పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, జనవరి 2012, బుధవారం

కొంటె బాపు గీతలు - ముళ్ళపూడి రాతలు


మొన్న ఆదివారం ఈ టీవీలో "పరిపూర్ణ మహిళ" చూశాను అందులో ఒక ఆవిడని మీరు,మీ వారు
10 రోజులుగా ఏవో గొడవలవల్ల మాట్లాడుకోవటం లేదు.అప్పుడు మీ వారు మిమ్మల్ని బుజ్జగించి,
నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే అది ఎలా చేస్తారో మీ వారిలాగా మీరు యాక్ట్ చేసి చూపించండి
అని అడిగారు జడ్జెస్.కానీ ఆవిడకి సరిగా చేయటం రాలేదు..

నాకనిపించింది ఈవిడ పెళ్లి పుస్తకం సినిమా చూస్తే ఖచ్చితంగా విన్ అయ్యేది.
పాపం సినిమా చూడలేదో , లేకపోతె సీన్ గుర్తుకు రాలేదో అని.
పెళ్లి పుస్తకం సినిమాలో రాజేంద్రప్రసాద్ బాస్ కూతురుతో చనువుగా ఉంటున్నాడని దివ్యవాణి అలిగితే,
ఆ అలకని రాజేంద్రప్రసాద్ ఎంత చక్కగా తీర్చాడో చూడండి.

కొంటె బాపు గీతలున్న,ముళ్ళపూడి రాతలున్న "పెళ్లి పుస్తకాన్ని" చదివి అప్పచెప్పుదాం
అన్నరేంజ్ లో గుర్తుంచుకుని పాటించాల్సిన మంచి విషయాలు ఎన్నో వున్నాయి ఈ సినిమాలో
నాకు ఎప్పటికీ నచ్చే సినిమాల్లో పెళ్లి పుస్తకం ఒకటి. ఇందులో ఈ సీన్,ఈ పాట రెండు చాలా బాగుంటాయి .

సరికొత్త చీర ఊహించినాను




10 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

రోజూ చూసినా విసుగు పుట్టని సినిమా అండీ! పెళ్ళయ్యాక ఇలా ఉంటుందా? అనిపిస్తుంది చూసినప్పుడల్లా! నాకెంతో ఇష్టమయిన పాట కూడా! మీ అభిరుచి నాకు కూడా నచ్చింది!

Unknown చెప్పారు...

చాలా మంచి మూవీ! మంచి విలువలతో తీసిన గ్రంధం "పెళ్ళి పుస్తకం"...కానీ జీవితం లో ఎందరి పెళ్ళిపుస్తకాలు అలా ఉంటాయి?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ! పెళ్లి అయితే ఇలాగే కాదండీ
ఇంకా రకరకాలుగా కూడా వుంటుంది
ఉగాదిపచ్చడిని కూడా మించిపోయేలా :)
ఐతే నాకు నచ్చిన పాట,సినిమా మీకు కూడా ఇష్టమన్న మాట
మీ స్పందనకు ధన్యవాదములు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"చిన్ని ఆశ" గారు మీ సందేహం కరెక్టేనండీ..
కొన్ని కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంటాయి
అలాంటిదే ఈ పెళ్ళిపుస్తకం కూడా!
ఐనా ఇది నా అభిప్రాయం మాత్రమే ఒకవేళ వుంటే వుండొచ్చేమో?
మీ స్పందనకు ధన్యవాదములు..

సుభ/subha చెప్పారు...

హా హా రాజి గారూ రసజ్ఞ గారికి మంచి జవాబే చెప్పారు,ఇంకా రకరకాలుగా కూడా వుంటుంది
ఉగాదిపచ్చడిని కూడా మించిపోయేలా అని. పెళ్ళి పుస్తకం..అదొక మధుర కావ్యం.ఇందులో ఈ పాట, పెళ్ళి పాటా కూడా నాకెంతో నచ్చే పాటలు. ఇది సినిమాయే కాదు జీవితం కూడా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సుభ/subha" గారూ "రసజ్ఞ" గారికి
నేనేదో సరదాగా అలా చెప్పానండీ :)

నిజమే పెళ్లిపుస్తకం చాలా మంచి సినిమా.
పెళ్లి పాట బాగుంటుంది.
"అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో"

ఈ మాటలు ప్రతి భార్యాభర్తలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినవని నాకనిపిస్తుంది
ఈ పాట విన్నప్పుడల్లా..

మీ స్పందనకు ధన్యవాదములు..

మాలా కుమార్ చెప్పారు...

పెళ్ళిపుస్తకం ఎవర్ గ్రీన్ మూవీ అండి . గుమ్మడి చెప్పినట్లు సంసారం లో పాటిస్తే బాగానే వుంటుంది :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నిజమే మాలాకుమార్ గారు ..
ఈ సినిమాలో కొన్ని విషయాలు పాటిస్తే నిజంగా
ప్రతి ఒక్కళ్ళ పెళ్ళిపుస్తకం ఈ పెళ్ళిపుస్తకం లాగా
ఎవర్ గ్రీన్ గానే వుంటుందేమో..

జ్యోతిర్మయి చెప్పారు...

స్పది౦చే హృదయం ఇరువురికీ ఉంటే పెళ్లి పుస్తకాలు ఇలానే ఉంటాయ్. చక్కటి పాట చూపించారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జ్యోతిర్మయి గారు..
నిజమేనండీ ఏ బంధమైనా స్పందించే హృదయం వున్నప్పుడే ఎప్పటికీ సంతోషకరంగా వుంటుంది.

Related Posts Plugin for WordPress, Blogger...