు కూడా
నా పుట్టినరోజునే అన్నమాట..
మీ బాబుకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి..
నా చిన్నిప్రపంచాన్ని మర్చిపోకుండా వచ్చినందుకు,
మీ పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి