కాలమా నీ పనే బాగుంది సుమా...!
కాలమా ఎంత అల్ప సంతోషివి నీవు?
నీ "రోజుల" చక్రానికి ఆయువు
ఇరవైనాలుగు గంటలు చాలనుకుంటావు
ధ్యానములోని తాపసిలా
ఎంత ప్రశాంతంగా ఉంటావు..!
కాలమా నీదెంత అదృష్టం..
గడచిన దాన్ని గురించి బాధపడక,
జరగబోయే దానికి చింతించక,
ఎవరి కోసం వేచి చూడక,
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం మాత్రమే నిజం అంటావు,
ఏ బంధాలకి బందీ కానంటావు.
వెనుకకి తిరిగి చూడటం తెలియని
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది.
ఒకరి చింత నీకు లేదు
ఎవరి నుంచి భయము లేదు.
ఎవరికీ ఏమి దాచవు
ఎవరి నుండి ఏమీ ఆశించవు.
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా!
కాలమా ఎంత అల్ప సంతోషివి నీవు?
నీ "రోజుల" చక్రానికి ఆయువు
ఇరవైనాలుగు గంటలు చాలనుకుంటావు
ధ్యానములోని తాపసిలా
ఎంత ప్రశాంతంగా ఉంటావు..!
కాలమా నీదెంత అదృష్టం..
గడచిన దాన్ని గురించి బాధపడక,
జరగబోయే దానికి చింతించక,
ఎవరి కోసం వేచి చూడక,
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం మాత్రమే నిజం అంటావు,
ఏ బంధాలకి బందీ కానంటావు.
వెనుకకి తిరిగి చూడటం తెలియని
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది.
ఒకరి చింత నీకు లేదు
ఎవరి నుంచి భయము లేదు.
ఎవరికీ ఏమి దాచవు
ఎవరి నుండి ఏమీ ఆశించవు.
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా!
14 కామెంట్లు:
కాలమా నీ పనే బాగుంది సుమా!
చక్కగా రాజి గారితో మంచి మంచి కవితలు వ్రాయించేస్తున్నావు,
బోలెడు మంది స్నేహితులని ఇచ్చేస్తున్నావు!
కాలాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. బావుంది మీ కవిత.
హాయ్ రాజీ నా పేరు భరత్,
నేను మీ భక్తి ప్రపంచం బ్లాగు చూసా చాలా బాగుంది
తిరుప్పావై - పాశురములు తెలుగు అర్ధంతో చక్కగా ప్రచురిస్తునారు.
కానీ బ్లాగులో కమ్మెంట్స్ పని చేయటం లేదు. అక్కడ కూడా కమ్మెంట్స్ పనిచేసేటట్లు చేయండి
మీ కవిత బాగుంది సుమా
"కాలమా నీ పనే బాగుంది సుమా!
బోలెడు మంది స్నేహితులని ఇచ్చేస్తున్నావు!"
నిజమే రసజ్ఞ గారూ కాలం నాకు బోలెడు మంది
మీలాంటి మంచి స్నేహితులను ఇచ్చింది..
కవిత నచ్చినందుకు థాంక్యూ..
జ్యోతిర్మయి గారూ కవిత నచ్చినందుకు,
మీ స్పందనకు థాంక్సండీ..
"radhe" గారూ నా భక్తిప్రపంచం బ్లాగ్ నచ్చినందుకు థాంక్సండీ..
భక్తిప్రపంచం బ్లాగ్ లో కామెంట్స్ రావటం లేదు.
నాకు ఆ బ్లాగ్ టెంప్లేట్ నచ్చింది అందుకే కామెంట్స్ రాకపోయినా టెంప్లేట్ అలాగే ఉంచేశాను.
ఆ బ్లాగ్ లో కామెంట్ రాకపోయినా మీ స్పందనను ఇక్కడ తెలియచేసినందుకు ధన్యవాదములు..
ThankYou "తెలుగు పాటలు" గారూ
కవిత నచ్చినందుకు..
నమస్తే రాజి గారు,
మీ కవిత కళాత్మకంగా ఉన్నది.
కాలమా కాస్త ఆగమ్మా
కను రెప్పను కదిలించకమ్మా
నడిచే పాదాలకు వేగం వద్దమ్మా
క్షణమై కరిగిపోకమ్మా
ఎందుకని అడుగుతావేమ్మా
కాస్త నిదానించి చూడమ్మా
నెచ్చెలి నిన్నే మెచ్చిందమ్మా
నీ కోసం ఒక కవితే అల్లిందమ్మా
ఆ చక్కని అల్లికను చూడటానికే
మేమిక్కడ ఆగామమ్మా
మరి నువ్వు కూడా రామ్మా..!
నమస్తే "Dsr Murthy" గారూ..
మీ స్పందనకు ధన్యవాదములు.
'ఆలస్యం అమృతం విషం అన్న సూక్తి గుర్తొచ్చి
హటాత్తుగా లేచి, హడావుడి గా పరిగెత్తాను.
అంతలోనే కాలు జారి కింద పడ్డాను.
అప్పుడు నాకు అర్ధమైంది. ఏమిటంటే ఆ సమయంలో ఆచరించాల్సింది నిదానమే ప్రధానమని'....కదూ:)... సో, సమయానికి ఇంత ప్రాధాన్యత ఉందన్న మాట. కవిత చాలా బాగుంది రాజీ.
"మేమందరం నీ గొప్పతనాన్ని వర్ణించేలా చేసిన
కాలామా నువ్వు మహా గడుసుదానివే సుమా!"
"సుభ" గారూ నేను చెప్పిన కవిత చూడటానికి
కాలాన్ని కూడా రమ్మని పిలుస్తూ
మీరు అల్లిన కవిత చాలా బాగుందండీ..
జయ గారూ...
ఆలస్యం అమృతం విషం అంటూనే
నిదానమే ప్రధానం అని,
సమయానికి తగు పనులు చేయాలనీ
చాలా చక్కగా చెప్పారండీ ..
కవిత నచ్చినందుకు,మీ స్పందనకు ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి