సఫారీ ఎంట్రన్స్
చుట్టూ నిశ్శబ్దం,పక్షుల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించవు.అక్కడ స్టాఫ్ రోజంతా ఆ నిశ్శబ్దంతోనే గడుపుతారు.. మనం ఒక్కరోజు వెళ్లి రావటానికి బాగానే ఉంటుంది కానీ రోజంతా అక్కడ ఉండటమంటే గొప్పే అనిపించింది.స్టాఫ్ వెళ్లిన వాళ్లకి జీప్స్ అలాట్ చేయటం,ఏ టైమ్ కి ఎవరు వెళ్లారు లాంటి డిటైల్స్ నోట్ చేస్తుంటారు.ఇక్కడ గిరిజన ఉత్పత్తులు అమ్మే స్టాల్,అడవి జంతువుల విశేషాలతో ఒక మ్యూజియం కూడా వున్నాయి.
స్టాఫ్ తో మా అమ్మ
సఫారీకి తీసుకెళ్లే జీప్,డ్రైవర్
అడవిలో దారి
అడవిలో అంతా జంతువుల నీళ్ల కోసం సిమెంట్ తో సాసర్స్ లాగా కట్టారు.వేసవి కాలంలో వాటిలో నీళ్లు నింపుతారట.గంట అడవిలో ప్రయాణం తర్వాత ఒక చెరువు దగ్గరికి జీప్ తీసుకెళ్లి ఆపారు.అక్కడంతా బురద,జంతువుల పాదముద్రలు,విపరీతమైన నిశ్శబ్దం మధ్యలో పక్షుల అరుపులు చాలా వింతగా,కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది.అక్కడ గైడ్ మాకు ఈ చెరువు దగ్గరికి పులి కూడా నీళ్లు తాగటానికి వస్తుంది అంటూ పులి పాదముద్రను కూడా చూపించాడు.కాసేపు అక్కడ ఉండి,తిరిగి జీప్ లో వేరే దారిలో బయటికి వచ్చేశాము.
జంతువులు నీళ్లు తాగే చెరువు
పులి పాదముద్ర
ఎప్పుడూ శ్రీశైలం వెళ్తూ ఘాట్ రోడ్ లో అడవిని చూస్తూ బయటికే ఇలా వుంది ఇంకా లోపలి వెళ్తే ఎలా ఉంటుందో అనుకునే మా సరదా ఈ జంగిల్ సఫారీతో తీరిపోయింది.నిజంగా చాలా అద్భుతంగా,ఎప్పటికీ గుర్తుండేలా వుంది మా "జంగిల్ సఫారీ" అనుభవం
మరికొన్ని ఫోటోలు,విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.
జంగిల్ సఫారీ
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి