ప్రేమ... ఒకరి గురించి మరొకరి మనసులో ఏర్పడే ఒక అద్భుతమైన భావన.
ప్రేమించిన వాళ్ళకోసం ఏమైనా సరే చేయాలనుకోవటం, వాళ్ళ కోసమే బతకాలనుకోవటం
జీవితాంతం ఒకరికొకరుగా జీవించాలనుకోవటం ఇదేనేమో ప్రేమంటే..
దేవత నీవే ... నా దేవత నీవే...,నిన్నుకంటికి రెప్పలా కాపడుతాను అంటూ
ఒక ప్రేమికుడు ప్రియురాలికి తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ పాడే ఈపాట
విశాల్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించిన "భయ్యా" సినిమాలోది.
మంచి సాహిత్యం,సంగీతం ఈ పాట లో ప్రత్యేకత.
అందుకే ఈ పాట నాకు నచ్చిన పాట.
జీవితాంతం ఒకరికొకరుగా జీవించాలనుకోవటం ఇదేనేమో ప్రేమంటే..
దేవత నీవే ... నా దేవత నీవే...,నిన్నుకంటికి రెప్పలా కాపడుతాను అంటూ
ఒక ప్రేమికుడు ప్రియురాలికి తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ పాడే ఈపాట
విశాల్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించిన "భయ్యా" సినిమాలోది.
మంచి సాహిత్యం,సంగీతం ఈ పాట లో ప్రత్యేకత.
అందుకే ఈ పాట నాకు నచ్చిన పాట.
దేవత నీవే ... నా దేవత నీవే...
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే
ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
చినుకై వచ్చి ... నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చి ... నీకోసం కడవై పోతాను
కలలా వచ్చి ... నీకోసం కన్నై పోతాను
ఉలిలా నన్ను తాకావో ... శిల్పాన్నవుతాను
నీఊపిరి తో ఈవెదురైన వేణువు కాదా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెల రాదా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూ నే తిరగనా
నీవే నేనై బ్రతకనా ... తలపుల తలుపులు తెరిచిన చెలి
జోరున కురిసే వానల్లో ఎండే నువ్వంటా
నిప్పులు చెరిగే ఎండల్లో వానే నువ్వంటా
ఏకాంతాన్ని వెలివేసే తోడే నువ్వంటా
శో కాలన్నీ తరిమేసే జాడే నువ్వంటా
నీ నవ్వుల్లో పూచేటీ పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటీ మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపమో గుండెలో వెలిగే దీపమో
పంచే తీయని తాపము
వలపుల పిలుపులు తెలిపిన మది
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే
ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
8 కామెంట్లు:
ప్రేమను మాత్రమే ఇన్నిరకాలు గా వర్ణించగలరు ఏమో .. ఎన్ని రకాలుగా చెప్పిన నిత్య నూతనముగా ఉంటది అదే ప్రేమ...
మంచి పాటను పోస్ట్ చేశారు ధన్యవాదములు
బాగుందండీ.. మొదటి సారి వినడం.
"తెలుగు పాటలు" గారూ థాంక్సండీ..
థాంక్యూ "సుభ" గారూ..
ప్రేమ అనే భావాన్ని అద్భుతంగా చెప్తూ చాలా మంచి పాట వినిపించారు.
ఇదే మొదటిసారి వినటం...చాలా బాగుంది.
"చిన్ని ఆశ" గారూ ..
ఐతే మీకు ఇప్పటిదాకా తెలియని పాటని వినిపించానన్నమాట.
పాట నచ్చినందుకు థాంక్సండీ..
చిన్ని ప్రపంచమంతా ప్రేమ మయం అయిందండోయ్!
"రసజ్ఞ" గారూ థాంక్సండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి