పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

6, జనవరి 2012, శుక్రవారం

కలల కౌగిలి - The Value Of Time


దోసిళ్లలో ఇసుక రేణువుల్లా జారిపోతున్నావే
ఎంతగా పిడికిలి బిగించినా
ఎంతగా బంధిద్దామని ప్రయత్నించినా
అంత త్వరత్వరగా పారిపోతున్నావే!

కలలకౌగిలి కరిగిపోక ముందే
మదిలో తలపులు తరలిపోకముందే
ఆలోచనలు అంతమవ్వకముందే
వెడలిపోతున్నావు…నీకెందుకంత తొందర?

జీవితం ఆస్వాదిద్దామన్నా
ప్రేయసి(ప్రియుడు) ప్రేమలో తరిద్దామన్నా
స్వప్నాల లోకంలో విహరిద్దామన్నా
దేనికీ సహకరించవే?

నిమ్మళంగా పనులు చక్కపెడదామన్నా
ప్రశాంతంగా కాసేపు కూర్చుందామ
న్నా
బద్దకంగా మరికాసేపు ఒద్దిగిల్లుదామన్నా
తీరికగా కబుర్లు చెప్పుకుందామన్నా
దేనికీ కాసేపు ఆగవే?

గాయం చేసేది నువ్వే ... మానిపేదీ నువ్వే
గుర్తు తెచ్చేదే నువ్వే ... మరిపించేదీ నువ్వే
బాధ పెట్టేదీ నువ్వే ... సంతోషాన్నీ మోసుకొచ్చేదీ నువ్వే
ఇంత శక్తి నీకెవరిచ్చారు?

ఎదురుచుపులో నత్తనడక నీదే
హడావుడిలో గుర్రపు స్వారీ నీదే
మాతోనే ఉన్నట్లు భ్రమ కలిగిస్తావు
సహకరించినట్లే వుంటావు
అందీ అందనట్లు పరుగులు తీస్తావు

నీ పరుగులో...మా అడుగులు జతపరచకపోతే
మిగిలేది శూన్యమే!


From: FaceBook TeluguQuotes

5 కామెంట్‌లు:

PALERU చెప్పారు...

అజ్జబాబోయ్....ఇది మీరే రాసరటండి !!! రాజి గారు!!!! భలే రాసారు....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"raf raafsun" గారూ ఇది నేను రాయలేదండీ మీరంత హాస్చర్యపోకండి :)
ఇది నేను FaceBook Telugu quotes community లో చూశాను
నచ్చింది ఇక్కడ మన బ్లాగర్లందరూ కూడా చదువుతారు కదా అని పోస్ట్ చేశాను..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou తెలుగు పాటలు Gaaru.

కాయల నాగేంద్ర చెప్పారు...

మీకు నచ్చిన 'కలల కౌగిలి' కవిత చాలా బాగుంది.
'ఒక మంచి కవతను చదివాను' అనే తృప్తి కలిగింది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank You కాయల నాగేంద్ర gaaru.

Related Posts Plugin for WordPress, Blogger...