ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో నితిన్ ,నిత్యా మీనన్ నటించిన "ఇష్క్" నాకు నచ్చిన సినిమా ..
నితిన్ ఈ సినిమాలో ఇంతకు ముందు సినిమాలకు పూర్తి భిన్నంగా
కూల్ రొమాంటిక్ హీరోలా బాగున్నాడు.
సినిమా కధ విషయానికి వస్తే సరదాగా,అల్లరిగా ఉండే రాహుల్(నితిన్),అంతే అల్లరిగా
చిలిపితనంగా ఉండే ప్రియ(నిత్యా మీనన్) ఇద్దరూ డిల్లీ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణంలో
ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటారు.
అల్లరి పనులు చేస్తున్న రాహుల్ ను మొదట్లో ప్రియ కోపగించుకున్నా తన పర్స్,ఫోన్
విమానంలో మర్చిపోయినప్పుడు రాహుల్ హెల్ప్ చేయటం,అంతకు ముందే రోడ్డు మీద ట్రాఫిక్ లో
ఒక చిన్న పాప టెడ్డీ కింద పడిపోతే అంత ట్రాఫిక్ లో కూడా జాగ్రత్తగా టెడ్డీ ని పాపకి అందించిన
రాహుల్ మీద మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంటుంది ప్రియ.
హైదరాబాద్ కు వెళుతున్న విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోవడంతో తనకు గోవా అంటే
ఇష్టమని ఇప్పటికి చాలా సార్లు చూడాలనుకుని చూడలేదని రాహుల్ తో చెప్తుంది ప్రియ.
అప్పుడు నీకు గోవా చూపిస్తానని మాట ఇచ్చి,గోవాలో ఉన్న తన ఫ్రెండ్ పెళ్ళికి తీసుకెళతాడు.
హైదరాబాద్ తిరిగి వెళ్ళే సమయానికి రాహుల్,ప్రియ ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు.
హైదరాబాద్ వెళ్ళాక తెలుస్తుంది రాహుల్ కి ప్రియ అన్న శివ (అజయ్) తన అక్కని కాలేజ్ లో
ప్రేమిస్తున్నానని వేధించి, తన చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి అని.
ఇక అప్పటి నుండి రాహుల్,శివ ల మధ్య జరిగిన పోటీలో రాహుల్ ఎలా విజయం సాధించి
ప్రియను పెళ్లి చేసుకున్నాడన్నది సినిమా కధ.
హింసలు,గొడవలు లేకుండా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు
మంచి ఫీలింగ్ ని కలుగచేశాయి...ఇప్పుడెంతో గొడవ జరుగుతుందేమో అన్న సందర్భాల్లో కూడా
రాహుల్ ప్రాక్టికల్ జోకులు మనల్ని నవ్విస్తాయి.
సినిమాలో ఎక్కువమంది హాస్య నటులు లేకపోయినా ఆలీ ఉన్న ఒక్క సీన్లో నవ్వకుండా ఉండలేరు.
ఇంక నిత్యా మీనన్ చాలా ముద్దుగా,బొద్దుగా అందంగా ఉంది.అందరు ఆడపిల్లల్లాగే బంగారు గాజులంటే
పిచ్చి ప్రియాకి కూడా ఈ సినిమాలో .. గోవాలో రాహుల్ ఫ్రెండ్ పెళ్ళిలో నిత్యామీనన్,నితిన్
బంగారు నగలకి మోడలింగ్ చేసే మోడల్స్ లా, ముచ్చటైన జంటగా అందంగా ఉన్నారు.
నిత్యా మీనన్,నితిన్ చాలా క్యూట్ గా బాగున్నారు,నటన కూడా బాగుంది.
ఇష్క్ ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు,అక్క-తమ్ముడూ,అన్నా - చెల్లి
తల్లిదండ్రులు - పిల్లల మధ్య ప్రేమను కూడా చక్కగా చూపించిన సినిమా..
ఇబ్బందికరమైన డ్రెస్ లు,డైలాగ్ లు లేకుండా ఫామిలీ అందరూ కలిసి చూడగలిగేలా బాగుంది.
ఇష్క్ సినిమాకి "పిసి శ్రీరామ్" సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్నిచ్చిందని చెప్పొచ్చు.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా బాగుంది.
పాటలు వింటుంటే ఏవో వెనకటి పాత పాటలు వింటున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇప్పటి అర్ధం కాని గజిబిజి పాటల రోజుల్లో ఈ పాటలు చాలా బాగున్నాయి..
నాకు నచ్చిన పాట
... చిన్నదాన నీకోసం ...
5 కామెంట్లు:
chitram parichayam baagundi. paatalu vintoo.. ee comment.
very nice.
ఓ వారాంతానికి మరో మంచి సినిమా. ధన్యవాదాలు రాజిగారూ..
@ వనజవనమాలి గారూ..
@ జ్యోతిర్మయి గారూ..
సినిమా పరిచయం నచ్చినందుకు థాంక్సండీ.
బాగుందండీ మీ చక్కని పరిచయం..చూడాలని అనిపించేలా వ్రాసారు.ఎప్పుడు చూస్తానో ఏమో మరి..
"సుభ" గారూ.. సినిమా పరిచయం నచ్చినందుకు థాంక్సండీ..
తప్పకుండా చూడండి..సినిమా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి